మాజీ అమెరికా అధ్యక్షుల్లో బిల్ క్లింటన్ పాపులర్. ఆయన పేరు చెప్పగానే గుర్తొచ్చే పేరు మోనికా లెవెన్స్కీ. ఆమె పేరుతోనే క్లింటన్ (అన్) పాపులర్ అయ్యారు. ఆ తరం వారికి ఆ కథ సుపరిచితం.
సరే ఇప్పుడిదంతా ఎందుకంటే ఆయన తాజాగా ఒక పుస్తకాన్ని విడుదల చేసారు. దాని టైటిల్ “సిటిజెన్: మై లైఫ్ ఆఫ్టర్ ది వైట్ హౌస్”.
పదవీ విరమణ తర్వాత ఆయన చేసిన ప్రజాసేవ, ప్రపంచవ్యాప్తంగా చేపట్టిన సేవాకార్యక్రమాలు, ఆయన నాయకుడిగా కంటే మనిషిగా ఎదిగిన వైనం, క్లింటన్ ఫౌండేషన్ విశేషాలు..ఇలాంటివన్నీ చాలానే ఉన్నాయి.
కానీ అందరూ ఆసక్తిగా గమనించే విషయం ఆయన మోనికా లెవెన్స్కీ ప్రస్తావన ఇందులో తెచ్చాడా అని. అవును, తెచ్చాడు. కానీ చాలా ముక్తసరిగా తన మనసులో భావాన్ని మళ్లీ చెప్పాడు.
ఆయన ప్రస్తావించిన విషయం:
ఒక సారి ఒక ఇంటర్వ్యూలో నన్ను అడిగారు- “ఆమె పేరు ఈ స్కాండల్ లో ఉండడం మీకు కరెక్ట్ అనిపించిందా?” అని.
“ఆమె పేరు పాడవడం నాకు టెరిబుల్ గా అనిపించింది. ఆమెకు సారీ చెప్పాను. నావల్ల బాధపడ్డ వాళ్లందరికీ సారీ చెప్పాను” అని చెప్పాను.
“కానీ మేము ఎంతమందిని అడిగినా మీరు ఆమెకు సారీ చెప్పలేదనే చెప్తున్నారు” అని రెట్టించాడు.
“నా చిరాకుని అణుచుకుని ..నేను ఆమెకి వ్యక్తిగతంగా కలిసి చెప్పలేదు. కానీ ఇలాంటి ఇంటర్వ్యూల్లో బహిరంగంగా చాలాసార్లు సారీ చెప్పాను..అది చాలదా! అని బదులిచ్చాను”, అని పేర్కొన్నాడు క్లింటన్.
అప్పటికీ ఇప్పటికీ తాను అమెరికా ప్రజలకి, మోనికాకి, ఆమె కుటుంబానికి అందరికీ సారీ అని మళ్లీ చెప్పాడు.
సరే ఈ విషయాన్ని పక్కనపెడితే ఈ పుస్తకంలో క్లింటన్ తన జీవనవిశేషాలు చెబుతూ చెప్పిన కొన్ని అనుభవాలు, అభిప్రాయాలు, సూక్తులు ఉన్నాయి.
వాటిల్లో కొన్ని:
– పబ్లిక్ లో ఎప్పుడూ మద్యం సేవించొద్దు, నీలాగ నువ్వు నటించాల్సి రావొచ్చు (అంటే ఆ సమయంలో మరొకరిలా జీవించే ప్రమాదముందని)
– విమర్శని సీరియస్ గా తీసుకో, పర్సనల్ గా కాదు
– పక్కవాడు తన వేడిని నీపై తోసే అవకాశమున్నప్పుడు, ఏ క్షణమైనా బార్బెక్యూ కావడానికి రెడీగా ఉండు
– నీకు గుడ్ టైం ఎంజాయ్ చేస్తున్న ఫీలింగొస్తే, నువ్వు వేరే చోట ఉన్నట్టు
– నీ మనసు చిన్న విషయానికే నొచ్చుకుంటోందంటే, నువ్వు కోపంలోనో, అలసటలోనో ఉన్నట్టు
– నీ ఫీలింగ్స్ ని వర్క్ లోకి తీసుకురావాలంటే, ఎప్పుడూ చేసే పని కాకుండా వేరే పని చేయి
మొత్తానికి ఈ పుస్తకం ఒక అమెరికా మాజీ అధ్యక్షుడి జీవనచిత్రం. మరీ ముఖ్యంగా ఆయన చేస్తున్న ప్రపంచప్రజాసేవ, దేశాధినేతలతో ప్రజాసేవ నిమిత్తం ఇప్పటికీ నెరపుతున్న సంబంధాలు అవీ చూస్తుంటే ఈయన కీర్తికంటే ఆత్మసంతృప్తినే నమ్ముకుని శేషజీవితం గడుపుతున్నట్టు అనిపిస్తుంది.
వ్యక్తిత్వవికాసాన్ని కోరుకునే వాళ్లు ఈ పుస్తకాన్ని ఒకసారి చదవొచ్చు. ప్రపంచ చరిత్రలో అగ్రదేశాధినేతగా పనిచేసిన వ్యక్తియొక్క జీవితం నుంచి ఎంతో కొంత నేర్చుకోవడానికి దొరకకపోదు. వీలుంటే చదివే ప్రయత్నం చేయొచ్చు.
పద్మజ అవిర్నేని
Call boy jobs available 9989793850
It is Clintons mistake not make her swallow without sp!tting on her inner wear. No charity can erase the tarnish he earned. Charity also has an agenda like Gates foundation.
vc available 9380537747
ఇప్పట్లో.. నువ్వు VC ఇస్తానంటున్నావు… అప్పట్లో.. అయన.. ఆవిడ ఇద్దరు.. ఇచ్చుకునే.. పెద్ద అపప్రద మూట కట్టుకున్నాడు. ఇప్పుడు మల్లి నీ ఈ VC ఎందుకులే.. ఏం కొంపలు మునుగుతాయో!
😀