తొలి రోజు ఏకంగా 17 వికెట్లు పడ్డాయి. సీమర్లకు స్వర్గధామంలా కనిపించింది, అసలు ఇలాంటి పిచ్ లపై టెస్టులు నిర్వహించడమా అంటూ రెండో రోజు ఉదయం కామెంటరేటర్లు చర్చ మొదలుపెట్టారు! ఉపఖండంలో స్పిన్ ట్రాక్ లపై బ్యాటర్లు అపసోపాలు పడుతుంటే అలాంటి పిచ్ ల మీద మ్యాచ్ లు నిర్వహించడంపై విమర్శలు వస్తూ ఉంటాయని, అయితే ఇలా సీమ్ ట్రాక్ లపై మాత్రం విమర్శలు రావేమీ అంటూ ఒక విదేశీ కామెంటరేటర్ అంటే, రవిశాస్త్రి కాస్త కవర్ చేసే ప్రయత్నం చేశారు. బహుశా టీమిండియా పేసర్లు విజృంభించడంతోనో ఏమో కానీ.. రవి మాట్లాడుతూ.. పిచ్ ను పెద్దగా తప్పు పట్టాల్సిన అవసరం లేదని, బౌలర్లు రాణించారని వ్యాఖ్యానించారు. అయితే ఆ తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది.
ఆస్ట్రేలియన్ టైలెండర్లను పెవిలియన్ కు పంపడానికి టీమిండియా బౌలర్లు శ్రమ పడటంతో మొదలుపెడితే, రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ లో భారత ఓపెనర్ల ను ఆసీస్ బౌలర్లు ఏ మాత్రం ఇబ్బంది పెట్టలేకపోయారు! తొలి ఇన్నింగ్స్ లలో రెండు జట్లూ దాదాపు 50 ఓవర్లకు ఆలౌట్ అయ్యాయి, అయితే టీమిండియా రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ లో 50 ఓవర్లను ఓపెనర్లే ఆడేశారు! ఈ మ్యాచ్ లో తొలి వంద ఓవర్లలో 20 వికెట్లు పడితే, ఆ తర్వాతి 50 ఓవర్లలో ఒక్కటంటే ఒక్క వికెట్ పడలేదు! ఒకటీ అర అవకాశాలను ఆసీస్ మిస్ చేసుకుంది. భారత ఓపెనర్లు యశస్వి జైశ్వాల్, కేఎల్ రాహుల్ లు జాగ్రత్తగా అయితే ఆడారు. తొలి ఇన్నింగ్స్ ఫెయిల్యూర్ ను దృష్టిలో ఉంచుకుని ఆచితూచి ఆడారు. అయితే ఎక్కడ మరీ ఇబ్బంది పడిపోలేదు. కాస్త కుదరుకున్నాకా మంచి మంచి షాట్లను ఆడారు.
అసలు తొలి రోజు ఆడింది ఈ పిచ్ మీదేనా అనే సందేహాన్ని కలిగించే స్థాయిలో రెండో రోజు ఆట సాగింది. తొలి రోజు పచ్చగా కనిపించిన పిచ్ రెండో రోజు ఎండిన గడ్డితో రంగు మారిపోయింది. ప్రతి యాభై ఓవర్లకూ పది వికెట్లు పడిపోయే పరిస్థితి నుంచి యాభై ఓవర్ల పాటు ఒక్క వికెట్ కూడా పడని రీతిలో మారిపోయింది. కేవలం పిచ్ మీద నెపం నెట్టడం కాదు కానీ, భారత బౌలర్లతో పోలిస్తే ఆసీస్ బౌలర్లు వెలవెలబోయారు కూడా! ఇలాంటి సీమ్ వికెట్లపై
తమకు తిరుగులేదు, వారు వరల్డ్ క్లాస్ బౌలర్లు అనుకున్న కమ్మిన్స్, స్టార్క్, హజల్ వుడ్ త్రయం మొదటి ఇన్నింగ్స్ స్థాయిలో కూడా బౌల్ చేయలేదు. పది ఓవర్ల పాటు వికెట్ పడకపోయే సరికే వారిలో ఫ్రస్ట్రేషన్ మొదలైపోయింది. అది క్రమంగా పీక్స్ కు చేరిపోయింది. దీంతో బౌలింగ్ కూడా క్రమంగా గాడి తప్పింది. నోబాల్స్ పడ్డాయి, బౌన్సర్లు వైడ్ లుగా ఫోర్ లైన్ ను చేరాయి.
స్థూలంగా తాము వందకు ఆలౌట్ అయిన తర్వాత భారత ఓపెనర్లే వంద రన్నులను పూర్తి చేసే సరికి ఆసీస్ జట్టులో స్పష్టమైన అసహనం కనిపించింది. రనౌట్ ఛాన్స్ మిస్ చేసుకున్నారు. ఒక క్యాచ్ ను క్యారీ చేయలేపోయారు. కీలకమైన తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో కలుపుకుంటే.. టీమిండియా రెండో రోజు ముగిసే సరికి 218 పరుగుల లీడ్ ను సంపాదించింది. ఇంకా చేతిలో పది వికెట్లున్నాయి. బంతి పాతబడటంతో ఇంకో ముప్పై ఓవర్ల పాటు ఆసీస్ బౌలర్లు అద్భుతాలు చేసే అవకాశాలు కూడా దాదాపు లేనట్టే.
టీమిండియా ఆధిక్యం మూడు వందలు దాటిందంటే.. అక్కడ నుంచి మ్యాచ్ ఆసీస్ కు దూరం అవుతున్నట్టే! నాలుగో ఇన్నింగ్స్ లో ఏ జట్టు అయినా మూడు వందలకు మించిన ఆధిక్యాన్ని చేధించిన దాఖలాలు చరిత్రలో అరుదుగా ఉన్నాయి. చేతిలో ఎలాగూ పది వికెట్లున్నాయి, ఇంకా కావాల్సినంత సమయం కూడా ఉంది కాబట్టి.. టీమిండియా తమ ఆధిక్యాన్ని నాలుగు వందల స్థాయికి తీసుకెళ్లినా తీసుకెళ్లొచ్చు. మొత్తానికి బోర్డర్- గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్టు ఎలాగో మొదలై.. ఎలాగెలాగో సాగుతూ ఉంది!
Rahul got another 20 opportunities with this performance. Doors shut for Pujara and Rahane.
Rahul bags another 20 opportunities with this performancex. Doors shutt for Pujara and Rahane.
Rahul bagsx another 20 opportunities with this performancex. Doors shutt for Pujara and Rahane.
Rahull bagss another 20 opportunitiesx with this performancex. Doors shutt for Pujara and Rahane.
Sss
Rahull bagss another 20 opportunitiesx with this performancex. Doors shutt for Pujara and Rahane.
పెర్త్ టెస్ట్ వికెట్ గురించి ఐడియా ఉంటె.. ఇలా రాసేవాళ్ళే కాదు..
కామెంటేటర్లు ఈ విషయం చెప్పరు .. చెప్పలేరు..
..
పెర్త్ వికెట్ ఎప్పుడు ఎలా మారుతుందో.. క్యూరేటర్స్ కూడా చెప్పలేరు..
..
నా చిన్నప్పుడు..యాషెస్ సిరీస్ లో పెర్త్ టెస్ట్ లో నాలుగో రోజు .. ఆస్ట్రేలియా 224 పరుగులకు గాను గెలవడానికి ఇంకా 40 పరుగులు కావాలి.. చేతిలో 7 వికెట్లు ఉన్నాయి..
అంతా ఆస్ట్రేలియా గెలిచిపోయింది అనుకొన్నారు.. అప్పుడే లైట్ తగ్గింది..
కెప్టెన్ స్టీవ్ వా క్రీజ్ లో ఉన్నాడు.. ఈ రోజే మ్యాచ్ అవగొట్టేసి ఇంటికి వెళ్లిపోవచ్చు.. ఒక రోజు మిగులుతుంది అనుకొన్నాడు..
..
అప్పుడు ఇంగ్లాడ్ నుండి డారెన్ గాఫ్ బౌలింగ్ లో రెండు ఓవర్లలో 4 వికెట్లు పడిపోయాయి.. ఆస్ట్రేలియా ఇంకా 36 పరుగులు కావాలి.. 3 వికెట్లు మాత్రమే ఉన్నాయి..
అప్పుడు హడావుడిగా లైట్ కారణం తో మ్యాచ్ ఆపాలని ఆస్ట్రేలియా బ్యాట్సమెన్ అడిగారు..
కానీ లైట్ కూడా మెరుగుపడింది..
ఇక.. ఫైనల్ గా ఇంగ్లాండ్ 22 పరుగుల తేడాతో గెలిచేసింది.. ఆతర్వాత యాషెస్ కూడా గెలిచేసింది..
..
ఆ ఒక్క గంట మ్యాచ్.. ఏమైందో.. ఆ బాల్స్ ఎంతలా స్వింగ్ అయ్యాయో.. చూస్తున్న వాళ్లకు కళ్ళు తెలేసేసారు..
ఆస్ట్రేలియా లో పెర్త్, బ్రిస్బేన్.. సౌత్ ఆఫ్రికా లో డర్బన్.. ఇంగ్లాండ్ లో ఎడ్జిబస్టన్ .. వెస్ట్ ఇండీస్ లో సెయింట్ జార్జ్ స్టేడియంస్ లో క్రికెట్ ఆడటం ఎంత కష్టమో.. చూడటం లో అంత మజా ఉంటుంది..
మీరు ఇంత డీటెయిల్ గ రాస్తే మా వంకాయ్ అక్క కి ఎం అర్ధం అవుతుంది సర్…
Yemi chestadi. Kallu telestadi
Elections ki mundu rangulaku CBN 3200 crores, PK 2500 crores YCP govt vesindi annaru. Monna assembly lo 101 crores annaru…. Same Perth pitch laagaa swing bowling vesarantav…
Elections ki mundu rangulaku CBN 3200 crores, PK 2500 crores YCP govt vesindi annaru. Monna assembly lo 101 crores annaru…. Same Perth pitch laagaa swing bowling vesarantav…
vc estanu 9380537747
vc available 9380537747
Call boy works 7997531004
vc estanu 9380537747