సంక్రాంతికి ఎన్ని సినిమాలొచ్చినా అందులో ఒక్కటైనా డబ్బింగ్ సినిమా ఉండాల్సిందే. అదో ఆనవాయితీ. ఓవైపు థియేటర్ల కొరత ఉన్నా, మరోవైపు జనాలు పట్టించుకోరని తెలిసినా, ఇంకోవైపు డబ్బులు రావనే క్లారిటీ ఉన్నా.. సంక్రాంతికి డబ్బింగ్ సినిమాల్ని రిలీజ్ చేసేందుకు కొందరు ఆసక్తి చూపిస్తుంటారు. వాళ్ల లెక్కలు వాళ్లవి.
ఈ సంక్రాంతికి కూడా డబ్బింగ్ బొమ్మ రెడీ. అజిత్ హీరోగా నటించిన ‘విడాముయర్చి’ సినిమాను సంక్రాంతికి తీసుకొస్తున్నారు. ఈ మేరకు లైకా ప్రొడక్షన్స్ అధికారిక ప్రకటన చేసింది. తేదీ ఇంకా ఫిక్స్ చేయలేదు.
ఈమధ్య వస్తున్న డబ్బింగ్ సినిమాలకు తెలుగులో టైటిల్ మార్చడం లేదు. కాబట్టి ఈ సినిమా కూడా అదే పేరుతో తెలుగులో వస్తే ఆశ్చర్యపోనక్కర్లేదు. రీసెంట్ గా వేట్టయన్ వచ్చినట్టు. అది కూడా లైకా వాళ్లదే.
అజిత్ సినిమా సంక్రాంతికి రావడం కొత్తేంకాదు. గతంలో అతడు నటించిన తునివు అనే సినిమా తెగింపు పేరుతో సంక్రాంతికి వచ్చింది. ఇప్పుడీ విడాముయర్చి రెడీ అయింది. ఈ సినిమా ప్రకటనతో.. మైత్రీ నిర్మాతలు తీస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ సంక్రాంతికి రాదని తేలిపోయింది.
గ్యాంబ్లర్ తర్వాత అజిత్-త్రిష కలిసి చేస్తున్న సినిమా ఇది. రెజీనా, అర్జున్ కీలక పాత్రలు పోషించారు. అనిరుధ్ సంగీతం అందించాడు. తాజాగా టీజర్ రిలీజ్ చేశారు.
Call boy jobs available 7997531004