రాజకీయ నిరాసక్తతలో మాజీ డిప్యూటీ

ఉమ్మడి విశాఖ జిల్లాలోని మాడుగుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రెండుసార్లు వరసగా గెలిచిన బూడి ముత్యాలనాయుడుకు 2019 ఎన్నికల తరువాత అనూహ్యంగా ఉప ముఖ్యమంత్రి పదవి దక్కింది. ఇక 2024 ఎన్నికలలో మూడవసారి మాడుగుల…

ఉమ్మడి విశాఖ జిల్లాలోని మాడుగుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రెండుసార్లు వరసగా గెలిచిన బూడి ముత్యాలనాయుడుకు 2019 ఎన్నికల తరువాత అనూహ్యంగా ఉప ముఖ్యమంత్రి పదవి దక్కింది. ఇక 2024 ఎన్నికలలో మూడవసారి మాడుగుల నుంచి గెలిచి హ్యాట్రిక్‌ ఎమ్మెల్యే కావాలని అనుకున్నారు.

కానీ వైసీపీ అధినాయకత్వం ఆయనను అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేయించింది. ఇష్టం లేకపోయినా పార్టీ మాట మీద పోటీ చేసిన ముత్యాలనాయుడు టీడీపీ కూటమి ప్రభంజనంలో ఓటమిపాలు అయ్యారు. ఆ తరువాత నుంచి ఆయన రాజకీయంగా పెద్దగా ఆసక్తిని చూపించడంలేదు అని ప్రచారం సాగుతోంది వైసీపీ హైకమాండ్‌ ఆయనను అనకాపల్లి జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా నియమించింది.

అయితే ఆ పదవిలో ఆయన ఉన్నా పెద్దగా చురుకుదనం చూపించడంలేదు. పార్టీ పరంగా కూడా పెద్దగా కదలిక అక్కడ లేకుండా పోతోందని అంటున్నారు. ఆయనకు పార్టీకి విధేయుడుగా ఉంటూ వచ్చారనే జగన్‌ ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు.

అయితే ఓటమి తరువాత బూడి రాజకీయంగా కొంత వైరాగ్యభావాలను ప్రదర్శిస్తున్నారు అని అంటున్నారు. అయితే అదేమీ లేదని కూటమి ప్రభుత్వానికి కొంత సమయం ఇచ్చి ఆయన రంగంలోకి దిగుతారని ఆయన వర్గం అంటోంది. ఏది ఏమైనా బూడిలో అంతర్లీనంగా అసంతృప్తి అయితే ఉందనే అంటున్నారు.

10 Replies to “రాజకీయ నిరాసక్తతలో మాజీ డిప్యూటీ”

  1. ఏమన్నా అనుకోండి GA గారూ… ఉప ముఖ్యమంత్రి అనే పదవికి ఒక స్టేటస్ వచ్చింది పవన్ గారి వల్లే

Comments are closed.