వాలంటీర్ల‌కు ఇంకా ఆశ చావ‌క‌…!

వైసీపీ ప్ర‌భుత్వం గ్రామ‌, వార్డు స‌చివాల‌య వ్య‌వ‌స్థ‌కు వార‌ధిగా ప‌ని చేసేందుకు వాలంటీర్ల‌ను తీసుకొచ్చింది. నెల‌కు రూ.5 వేల గౌర‌వ వేత‌నంతో అమూల్య‌మైన సేవ‌లు అందించారు. అతి త‌క్కువ వేత‌నం అయిన‌ప్ప‌టికీ, సొంతూళ్లో వ‌చ్చిన‌కాడికి…

వైసీపీ ప్ర‌భుత్వం గ్రామ‌, వార్డు స‌చివాల‌య వ్య‌వ‌స్థ‌కు వార‌ధిగా ప‌ని చేసేందుకు వాలంటీర్ల‌ను తీసుకొచ్చింది. నెల‌కు రూ.5 వేల గౌర‌వ వేత‌నంతో అమూల్య‌మైన సేవ‌లు అందించారు. అతి త‌క్కువ వేత‌నం అయిన‌ప్ప‌టికీ, సొంతూళ్లో వ‌చ్చిన‌కాడికి చాల్లే, సేవ చేయ‌డం వ‌ల్ల వ‌చ్చే సంతృప్తే ఎంతో గొప్ప‌ద‌ని వాలంటీర్లు భావించారు.

ఎన్నిక‌ల ప్ర‌చారంలో చంద్ర‌బాబు వాలంటీర్లకు భారీ ఆశ పెట్టారు. తాము అధికారంలోకి వ‌స్తే రూ.5 వేల‌ను రెట్టింపు చేసి, రూ.10 వేలు ఇస్తాన‌ని ప్ర‌క‌టించారు. అది కూడా ఉగాది ప‌ర్వ‌దినం నాడు హామీ ఇచ్చారు. ఆశ చెడ్డ‌ది క‌దా! సుదీర్ఘ రాజ‌కీయ, ప‌రిపాల‌న అనుభ‌వం ఉన్న చంద్ర‌బాబునాయుడు త‌మ‌లాంటి చిన్న సేవ‌కుల‌కు ఇచ్చిన మాట నిల‌బెట్టుకుంటార‌ని న‌మ్మారు. కూట‌మి గెలుపు కోసం చాలా మంది వాలంటీర్లు క‌ష్ట‌ప‌డ్డారు.

కూట‌మి అధికారంలోకి వ‌చ్చింది. మ‌ళ్లీ త‌మ‌ను విధుల్లోకి తీసుకుంటార‌ని, రూ.10 వేలు గౌర‌వ వేత‌నం వ‌స్తుంద‌ని ఆశించారు. అయితే వాలంటీర్ల ఊసే ఎత్త‌డం లేదు. డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఏకంగా అస‌లా వ్య‌వ‌స్థే లేద‌ని, ఇక ర‌ద్దు చేయ‌డం మాటే ఉత్ప‌న్నం కాద‌ని చావు క‌బురు చ‌ల్ల‌గా చెప్పారు. దీంతో వాలంటీర్లు ఒక్క‌సారిగా షాక్‌కు గుర‌య్యారు. అయిన‌ప్ప‌టికీ వాలంటీర్ల‌కు ఆశ చావ‌డం లేదు.

రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌తి రోజూ ఏదో ఒక క‌లెక్ట‌రేట్ ఎదుట త‌మ‌కు న్యాయం చేయాలంటూ ధ‌ర్నా చేస్తున్నారు. కేవ‌లం రూ.10 వేల వేత‌నం కోసం ఇంత‌గా పోరాటం చేస్తున్నారంటే, నిరుద్యోగం, జీవితం ఎంత దుర్భ‌రంగా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. అయిన‌ప్ప‌టికీ ప్ర‌భుత్వం వాలంటీర్ల‌ను విధుల్లోకి తీసుకునే ఆలోచ‌న‌లో లేదు.

23 Replies to “వాలంటీర్ల‌కు ఇంకా ఆశ చావ‌క‌…!”

  1. ///5 వెల వెతనం తొ అమూల్యమయిన సెవలు అందించారు///

    .

    ఇప్పుడు వాళ్ళు లెరు, పెన్షన్ ఎవరికన్నా అందటం లెదా? ఎమన్న తెడా తెలుస్తుందా?

    వాళ్ళు అమూల్యమయిన సెవలు అందించింది Y.-.C.-.P నయకులకె! నిన్నె GA రాసాడు. అసలు ఉచ్చిత బీయం 10% కూడా ఎవరూ వాడుకొరు అని. మరి దాని కొసం జగన్ బొమ్మతొ ఒక వ్యాను, ఒక డ్రైవెరు, పెట్రొలు ఎంత కర్చు?? ఎంత ఆర్బాటం??

    జగన్ పాలన అంత ఆర్బాటం, డబ్బ కొట్టుకొటానికె!

    1. తిరిగి రిటర్న్ లో బియ్యం తెచ్చు కోవటానికి వెసులు బాటు గ ఉంటుందని వాన్ లు కొన్నారు

  2. ఎవరన్న చదువుకున్నం ఉద్యొగాలు కల్పించండి అంటారు. ఇలా వాలెంట్రీ గిరికి ఎగబడుతున్నరు అంటె ఈ రాష్ట్రం ఎ అబిరుద్ది లెకుండా ఎంత నాశనం అయ్యిందొ తెలుస్తుంది!

    ఇప్పుడన్న రాజాదాని, పొలవరం పూర్తి చెసి, రొడ్లు ములిక వసతలు కల్పించి పెట్తుబడులు తీసుకు వస్తె, కొoచం ఆలస్యం అయినా ఉద్యొగాలు అవె వస్తాయి.

  3. కరోనా టైం లో బాగా ఉపయోగపడ్డారు. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితిలో అవసరం లేదు . గోవేర్నమేంట్ ప్రభుత్వ ఉద్యోగుల శాలరీ , సంఖ్య కూడా సాద్య మైనంత తగ్గిస్తే కొంత ఉపశమనం రాష్ట్ర ఖజానా మెజారిటీ శాలరీ, పెన్షన్ ల కె పోతుంది.

    1. జీతాలు కచ్చితం గ తగ్గించాలి బతకలేని వాడికే ప్రభుత్వ వుద్యోగం ఉండాలి పేదలకు మాత్రమే ప్రభుత్వోద్యోగాలి ఇవ్వాలి మేము చదివేటప్పుడు అంటే అరవై దశకంలో ప్రభుత్వ స్కూల్ లో చాల బాగా చెప్పేవారు ప్రతి విద్యార్థిని టీచర్ పట్టించుకొనేవారు అప్పట్లో జీతాలు తక్కువగా ఉండి వేరే ఏ వ్యాపకం లేకుండా విద్యార్థులకు బోధించే వారు ఇప్పుడు జీతాలు పెరిగి వ్యాపకాలు పెరిగి బోధన వృత్తిని అన్యాయం చేస్తున్నారు

  4. 8 నెలలయింది. డబల్ ఇంజిన్ అన్నారు…మట్ట కిడస పోయింది.

    ప్రజలని పీక్కు తింటున్నారు…రాబంధువుల్లాగా…మూడు జెండాలు మోసే ముప్పావలా కూలీగాళ్ళకి గంజాయి సప్లై చేసే పచ్చ సాని పుత్రులు ఎక్కడ పడితే అక్కడ దోచుకుంటున్నారు…అడిగే గింజ పవలగాడికి లేదు….అదేమంటే కేంద్రం, మోడీ అంటాడు…

    అదేమంటే అడిగాము అంటాడు….వచ్చేదో సచ్చేదో దేవుడికే తెలియాలి.

    పెన్షన్లు…మట్ట కిడస…

    చెంగోబెట్టి వందనం…మట్ట కిడస…

    తొంగోబెట్టే సరాబుడ్డి…మట్ట కిడస…

    GST…మట్ట కిడస…

    వాలంటీర్లు…మట్ట కిడస…

    సచివాలయ ఉద్యోగులు …మట్ట కిడస…

    టోల్ రోడ్లు…మట్ట కిడస…

    అప్పులు…మట్ట కిడస…

    భ్రమరావతి…మట్ట కిడస…

    ఏమి చేసార్రా…అంటే ఒకడిది ఒకడు పిసుక్కోవడమే!

    డబల్ ఇంజిన్ వుండి పరిపాలన చేతకాని అసమర్ధులని గెలిపించారు…

    కళ్లారా 5 ఏళ్ళు ఏడవండి.

    మీరు ఏడవకపోయిన అలాగా జనం మిమ్మల్ని ఏడిపిస్తారు.

    1. నువ్వు ఇంక జీవితాంతం ఏడవటమే, కూటమి పరిపాలన చూసి కడుపు మండి ఇలా ఏడుస్తూనే ఉంటావు, ఆ దద్దమ్మ గాన్ని మరిచిపోయి వాడి చె*ల్లె*లి పార్టీలో చేరు కనీసం చెప్పుకోవటానికి పార్టీ అయినా ఉంటుంది

  5. ఎన్నికల వేళ వాలంటీర్లు న్యూట్రల్ గా ఉండి ఉంటె కూటమి కట్చితంగా వాలంటీర్లను కొనసాగించేది…. ఎన్నికల వేళ కూటమి వాలంటీర్లను రాజీనామాలు చెయ్యొధ్ధు, వైకాపా ప్రభుత్వం తరుపున ప్రచారం చెయ్యొద్దు అని కోరింది…. దాదాపు లక్ష మంది రాజీనామాలు చేసి మరీ వైకాపా కి ప్రచారం చేశారు…. ఇంకో లక్ష మంది రాజీనామా చెయ్యకుండా తెర చాటు గా ప్రచారం చేశారు…. ప్రత్యర్థి పార్టీ మనుషులు అని తెలిసి మళ్ళీ వాలంటీర్లను నమ్మి కూటమి ప్రభుత్వం ఎలా కొనసాగిస్తుంది….

  6. MLA లు జగన్ తో ఉంటే కార్యకర్తలు ధైర్యం గా మాట్లాడలేరు కాబట్టి MLA లు ఉండకూడదు. సరే.

    మరి MLA ల బాధ ఎవడు వింటాడు? వాలంటీర్ల వల్ల మా అవసరం, పరిచయం కూడా ప్రజలకి లేకుండా పోయింది అనే కదా మొదటి నుంచి MLA ల గోల? మరి అది జగన్ కి చెప్పుకోవద్దా?

  7. అసలు ఈ అయిదు వేల రూపాయలకు కూడా ఇంత హడావిడి అవసరమా ఇళ్ళకాడ పాచిపనులు చేసే మనిషి కూడా రావటం లేదు

Comments are closed.