పార్టీ క‌మిటీలు వేయాల‌ని జ‌గ‌న్ ఒత్తిడి

ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా ఎవ‌రైనా మాట్లాడితే కేసులు పెడుతున్నారు. అందుకే నాయ‌కులు ఇప్పుడిప్పుడే ఎందుకులే అని దూరంగా వుంటున్నారు.

వైసీపీకి సంబంధించి వివిధ అనుబంధ క‌మిటీల‌ను త్వ‌ర‌గా వేయాల‌ని ఆ పార్టీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి జిల్లా అధ్య‌క్షుల‌పై తీవ్ర ఒత్తిడి చేస్తున్నారు. సంక్రాంతి త‌ర్వాత కార్య‌క‌ర్త‌ల‌ను క‌లుసుకునేందుకు వ‌స్తున్న నేప‌థ్యంలో కమిటీల‌న్నీ పూర్తిగా వేయాల‌నేది జ‌గ‌న్ భావ‌న‌. అంతేకాదు, రానున్న రోజుల్లో ప్ర‌భుత్వంపై ఆందోళ‌న‌ల‌కు సిద్ధం కావాలంటే అనుబంధ క‌మిటీల‌ను కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల‌తో నింపాల‌ని జ‌గ‌న్ భావిస్తున్నారు.

అందుకే పార్టీ జిల్లా అధ్య‌క్షుల‌పై అధిష్టానం నుంచి తీవ్ర ఒత్తిళ్లు వ‌స్తున్నాయి. త్వ‌ర‌గా పార్టీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల పేర్లు పంపాల‌ని ప్ర‌తిరోజూ ఫోన్లు చేస్తున్న‌ట్టు చెబుతున్నారు. అధికారం కోల్పోయిన త‌ర్వాత వైసీపీ శ్రేణులు తీవ్ర నిరాశ‌నిస్పృహ‌లో ఉన్న సంగ‌తి తెలిసిందే. అయితే కూట‌మి పాల‌న ఆరేడు నెల‌ల‌కే వైసీపీ శ్రేణులు నెమ్మ‌దిగా కోలుకుంటున్నాయి.

కూట‌మి స‌ర్కార్ వేధింపుల‌తో శ్రేణుల్లో జ‌గ‌న్‌పై వ్య‌తిరేక‌త కాస్త‌, ప్ర‌భుత్వ పెద్ద‌ల‌పై ట‌ర్న్ అవుతోంది. వైసీపీ మ‌ళ్లీ పుంజుకుంటున్న‌దంటే, అదంతా కూట‌మి స‌ర్కార్ పుణ్య‌మ‌నే చెప్పాలి. పార్టీ ప‌ద‌వుల‌పై ఎక్కువ మంది ఆస‌క్తి చూపుతున్నారు. అయితే ప్ర‌త్య‌క్ష పోరాటాలంటే ఎంత మంది ముందుకొస్తార‌నేది ప్ర‌శ్నార్థ‌కంగా వుంది.

ఎందుకంటే, ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా ఎవ‌రైనా మాట్లాడితే కేసులు పెడుతున్నారు. అందుకే నాయ‌కులు ఇప్పుడిప్పుడే ఎందుకులే అని దూరంగా వుంటున్నారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు ప‌ని చేసే వాళ్ల‌కే ప్రాధాన్యం వుంటుంద‌ని జ‌గ‌న్ తియ్య‌టి మాట‌లు చెబుతూ, ఉత్సాహ‌ప‌రుస్తున్నారు. ఏది ఏమైనా వైసీపీ అనుబంధ క‌మిటీల‌పై సీరియ‌స్ క‌స‌ర‌త్తు జ‌రుగుతోంది.

13 Replies to “పార్టీ క‌మిటీలు వేయాల‌ని జ‌గ‌న్ ఒత్తిడి”

  1. తన అధికారం కోసం నాయకులకు పార్టీ పదవులు ఆ ఆశ చూపడం.. గెలిచాక (గెలిస్తే ) వాళ్ళ నోళ్ళల్లో మట్టి కొట్టడం.. మన జగన్ రెడ్డి కి తిరుమల లడ్డుతో పెట్టిన విద్య..

    ఇంకెన్ని సార్లు మోసం చేస్తాడు జనాలను.. ఇంకెవడు నమ్ముతాడు ఈ వట్టిపోయిన సింగల్ సింహాన్ని..

    1. మా అన్నయ్య దగ్గర ఉన్నవి గొర్రెలు కాబట్టి మా అన్నయ్య ఏం చెప్పినా నమ్ముతాయి..

      1. Aa gorrle super six ki vote vesi ippudu electric charges penchinapoudu moosukuntunnaru, super 2 koodaa raaledu. Amaravathi ki maatram vela kotlu. NRI laki special services, roju ko abaddam, 70k crores + appulu just 6 months lo. Ask TDP to govern first , honour their election promises.

      2. హానెస్ట్ గొర్రె బి.డ్డ మీకు రెస్పాండ్ చేశాడు..వాళ్ల లీడర్ లాగా ఈయన కూడా చాలా హానెస్ట్ అనుకుంటా..కామెడీ గా..

  2. BITS in AP: అమరాతిలో మరో ప్రతిష్టాత్మక విద్యా సంస్థ.. భూమి పరిశీలనలో బిట్స్, యాభై ఎకరాల్లో ఏపీ క్యాంపస్

  3. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే కేసులు పెడుతున్నారా?! లేకపోతే అసభ్య పదజాలంతో వ్యక్తిగత దూషణలకు దిగితే కేసులు పెడుచున్నారా?! రెంటికీ చాలా తేడా ఉంది!

    1. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్ట్ పెడితే అరెస్ట్ చేసిన పార్టీ గ్యారా(11) కి పడిపోయింది..

      ఇప్పుడు ఉన్న ప్రభుత్వం అసభ్య పదజాలంతో వ్యక్తిగతంగా పెడితేనే కేసులు పెడుతుంది..

      వై-ఛి-పి కి కూడా ఆ క్లారిటీ ఉంది..ఒప్పుకోరు అంతే

  4. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్ట్ పెడితే అరెస్ట్ చేసిన పార్టీ గ్యారా(11) కి పడిపోయింది..

    ఇప్పుడు ఉన్న ప్రభుత్వం అసభ్య పదజాలంతో వ్యక్తిగతంగా పెడితేనే కేసులు పెడుతుంది..

    వై-ఛి-పి కి కూడా ఆ క్లారిటీ ఉంది..ఒప్పుకోరు అంతే

Comments are closed.