ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ డైలాగ్స్‌లా ఉన్నాయ్‌!

ధాన్యం కొనుగోలుపై మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్ మాటలు పరుచూరి బ్రదర్స్ డైలాగ్స్‌లా ఉన్నాయని మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స స‌త్య‌నారాయ‌ణ వెట‌క‌రించారు.

ధాన్యం కొనుగోలుపై మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్ మాటలు పరుచూరి బ్రదర్స్ డైలాగ్స్‌లా ఉన్నాయని మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స స‌త్య‌నారాయ‌ణ వెట‌క‌రించారు. సోమ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ విశాఖ డ్ర‌గ్స్ విష‌యంలో ఎన్నిక‌ల సంద‌ర్భంలో త‌మ‌పై కూట‌మి నేత‌లు దుష్ప్ర‌చారం చేశార‌ని మండిప‌డ్డారు. త‌ద్వారా ఎన్నిక‌ల్లో రాజ‌కీయంగా ప్ర‌యోజ‌నం పొందార‌న్నారు.

విశాఖ డ్ర‌గ్స్ వ్య‌వ‌హారంపై తాను మ‌ళ్లీ కేంద్రానికి లేఖ రాస్తున్న‌ట్టు బొత్స తెలిపారు. కంటైన‌ర్‌లో 25 వేల కిలోల డ్ర‌గ్స్ వ‌చ్చింద‌ని పెద్ద ఎత్తున కూట‌మి నేత‌లు ప్ర‌చారం చేశార‌న్నారు. కానీ ఆ కంటైన‌ర్‌లో డ్ర‌గ్స్ లేద‌ని సీబీఐ తేల్చి చెప్పింద‌న్నారు. దీంతో విశాఖ‌పై డ్ర‌గ్స్ మ‌చ్చ పోయింద‌ని ఆయ‌న అన్నారు. అధికారుల‌పై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవాల‌నే విష‌య‌మై కేంద్ర హోంశాఖ మంత్రికి లేఖ రాస్తాన‌న్నారు. కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌లు మేనేజ్‌కు గురైతే ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌రువు పోతుంద‌న్నారు.

సిట్ రిపోర్ట్‌ను బ‌య‌ట పెట్టాల‌ని కేంద్ర హోంశాఖ‌కు లేఖ రాస్తాన‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాటం చేయాల‌ని పార్టీ నిర్ణ‌యించిన‌ట్టు బొత్స తెలిపారు. రైతాంగ ఇబ్బందుల‌పై ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకోవాల‌ని బొత్స కోరారు. ఈ నెల 13న రాష్ట్ర వ్యాప్తంగా క‌లెక్ట‌ర్ల‌కు విన‌తిప‌త్రాలు స‌మ‌ర్పిస్తామ‌న్నారు. అలాగే ఈ నెల 27న విద్యుత్ చార్జీలు పెంపును నిర‌సిస్తూ విద్యుత్ కార్యాల‌యాల్లో వినతిప‌త్రాలు అంద‌జేస్త‌మ‌న్నారు.

విద్యుత్ భారాల‌ను ప్ర‌జ‌ల‌పై వేయ‌కుండా ప్ర‌భుత్వ‌మే భ‌రించాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. విద్యార్థుల‌పై ఫీజురీయింబ‌ర్స్‌మెంట్ విడుద‌ల చేయాల‌ని కోరుతూ జ‌న‌వ‌రి 3న సంబంధిత అధికారుల‌కు విన‌తిప‌త్రాలు స‌మ‌ర్పిస్తామ‌న్నారు. వైసీపీ హ‌యాంలో నాడు-నేడు కార్య‌క్ర‌మంలో చేప‌ట్టిన అభివృద్ధి ప‌నులు పేరెంట్ మీటింగ్‌లో క‌నిపించాయ‌ని, ఇందుకు సీఎం చంద్ర‌బాబుకు ధ‌న్య‌వాదాల‌ని బొత్స అన్నారు.

9 Replies to “ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ డైలాగ్స్‌లా ఉన్నాయ్‌!”

  1. అయ్యో, డ్రగ్స్ కంటైనర్ అని చెంబుగాడు కాకిలా అరిచి చెప్పినవన్నీ అబద్దాలేనా?

    మళ్ళీ చెంబు & కో మళ్ళీ వెర్రిపప్పలు అయ్యరా. వీళ్ళతోపాటు పచ్చతమ్ముళ్లని, వీడ్ని నమ్మిన జనాల్ని కొండెర్రిపప్పల్ని చేసాడుగా.

    అట్లుంటది చెంబు తోని.

  2. నిజాయతీకి అంత విలువ ఉంటుంది సత్తిబాబు

    నువ్వు చెప్పు పరుచూరి డైలాగ్ జపనీస్ లో వినాలని ఉంది

  3. వైఎస్ఆ*ర్ మ*రణం మీద విజ*యమ్మ కోరి*నట్లు సీ*బీఐ విచా*రణ కోసం కూ*డా కేం*ద్రం కి ఉత్త*రం రాసి వైఎస్ఆ*ర్ కి మీ రు*ణం చెల్లించు*కోండి.

Comments are closed.