పెద్ద మనుషుల చేతిలో వైసీపీ

ఇద్దరూ పెద్దలుగా మారి ఉత్తరాంధ్ర వైసీపీని ఉద్ధరించాల్సి ఉందని పార్టీలో అంతా కోరుకుంటున్నారు.

ఉత్తరాంధ్ర వైసీపీ ఇపుడు ఇద్దరు పెద్ద మనుషుల చేతులలో ఉంది. ఒకరు స్థానికంగా బాగా పట్టున్న వారు. సామాజిక వర్గం పరంగా కూడా బలమైన నేతగా ఉన్నారు. దశాబ్దాల రాజకీయ అనుభవం చతురత కలిగినవారు. రెండవ వారు కూడా జాతీయ స్థాయిలో పట్టున్న వారు. ఆయన రాజకీయం కూడా ఒక స్థాయిలో ఉంటుంది. ఈ ఇద్దరి వ్యూహాలు ఇపుడు వైసీపీకి కావాలనే అధినాయకత్వం నిర్ణయించింది.

ఇటీవల కాలంలో ఉత్తరాంధ్ర జిల్లాల వైసీపీ ఇంచార్జిగా రాజ్యసభ సభ్యుడు వి విజయసాయిరెడ్డి నియమితులయ్యారు. ఆయనను ఏరి కోరి మరీ పార్టీ హైకమాండ్ నియామకం చేసింది. అయితే ఆయనని మళ్లీ నియమించడం పట్ల స్థానికంగా కొందరు నేతలలో అసంతృప్తి ఉందన్నది ప్రచారంలో ఉంది.

విజయసాయిరెడ్డి నియమితులైన తరువాత మొదటిసారి విశాఖ వచ్చినపుడు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కలవలేదు. లేటెస్ట్ గా విశాఖలో పార్టీ ఆఫీసు ప్రారంభం వేళ విజయసాయిరెడ్డి బొత్స ఇద్దరూ కలుసుకున్నారు. అయితే ఇద్దరి మధ్య సాన్నిహిత్యం ఎలా ఉంది అన్న దానినే అంతా ఆసక్తిగా చూశారు.

వైసీపీ పార్టీ ఆఫీసు ఓపెనింగ్ కార్యక్రమంలో ఇద్దరు పాలుపంచుకున్నారు. విజయసాయిరెడ్డి చేతుల మీదుగానే పార్టీ ఆఫీసు ప్రారంభం జరిగింది. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి బొత్స కూడా పార్టీ నేతలను ఉద్దేశించి మాట్లాడారు, వైసీపీని అభివృద్ధి చేసుకోవాల్సి ఉందని కూడా ఒకే మాటగా చెప్పారు.

ఈ ఇద్దరి మధ్య గతంలో తెలియని వైరం ఏదో నడచింది అన్న వార్తలు అయితే వచ్చాయి. ఇప్పుడు ఇద్దరూ చెట్టాపట్టాల్ వేసుకుని పనిచేయాల్సి ఉంది. ఆ రకంగా ఇద్దరు పెద్దలూ సర్దుబాటుకు రావాల్సి ఉంది. ఇద్దరికీ పెద్దల సభలో పదవులు ఉన్నాయి. ఇద్దరూ పెద్దలుగా మారి ఉత్తరాంధ్ర వైసీపీని ఉద్ధరించాల్సి ఉందని పార్టీలో అంతా కోరుకుంటున్నారు. ఆధిపత్య పోరుకు ఆస్కారం ఇవ్వకుండా కష్టపడి పనిచేయడం తో పాటు గతంలో చేసిన పొరపాట్లను చేయకుండా చూసుకోవాల్సి ఉందని అంటున్నారు.

12 Replies to “పెద్ద మనుషుల చేతిలో వైసీపీ”

    1. Poni le…Nivu enthavaraku use avuthunnavo tdp ki cheppu..

      oka geesma…oka Jaya Prada…andarini vere valla daggariki chamba cbn gaadu pampadu gaa..denikosam…daridram rajakeeyam kosam…

      that’s the reason, every IAS leader hates chamba alias bolli

    1. బొత్స పెద్ద మనిషి అంటే ఓకే.. ఎంతో కొంత అవకాశం ఉంది…. కానీ ఆ రెండో వాడు పెద్ద మనిషి అంటే రోత గా ఉంటది….x లో వాడి లేకి రాతలు చూడలేదా

  1. ఈడి సొంత కవి హృదయాన్ని “కోరుకుంటున్నారు”, “అనుకుంటున్నారు” అని జనాల మాటగా చెప్తాడు..ఈడు ఈడి పైత్యం..

Comments are closed.