జగన్ ఇటీజ్ షోటైమ్

‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చాలా గడ్డు పరిస్థితుల్లో ఉంది. సీనియర్ నాయకులు ఒక్కరొక్కరుగా పార్టీని వీడి వెళ్లిపోతున్నారు.’ ప్రస్తుత సమయంలో రాజకీయ పరిణామాలను గమనించిన ఎవరికైనా సరే.. ముందుగా వచ్చే భావన ఇది. ‘పోయినోళ్లందరూ…

‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చాలా గడ్డు పరిస్థితుల్లో ఉంది. సీనియర్ నాయకులు ఒక్కరొక్కరుగా పార్టీని వీడి వెళ్లిపోతున్నారు.’ ప్రస్తుత సమయంలో రాజకీయ పరిణామాలను గమనించిన ఎవరికైనా సరే.. ముందుగా వచ్చే భావన ఇది. ‘పోయినోళ్లందరూ మంచోళ్లు’ అనే సినీకవి భావన మనకు ఇక్కడ నిజం అనిపించకపోవచ్చు. ‘పోయినోళ్లందరూ అవకాశవాదులు’ అని జనాంతికంగా ఒక మాట అనేసి వాళ్లంతా వేస్టు ఫెలోలు.. వాళ్లు వెళ్లిపోవడమే మంచిది. మేం అదే కోరుకుంటున్నాం.. అంటూ పడికట్టు డైలాగులు చెప్పడం కూడా సరిపోకపోవచ్చు. కానీ ఒక్క సంగతి మాత్రం నిజం– పోయినోళ్లందరూ అవకాశవాదులు!

మరొక విషయం కూడా ఇలాంటప్పుడు గుర్తు చేసుకోవాలి. ఒక వ్యక్తిలోని నైపుణ్యాలు సవాళ్లు ఎదురైనప్పుడే వెలికి వస్తాయి. సంక్షోభం ఎదురైనప్పుడే నాయకత్వ పటిమ తెలిసేది. ఒకసారి ముఖ్యమంత్రిగా అయిదేళ్ల పాటు పనిచేసిన తర్వాత.. ఇన్నాళ్లూ తన ప్రాపకంలో రాజకీయ పదవీ వైభోగాలు అనుభవించిన వారు.. ఇప్పుడు తనను కాదనుకుని వెళ్లిపోతున్నప్పుడే.. జగన్మోహన్ రెడ్డి తన నాయకత్వ కౌశలానికి పదును పెట్టాలి. పార్టీకి ఇప్పుడు ఆయన ఎంత తొందరగా, ఎంత ఘనంగా పూర్వవైభవం తీసుకువస్తారనేది ముఖ్యం. నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలు ఉంటే వాటిని ప్రదర్శించి తీరాల్సిన సందర్భం ఇది. అందుకే ఈ వారం గ్రేట్ ఆంధ్ర కవర్ స్టోరీ ‘జగన్.. ఇటీజ్ షోటైమ్’!

ఎన్నికలు జరిగిన తర్వాత ఓడిపోయిన పార్టీని విడిచిపెట్టి కొందరు నాయకులు గెలిచిన పార్టీలోకి జంప్ కొట్టడం అనేది సర్వసాధారణమైన సంగతి. అందుకే రాజకీయాలను కప్పల తక్కెడతో పోలుస్తుంటారు. ఇలాంటి పోకడలకు ఏ రాజకీయ పార్టీ కూడా అతీతం కానే కాదు. అందరూ ఒకే తాను ముక్కలు. వెళ్లిపోయిన వారి గురించి చర్చించుకోవడం అనేది వృథా ప్రయాస అవుతుంది. అయితే ఎందరు వెళ్లినా సరే.. ఎప్పటికీ స్థిరంగా ఉండే పార్టీ గురించి మాట్లాడుకోవడం.. చర్చించుకోవడం, తర్కించుకోవడం సంస్కరించుకోవడం ఎప్పటికీ అనవసరమే. ఆ కసరత్తు మాత్రమే జరగాలి.

ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి కూడా కొంత సంయమనంతోనే ఉన్నారు. ఎందరు వెళ్లిపోయినా పరవాలేదు. అనే మాటనే ఆయన తొలినుంచి చెబుతున్నారు. పార్టీని ప్రేమిస్తూ పార్టీలో మిగిలిఉన్న వాళ్లు మాత్రమే తమ వాళ్లు అనీ.. అలాంటి వారిని వైసీపీ సుశిక్షితులుగా తయారుచేసుకుంటుందని జగన్ గతంలో పలు సమావేశాల్లో చెబుతూ వచ్చారు. సిద్ధాంతరీత్యా ఏం చేయాలో ఆ విషయంలో పార్టీ అధినేతకు సరైన అవగాహనే ఉన్నది. కానీ ఆచరణలో మాత్రం అంతగా అది కనిపించడం లేదు.

పునర్నిర్మాణం క్లిష్టమే..

పార్టీ పునర్నిర్మాణం అనేది క్లిష్టమైన ప్రక్రియ. ఇప్పుడు తగిలిన ఎదురుదెబ్బల నుంచి ఎలాంటి పాఠాలు నేర్చుకున్నారో ఆ జ్ఞానం– పునర్నిర్మాణ వ్యూహంలో కనిపించాలి. మనుషులను నమ్మే విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. ఎవరైతే దురాలోచనలతో ఇంకా కలుషితం అయిపోకుండా ఉంటారో.. అలాంటి యువ కార్యకర్తలను ప్రోత్సహించి కీలక బాధ్యతలలోకి తీసుకురావాలి. ‘అవకాశవాదులు వెళ్లిపోతే పార్టీకి మేలు జరుగుతుంది. అంతే తప్ప నష్టం వాటిల్లదు’ అనే భావనను జగన్మోహన్ రెడ్డి ముందుగా తనకు తాను అలవాటు చేసుకోవాలి. ఆ నమ్మకాన్ని కార్యరూపంలో కార్యకర్తలు అందరూ నమ్మేలాగా ఆయన వ్యవహరించాలి.

‘సరైన వ్యూహం’ అంటే ఒక్కొక్క నియోజకవర్గానికి ఎన్నికలలో ఎమ్మెల్యేగా పోటీ చేయగల ఇన్చార్జి స్థాయి నాయకులు పలువురు ఉండేలాగా వ్యూహాత్మకంగా ప్లాన్ చేసుకుంటే పార్టీకి మేలు జరుగుతుంది. ప్రతి నియోజకవర్గానికి నలుగురైదుగురు మెరికల్లాంటి నాయకులను, కార్యకర్తలను ప్రమోట్ చేస్తూ వారికి బాధ్యతలు అప్పగిస్తూ రావాలి. ఎన్నికల సమయానికి వాళ్లలో ఎవరెవరు చిత్తశుద్ధితో సేవలు అందించగలుగుతున్నారో– ఎలాంటి భేషజాలు లేకుండా, ఆశ్రిత పక్షపాతానికి చోటవ్వకుండా గుర్తించాలి. ఆ నాయకుల మీద నియోజకవర్గ స్థాయిలో పలు విడతలుగా ప్రజాభిప్రాయాన్ని సేకరించే సర్వేలు చేయించాలి. అంతిమంగా అందరూ ఆదరించే వ్యక్తిని మాత్రమే చట్టసభకు బరిలో దించాలి. నాయకుల ఎంపిక విషయంలో ధనవనరులు, కులబలం వీటన్నింటినీ ప్రధానంగా గమనిస్తున్నట్టే.. పార్టీ పట్ల విధేయత, విశ్వాసం అనే అంశాలను కూడా కీలకంగా పరిగణించాలని తెలుసుకుంటే చాలా ఇబ్బందులు తప్పుతాయి.

ఇలాంటి ఒక నిర్దిష్టమైన వ్యూహం ఏది లేకుండా జగన్మోహన్ రెడ్డి అడుగులు ముందుకు వేస్తున్నట్లుగా అనిపిస్తోంది.

కార్యకర్తల్లో స్ఫూర్తినింపడం అవసరం..

పాతనీరు వెళ్లకుండా.. కొత్త నీరు రాదు. ఒకసారి పార్టీ నుంచి వెళ్లిపోదలచుకున్న వారిని వెళ్లవద్దంటూ బతిమాలే అలవాటు మాత్రం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో లేదు. ఇటీవల కొందరి విషయంలో కాస్త సర్దిచెప్పే ధోరణి అవలంబించారు గానీ.. సాధారణంగా వెళ్లదలచుకున్న వారికి నచ్చజెప్పడం అనేది వారి డీఎన్ఏలోనే లేదు. వైఎస్ జగన్ తో ఎంతో సన్నిహితంగా మెలిగిన భూమా నాగిరెడ్డి వెళ్లిపోదలచుకున్నప్పటినుంచి కూడా జగన్ ఇదే దృఢత్వాన్ని కనబరుస్తున్నారు. అందుకు మాత్రం జగన్ ను బహుధా అభినందించాలి. అయితే పదవులు, హోదాలు కోరుకునే నాయకులు మాత్రమే అటు ఇటూ గెంతే ప్రయత్నం చేస్తుంటారు. కానీ పార్టీకి కార్యకర్తల బలం అనేది చాలా కీలకం. ఆ కార్యకర్తలను ఎలా కాపాడుకోవాలనేది అధినేత నైపుణ్యం మీద ఆధారపడి ఉంటుంది.

ప్రకాశం జిల్లాలో ఇదే జరిగింది. బాలినేని శ్రీనివాసరెడ్డి తాను జనసేనలో చేరినంత మాత్రాన.. ఆయన ప్రభావం పార్టీ మీద పడలేదు. ఆయన తనతో పాటూ కార్యకర్తలను అందరినీ ఫిరాయింపజేయాలని అనుకుని అందరికీ కలిపి విందు సమావేశాలు పెడితే.. అందరూ విందుకు వచ్చారు.. తిన్నారు గానీ.. పార్టీని వీడి వెళ్లడం సరైన పనికాదంటూ.. బాలినేనికే ఎదురు క్లాస్ పీకారు.

కార్యకర్తలను కాపాడుకోవడం అంటే అందుకు ద్విముఖ వ్యూహాన్ని అనుసరించాలి. నాయకులు కొందరు వెళ్లిపోతున్నప్పుడు కార్యకర్తల్లో కొంత అయోమయం, నైరాశ్యం నెలకొంటుంది. దానిని ఎంత తొందరగా తప్పించగలిగితే పార్టీకి అంత మంచిది. రెండోది– కార్యకర్తల్లో అలకలు రాకుండా చూసుకోవడం. తమకు తగిన ప్రాధాన్యం దక్కడం లేదని కార్యకర్తలు ఆవేదనలో ఉన్నప్పుడు వారిని గుర్తించి ఆదరించడం. ఈ రెండూ పనులూ చేయడం పార్టీ పునర్నిర్మాణంలో ఎంతో ఉపయోగపడుతుంది.

వారికి దక్కే గౌరవమెంత?

ఎన్నికల ముందు పార్టీలు ఫిరాయించే నాయకులు కాస్త బెటర్. తమకు ఉన్న పార్టీలో టికెట్ దక్కలేదనే కోపంతోనే చాలా మంది ఫిరాయిస్తుంటారు. కానీ.. వారిది ఆగ్రహం అనుకోవాల్సిందే తప్ప.. వెన్నుపోటు అనడానికి వీల్లేదు. ఎన్నికలకు ముందే తమ రాజకీయ ప్రస్థానానికి కొత్త పార్టీని ఎంచుకుంటారు. వారితో కలిసి అడుగులు వేస్తూ మంచో చెడో కట్టుబడి ఉంటారు. కానీ.. ఎన్నికల తర్వాత ఓడిపోయిన పార్టీని విడిచిపెట్టి.. గెలిచిన పార్టీలోకి జంప్ చేసేవారు వంచనతోకూడిన బుద్ధిని కలిగి ఉంటారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే.. వీళ్లు అధికార పార్టీల్లో చేరినంత మాత్రాన.. ఆ పార్టీ వీరిని నెత్తిన పెట్టుకుని ఊరేగుతుందా? అనేది పెద్ద సందేహం. అలా ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు. కొమ్ములు తిరిగిన నాయకులు కూడా.. ఇలా ఉన్న పార్టీని వెన్నుపోటు పొడిచి ఇతర పార్టీల్లోకి వెళ్లిన తర్వాత అక్కడ కూడా భ్రష్టుపట్టిపోయిన వారే.

తాజా పరిణామాల్లో వైసీపీలో భోగాలు అనుభవించి.. ఓడిన తర్వాత.. వెన్నుపోటు పొడిచిన వారిలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పేరు బాలినేని శ్రీనివాసరెడ్డి. ఆయన జగన్ కు స్వయానా బంధువు. పార్టీలో చాలా మంది నాయకులకంటె అపరిమితమైన ప్రాధాన్యాన్ని వైభోగాన్ని అనుభవించారు. ఎన్నికల్లో తన సొంత నియోజకవర్గంలో గెలిచే అవకాశం కూడా లేని బలహీన నాయకుడిగా తయారయ్యారు. కానీ.. ఈ ఎన్నికల్లో తాను చెెప్పినట్టల్లా ఆడలేదని, ఓటమి తర్వాత.. పార్టీనుంచి బయటకు వెళ్లిపోయారు. పార్టీ వివిధ అంశాల మీద మాట్లాడ్డానికి ఎన్నడూ ముందుకు రాని ఆయన, జనసేనలో చేరిన తర్వాత జగన్ మీద విమర్శలు రువ్వడానికి మాత్రం అత్యుత్సాహం చూపిస్తూ వచ్చారు. కానీ ఏం బావుకున్నారు.

బాలినేని శ్రీనివాసరెడ్డికి మంత్రి పదవి ఆశపెట్టి జనసేనలో చేర్చుకున్నారు. ఎమ్మెల్సీ రూటులో కేబినెట్లోకి తీసుకుంటాం అన్నారు. కానీ.. కేబినెట్ లో ఉన్న ఒక్క ఖాళీని పవన్ కల్యాణ్ తన అన్నయ్య నాగబాబుకు కట్టబెట్టించుకుంటున్నారు. ఇప్పుడు బాలినేని పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలాగా తయారైపోయింది. ఇటీవల సెకి ఒప్పందాల విషయంలో జగన్ మీద ఆయన మాట్లాడిన అబద్ధాలు, వేసిన నిందల పర్యవసానంగా జీవితంలో మళ్లీ ఎప్పటికీ వైసీపీలోకి ఎంట్రీ దొరకని పరిస్థితి తయారైంది. అలాగని జనసేన ఇప్పుడు ఆయనను పట్టించుకోవడం మానేసింది. తరచిచూస్తే.. జగన్ ను వెన్నుపోటు పొడిచి వెళ్లిన వారందరి పరిస్థితి ఇదే అవుతుందనేు భావన పలువురిలోఉంది.

పునర్నిర్మాణంలో మరో అంశం కీలకం..

ఏ పార్టీ అధినేత అయినా, ఏ కంపెనీ యజమాని అయినా తనకు అత్యంత విశ్వసనీయులైన వ్యక్తులను మాత్రమే అన్ని కీలక స్థానాల్లో నియమించుకుంటారు. వారి మీదనే ఎక్కువగా ఆధారపడి ప్రస్థానం సాగిస్తుంటారు. జగన్ అందుకు అతీతం ఏమీ కాదు. అయితే.. ఆయన కేవలం ఒక సామాజిక వర్గం మీద మాత్రమే ఆధారపడుతున్నారనే విమర్శ ఎప్పటికీ రాకూడదు. కంపెనీల విషయంలో ఇలాంటి విమర్శలకు పెద్దగా పట్టింపు లేదు. ఎందుకంటే.. ఒక కంపెనీ నిండా ఒకే కులం వాళ్లు ఉన్నంత మాత్రాన.. వారి ఉత్పత్తులను ప్రజలు చీదరించుకోవడం జరగదు.

ఉత్పత్తి బాగున్నదంటే.. ప్రజల ఆదరణ ఉంటుంది. కానీ రాజకీయాలు అలా కాదు. ఇక్కడ ఉత్పత్తి అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత చేయగలిగిన ప్రజాసేవ మాత్రమే. అంటే.. అది ప్రజలు ఆశీర్వదించినప్పుడు మాత్రమే జరుగుతుంది. ప్రజలు కులాల, మతాల ప్రాతిపదికలతో సంబంధం లేకుండా ఆశీర్వదించాలి, ఆదరించాలి.. అంటే, ఆ పార్టీ ఒక సామాజిక వర్గం నాయకత్వంలో నడుస్తున్నది అనే భావన కలిగించకూడదు. విశ్వాసం విధేయత కొలబద్ధలు కావాలే గానీ.. కులం కాదు. ఈ జాగ్రత్తను కూడా పాటించాలి.

జగన్ ఇప్పుడిప్పుడే కీలకంగా.. ప్రజాపోరాటాలతో పార్టీలో చురుకుదనం పుట్టిస్తున్నారు. ఇది ఖచ్చితంగా పార్టీ నిర్మాణంలో లాభించే సంగతి. అలాగే నాయకత్వ లోపాలను కూడా దిద్దుకుంటూ.. అవకాశవాదుల్ని పక్కన పెడుతూ, ప్రతిభావంతుల్ని ప్రోత్సహిస్తూ అడుగులు వేస్తే మంచి జరుగుతుంది.

..ఎల్. విజయలక్ష్మి

49 Replies to “జగన్ ఇటీజ్ షోటైమ్”

    1. Mr L Vijayalakshmi garu!!GA లో పేరు/ లింగ భేదాలు ఉండవ్ అన్ని ఒక్కడే రాస్తాడు సర్!!

  1. nayakathva lopalaa….yem matladuthunnaru……okka sevam…oke okka manchi sevam dorakanivvandi….alladisthadu…..leadership ante yento chupisthadu….😂😂😂

  2. Jagan lost credibility and it is impossible for him to win elections anymore. He might think he got 39% votes. But that percentage is going down day by day.

  3. బూతులు లేకుండా స్ట్రెయిట్ ఫార్వర్డ్ గా చేసే కామెంట్స్ ని పోస్ట్ చేస్తుంటే .. యాక్సెప్ట్ చేసే ధైర్యం లేక డిలీట్ చేస్తున్న మీరు వెబ్సైట్ నడపటం వేస్ట్ .. లేదంటే కామెంట్ సెక్షన్ తీసేయండి

  4. మరి మన పార్టీ లోకి వచ్చినప్పుడు ఈ సూక్తి ముక్తావళి ఏమైందో చెప్పండి. ఆపుడు ఈ విలువలు, సూత్రాలు, మరియు మార్గదర్శకాలు ఏమయ్యాయి? మీరు ప్రకటించిన న్యాయం, ధర్మం, మరియు సమానత్వం వంటి సిద్ధాంతాలు ఆపుడు ఎక్కడ ఉన్నాయి?

  5. First thing he got to learn is that when tdp is in power, tdp pigs do lot of scams for all the field workers, party members to benefit and become financially strong. Be it Janmabhoomi or something else. Benefits for the tdp pigs is real.

    but when ycp is in power, there wasn’t any such thing. No field workers or no party member got benefits..voters got direct benefits.

    now these people who put all blood to bring ycp to power are financially weak…very weak.

    some might change with the flow.

    some because of financials

    some because of peer pressure

    some because of higher leader negligence ..

    I believe once Jagan speak to theee fellas, their feature is assured..

  6. పార్టీ లో లీడర్స్ తో పనేం లేదు.. ఆ నలుగురు రెడ్లు +

    మావోడు ఇంటింటికి చేసిన మంచి,

    ఊరురికీ చేసిన అభివృద్ధి,

    మావోడి అతి మంచితనం,

    మావోడి అతి నిజాయితీ

    వల్ల

    కళ్ళు మూసుకున్నా, ఏ ఎన్నిక అయినా 175/175 గెలుస్తాం.. కాకపోతే కూటమి పోటీ చెయ్యకుండా,షర్మిల and KA పాల్ పార్టీలు మాత్రమే పోటీ చెయాలి..

    దీనికి బాబూ.. బాబ్బాబు ఒప్పుకోవా చెంద్రబాబు

  7. పార్టీ క్యాడర్ ని ఈ మాదిరిగా motivate చేస్తూ,ప్యాలెస్ నుండే అలుపెరుగక పోరాటాలు చేస్తూ కూటమి సర్కారు కి వన్నెలు చూపిస్తున్న సింగిల్ సింహాన్ని శాలువా కప్పి, సన్మానించి అవార్డు ఏమైనా ఉంటే ఇవ్వాలసింది పోయి, ఈవిధంగా హేళన చేస్తావా vizzi ??

    నీ ఫాల్స్ ప్రాపగాండా వల్లే ఇవాళ మావోడికి ఈ పరిస్థితి వచ్చింది గ్యాస్ ఆంధ్రా ..!

  8. People gave a great mandate to Jagan in 2019, he completely squandered it. Lot of people loved his guts and anti authoritative approach, hoped that he is bringing in a fresh breath of air into AP politics. But he disappointed so many people with his petty policies and myopic policies. I doubt he would have any chance in the next elections as well. Future is dire for YSRCP and Jagan

  9. 5 ఏళ్ళు అధికారం అనుభవించి,ఇప్పుడు ఓడిపోతే మా మావోడి A1గుద్ద దెంగుతున్న నాయకులతో పనేముంది??

    Just అలా కళ్ళు మూసుకుంటే చాలు..5 ఏళ్ళు అలా గిర్రున తిరిగి, మన అతి మంచితనంతో & మన అతి నిజాయితీ తో అధికారం అదే తన్నుకుంటూ వస్తది కదా??

    మన పార్టీ వాళ్లకి మూసుకోవడానికి just కళ్ళు ఉంటే చాలు..నాయకుల భలం అవసరమే లేదు ఏమంటావ్ తి0గిరి 11?

  10. Which Show Time????

    కొడి కత్తి షొ?

    బబై గుండె పొటు షొ?

    నారాసుర రక్త చరిత్ర షొ?

    గులక రాయి షొ?

    32 కమ్మ డ్శ్ఫ్స్ షొ?

    పింక్ డైమండ్ షొ?

    ఇన్సైడర్ ట్రేడింగ్ షౌ?

  11. జగన్ కి తెలిసింది అల్లా వ్యూహం అంటే ఆర్జీవీ చేత వ్యూహం అనే మూవీ తీయించడం నైపుణ్యం అంటే నవ్వుతున్నాడో ఏడుస్తున్నాడో తెలియనట్టు ఫేస్ పెట్టి కుట్రలు చేస్తా ఉన్నారు నన్ను కాపాడండి అని అడుక్కోవడమే 😅

  12. జగన్ కి తెలిసింది అల్లా వ్యూహం అంటే ఆర్జీవీ చేత వ్యూహం అనే మూవీ తీయించడం నైపుణ్యం అంటే నవ్వుతున్నాడో ఏడుస్తున్నాడో తెలియనట్టు ఫేస్ పెట్టి కుట్రలు చేస్తా ఉన్నారు నన్ను కాపాడండి అని అడు*క్కో వాడమే

  13. ఆ “రేషన్” దినుసులు తినే వాళ్ళ కంపు పీల్ హి బతికేవాడికి ఎవ్వరైనా హితబోధ హెయ్యండిరా..

  14. YSRCP నుంచి మరో MLC రాజీనామా చేసి జనసేన జెండా కప్పుకోబోతున్నాడు ఇలా ఎవరో ఒకరు గోడ దూకిన ప్రతిసారి జగన్ నేర్చుకోవాలి అంటారు జగన్ ఏం నేర్చుకోవాలి మనుషులను నమ్మడం మానేయాలా ఇలాంటి వాళ్లను చూసి ఈసారి జగన్ సోషియల్ ఇంజనీరింగ్ మానేస్తారు దెబ్బ తినేది వెనుకబడిన కులాల వాళ్ళే ఈ MLC ఏసు పాదం విషయమే తీసుకుందాం ఇంకో మోపినేని 2019లో అంత ప్రభంజనంలో గుంటూరు వెస్ట్ నుంచి ఓడిపోయాడు ఏషియాలోనే పెద్దదైన గుంటూరు మార్కెట్ యార్డ్ చైర్మన్గా చేశారు ఆపైన MLC భార్య కార్పొరేటర్ మరదలు ZP వైస్ చైర్మన్ ఆర్థికంగా నిలబడడానికి కోట్ల కాంట్రాక్ట్ లిచ్చారు ఇలాంటి వాళ్లు కూడా ద్రోహం చేస్తే ఇంకా ఎవరిని నమ్మలీ!

  15. పార్టీ నుంచి మరో మ్మెల్సీ రాజీనామా చేసి జనసేన జెండా కప్పుకోబోతున్నాడు

    ఇలా ఎవరో ఒకరు గోడ దూకిన ప్రతిసారి జగన్ నేర్చుకోవాలి అంటారు

    జగన్ ఏం నేర్చుకోవాలి

    మనుషులను నమ్మడం మానేయాలా

    ఇలాంటి వాళ్లను చూసి ఈసారి జగన్ సోషియల్ ఇంజనీరింగ్ మానేస్తారు దెబ్బ తినేది వెనుకబడిన కులాల వాళ్ళే

    ఈ మ్మెల్సీ ఏసు పాదం విషయమే తీసుకుందాం ఇంకో మోపినేని

    2019లో అంత ప్రభంజనంలో గుంటూరు వెస్ట్ నుంచి ఓడిపోయాడు

    ఏషియాలోనే పెద్దదైన గుంటూరు మార్కెట్ యార్డ్ చైర్మన్గా చేశారు ఆపైన మ్మెల్సీ భార్య కార్పొరేటర్ మరదలు జడ్పీ వైస్ చైర్మన్ ఆర్థికంగా నిలబడడానికి కోట్ల కాంట్రాక్ట్ లిచ్చారు

    ఇలాంటి వాళ్లు కూడా ద్రోహం చేస్తే ఇంకా ఎవరిని నమ్మలీ

Comments are closed.