భీమిలీ వైసీపీకి స్వాతంత్ర్యం వచ్చిందట!

మాజీ మంత్రి, భీమిలీకి చెందిన సీనియర్ నేత అవంతి శ్రీనివాస్ వైసీపీకి గుడ్ బై చెప్పడం గురించి ఆ పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మాజీ మంత్రి, భీమిలీకి చెందిన సీనియర్ నేత అవంతి శ్రీనివాస్ వైసీపీకి గుడ్ బై చెప్పడం గురించి ఆ పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆయన పదవుల కోసమే వైసీపీలో చేరారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆయనను కష్టపడి గెలిపించినా పార్టీని పట్టించుకోకుండా తన స్వార్థం చూసుకున్నారని విమర్శించారు.

ఈ దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం లభిస్తే, అవంతి పార్టీని వీడిపోవడంతో తమకు పూర్తిస్థాయిలో స్వేచ్ఛ లభించిందని వారు చెబుతున్నారు. ఎక్కడి నుంచో వలస నేతలను అధినాయకత్వం దిగుమతి చేయకుండా, ఈసారి అయినా సరైన వారిని గుర్తించాలని అంటున్నారు.

అవంతి వైసీపీలో ఐదేళ్ల ఎనిమిది నెలలు మాత్రమే ఉన్నారని విశాఖ వైసీపీ ప్రెసిడెంట్ గుడివాడ అమర్నాధ్ లెక్కచూసి మరీ చెప్పారు. అవంతి లాంటి వారి వల్ల పార్టీకి ఇబ్బందులే వచ్చాయని కామెంట్ చేశారు. ఆయన వెళ్ళిపోవడం వల్ల భీమిలీ వైసీపీ నేతలు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు అని అన్నారు.

భీమిలీకి వలస నాయకులు వద్దని, స్థానికంగా బలంగా ఉన్న నేతలకే ఇన్‌చార్జి బాధ్యతలు ఇవ్వాలని, లోకల్ లీడర్లకే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని నేతలు అధినాయకత్వాన్ని కోరుతున్నారు. తాము కష్టపడి పనిచేస్తామని గుర్తించాల్సింది పార్టీ పెద్దలే అని వారు అభిప్రాయపడుతున్నారు.

భీమిలీ వైసీపీలో, అవంతి వెళ్ళిపోవడం వల్ల అసలైన పార్టీ నేతలకు ఏ ఇబ్బంది లేదని అంటున్నారు. ఆయన వెంట తెచ్చుకున్న నాయకులే ఇంతకాలం అజమాయిషీ చేశారు. ఇప్పుడు వారంతా ఆయనతోనే వెళ్ళిపోయారని వ్యాఖ్యానిస్తున్నారు. భీమిలీపై ఈసారి అయినా సరైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని నేతలు చెబుతున్నారు.

6 Replies to “భీమిలీ వైసీపీకి స్వాతంత్ర్యం వచ్చిందట!”

Comments are closed.