జస్ట్ కొన్ని రోజుల కిందటి సంగతి.. ఓవైపు తెలంగాణ సర్కారుకు, అల్లు అర్జున్ కు మధ్య వాడివేడిగా మాటల యుద్ధం నడిచింది. అసెంబ్లీ సాక్షిగా అల్లు అర్జున్ పై విమర్శలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఆ వెంటనే అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి తనదైన శైలిలో కౌంటర్ కూడా ఇచ్చాడు.
పేర్లు ప్రస్తావించకుండా ఇద్దరూ ఇలా విమర్శలు-ప్రతివిమర్శలు చేసుకుంటున్న టైమ్ లో పుండు మీద కారం చల్లినట్టు పుష్ప-2 నుంచి రెచ్చగొట్టే సాంగ్ రిలీజ్ చేశారు. “దమ్ముంటే పట్టుకోరా షెకావత్.. పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్” అనే సాంగ్ యూట్యూబ్ లో ప్రత్యక్షమైంది.
సినిమాలో పోలీసుల్ని రెచ్చకొడుతూ, వాళ్లకు సవాల్ విసురుతూ అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్ అది. ఆ డైలాగ్ నే పాటగా రిలీజ్ చేశారు. ఓవైపు వివాదం నడుస్తున్న సమయంలో ఈ పాట మరింత రెచ్చగొట్టినట్టుగా ఉందంటూ ఫీడ్ బ్యాక్ వచ్చింది. రేవంత్ రెడ్డిని, తెలంగాణ పోలీసుల్ని రెచ్చగొట్టేందుకు బన్నీ ఇలా చేశాడంటూ ఓ టైమ్ లో ప్రచారం కూడా జరిగింది. దీంతో ఆఘమేఘాల మీద ఆ పాటను తొలిగించారు.
అలా తొలిగించిన సాంగ్ ను రోజుల వ్యవధిలోనే తిరిగి మళ్లీ యూట్యూబ్ లోకి తీసుకురావడం చాలామందిని ఆశ్చర్యానికి గురిచేసింది. అవును.. “దమ్ముంటే పట్టుకోరా షెకావత్.. పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్” అనే సాంగ్ ఈరోజు మళ్లీ యూట్యూబ్ లో ప్రత్యక్షమైంది. టాలీవుడ్ ప్రముఖులు కొంతమంది సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన 2 రోజులకే ఈ సాంగ్ బయటకురావడం విశేషం.
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి ప్రస్తుతం అల్లు అర్జున్ కు, తెలంగాణ పోలీసులకు మధ్య హాట్ హాట్ గా వ్యవహారం నడుస్తోంది. ఆల్రెడీ ఒకసారి పోలీసుల విచారణకు వెళ్లొచ్చాడు బన్నీ. మరోవైపు జ్యూడీషియల్ రిమాండ్, రెగ్యులర్ బెయిల్ కు సంబంధించి కోర్టు కేసు నడుస్తోంది. ఇలాంటి టైమ్ లో షెకావత్ సాంగ్ వచ్చింది. ఇప్పుడిప్పుడే యూట్యూబ్ లో ట్రెండింగ్ అవుతోంది.
SAHITHYAM missing for most of the Telugu movie songs
A1 ముద్దాయి శ్రీతేజ్ తండ్రి ఆ భాస్కర్ ని తీసుకెళ్ళి మక్కెలు విరిగేలా కొట్టకుండా, నీది తప్పు – నీది తప్పు అని వీళ్ళు తిట్టుకోవడం ఏంటి?
ఎవరిదీ తప్పు ఒప్పు అనే విషయం ప్రక్కన పెడితే, చిన్న పిల్లలను ఒక మహిళను తీసుకుని 3K(లేదా ఎంతో కొంత అధిక మొత్తం పెట్టి) benifit షో కే, అందులో అత్యధికంగా రద్దీ గా ఉండే కూడలిలో, అత్యంత అధరణ ఉన్న హీరో వస్తున్న వేళ, ఎంత సెక్యూరిటీ ఉన్న కూడా అలాంటి సంఘటనలు జరిగే ఆస్కారం ఉంటుందని ఊహించి ముందు జాగ్రత్త గా సినిమాను మరో రోజుకు లేదా మరో థియేటర్ కు మార్చుకోక పోవడము ఒక తండ్రి గా, ఒక భర్త గా ముమ్మాటికి ప్రథమం గా ఆయన తప్పు. ఇక కర్ణుని చావుకు సవాలక్ష కారణాలు ఉన్నట్లు, ఆ తదుపరి పరిణామాలకు అందరికీ సమాన పాత్ర ఉన్నది. ఎందరో ఎన్నో విశ్లేషణలు ఇచ్చినా PK గారి విశ్లేషణ highlight.