పవన్ కల్యాణ్ తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా తీస్తున్నాడు హరీశ్. తమిళ్ లో వచ్చిన తేరి సినిమాకు ఇది రీమేక్ అనేది ఓపెన్ సీక్రెట్. అన్నీ అనుకున్నట్టు జరిగుంటే ఈ పాటికి సినిమా రిలీజై ఉండేది. కానీ అలా జరగలేదు.
ఈ సినిమా ఇప్పటికే రిలీజైనట్టయితే కేవలం ఒకే ఒక్క సినిమా (తేరి)తో పోలిక ఉండేది. కానీ ఇప్పుడీ మూవీని 2 సినిమాలతో కంపేర్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అవును.. తేరి సినిమాకు హిందీ రీమేక్ గా తెరకెక్కిన ‘బేబీ జాన్’ కూడా వచ్చింది.
వరుణ్ ధావన్ హీరోగా నటించిన ‘బేబీ జాన్’ సినిమా థియేటర్లలోకి వచ్చింది. మొదటి రోజే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. రెండో రోజు వసూళ్లు ఘోరంగా పడిపోయాయి. ఓవైపు పుష్ప-2తో పోటీ ఉన్నప్పటికీ, ‘బేబీ జాన్’ లో కంటెంట్ బాలీవుడ్ జనాలకు ఎక్కలేదనే విషయం స్పష్టంగా తెలుస్తోంది.
భవిష్యత్తులో ఏదో ఒక టైమ్ లో ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ అవుతుంది. అప్పుడు ఆ సినిమాను ఇటు తేరితో పాటు, అటు బేబీ జాన్ తో కూడా కంపేర్ చేస్తారు ప్రేక్షకులు. తేరి హిట్టయింది కానీ, ఆ కాన్సెప్ట్ ఇప్పుడు పాతదైపోయింది. అందుకే బేబీ జాన్ ఫ్లాప్ అయిందనే సమీక్షలు బాలీవుడ్ లో కనిపిస్తున్నాయి.
మరి ఈ పాత కాన్సెప్ట్ ను హరీశ్ శంకర్, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గా ఎలా మార్చాడనేది అందరి డౌట్. రీమేక్స్ ను ఫ్రెష్ గా మలుస్తాడనే పేరు తెచ్చుకున్న హరీశ్, మిస్టర్ బచ్చన్ కోసం అదే పని చేసి చేతులు కాల్చుకున్నాడు. ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చేస్తున్నాడు. అటు చూస్తే బేబీ జాన్ డిజాస్టర్ అయింది. ఇవన్నీ హరీశ్ శంకర్ ను కచ్చితంగా ఒత్తిడికి గురిచేసే అంశాలే. అందుకే ఎందుకైనా మంచిదని బేబీ జాన్ చూడమని, హరీశ్ ను కోరుతున్నారు పవన్ ఫ్యాన్స్.
పవన్ కల్యాణ్ మళ్లీ సినిమాలు స్టార్ట్ చేశారు. హరిహర వీరమల్లు దాదాపు పూర్తి చేశారు. రేపోమాపో ఓజీ కూడా స్టార్ట్ చేస్తారు. కొత్త ఏడాదిలో ఆయన ఉస్తాద్ భగత్ సింగ్ కూడా పూర్తిచేసే అవకాశాలున్నాయి.
UBS will not happen next 5 years, just forget it.