నాగబాబు రాగానే.. మంత్రివర్గంలో భారీ మార్పులు!

హోంశాఖ కోసం పవన్ కల్యాణ్ పట్టుబట్టవచ్చునని, దానిని తన సోదరుడు నాగబాబుకు ఇప్పించవచ్చునని ఒక చర్చ నడుస్తోంది.

ఇంతకూ కొణిదెల నాగబాబు ఏపీ మంత్రివర్గంలోకి ఎప్పుడు ఎంట్రీ ఇవ్వబోతున్నారు? జనసేన కార్యకర్తలను, మెగా ఫ్యాన్స్‌ను మధనపెడుతున్న ప్రశ్న ఇది. పవన్ కల్యాణ్ జనసేనానిగా పార్టీకి సర్వాధికారి అయి ఉండవచ్చు గానీ, రాష్ట్రమంతా సైలెంట్‌గా పర్యటనలు నిర్వహిస్తూ, పార్టీ అభిమానులు, కార్యకర్తలతో మమేకం అవుతూ పనిచేశారు. ఎక్కువమందితో ప్రత్యక్ష సంబంధాలు అనేది, పవన్ కల్యాణ్ కంటే నాగబాబుకు ఎక్కువ అని చెప్పినా ఆశ్చర్యం లేదు.

అయితే, నాగబాబు రాష్ట్ర మంత్రివర్గంలోకి వస్తారనే విషయం ఖరారు అయింది. ప్రస్తుతం ఒక ఖాళీ కూడా ఉంది. ఆయన ఎప్పుడు వస్తారనేదే చర్చ. 2014 తర్వాత ప్రభుత్వం నడుపుతున్నప్పుడు తన కొడుకు నారా లోకేశ్‌ను మంత్రివర్గంలోకి తీసుకున్న చంద్రబాబునాయుడు, ముందుగా కేబినెట్ బెర్త్ కట్టబెట్టి ఆ తర్వాత ఎమ్మెల్సీగా సభాప్రవేశం చేయించారు.

నాగబాబు విషయంలో కూడా అదే సిద్ధాంతం పాటించాలని, తర్వాత ఎమ్మెల్సీగా చేయవచ్చు గానీ, ముందుగా మంత్రిపదవి ఇవ్వాలని కార్యకర్తలు కోరుకుంటున్నారు. అయితే పవన్ ఇటీవల ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ, ఆయన ముందుగా ఎమ్మెల్సీ కావాల్సి ఉందని, తర్వాత కేబినెట్లోకి వస్తారని వ్యాఖ్యానించారు. కానీ సంక్రాంతి తర్వాత ముందుగా కేబినెట్ పదవే వరిస్తుందని విశ్వసనీయంగా తెలుస్తోంది.

అమరావతి వర్గాల్లో నడుస్తున్న మరో కీలక చర్చ ఏంటంటే, నాగేంద్రబాబు కేబినెట్లోకి రావడం జరిగితే, కేవలం ఆయనకు కొన్ని శాఖలు కేటాయించడం మాత్రమే కాకుండా, యావత్ కేబినెట్లో సమూలంగా మార్పుచేర్పులు, ప్రక్షాళన ఉంటుందని పలువురు చర్చిస్తున్నారు. ముఖ్యంగా హోంశాఖ కోసం పవన్ కల్యాణ్ పట్టుబట్టవచ్చునని, దానిని తన సోదరుడు నాగబాబుకు ఇప్పించవచ్చునని ఒక చర్చ నడుస్తోంది.

ఇటీవల హోంమంత్రి వంగలపూడి అనిత సమర్థతను ప్రశ్నించేలాగా పవన్ చేసిన కీలక వ్యాఖ్యలు, తాజాగా హోం మంత్రి పేషీలో విచ్చలవిడి అవినీతి బాగోతాలు వెలుగులోకి రావడం ఈ వ్యవహారాలు అన్నీ మంత్రివర్గ సమూల ప్రక్షాళనను సూచిస్తున్నాయని పలువురు అంటున్నారు.

పైగా, ఏపీ మంత్రి ఒకరు తరచూ హైదరాబాదులో తిష్టవేస్తూ గానాబజానాలతో గడుపుతూ, ఏపీ వ్యవహారాలకు సంబంధించిన సమస్త దందాలను హైదరాబాదు కేంద్రంగా నడిపిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇలాంటి వారందరినీ తక్షణం తొలగించకపోయినా, అప్రాధాన్య శాఖలు కట్టబెట్టేలా కేబినెట్ ప్రక్షాళన గురించి చంద్రబాబు ఆలోచిస్తున్నట్లు సమాచారం.

అయితే ఆ ప్రక్షాళన పర్వం నాగబాబు కేబినెట్లోకి రాగానే జరుగుతుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మరి ఎంత త్వరగా ఆ ప్రక్షాళన మొదలవుతుందో చూడాలి.

12 Replies to “నాగబాబు రాగానే.. మంత్రివర్గంలో భారీ మార్పులు!”

  1. ఇంతకీ మన “సాక్ష్యత్తు A1మహిళ” ఇప్పుడు ఏ ఊరి ప్యాలెస్ లో దాక్కుంది??

    “బెంగుళూరు ప్యాలెస్” విశ్వసనీయ వర్గాల ప్రకారం దీన్ని ఈరోజు

    ఎంత మంది “కన్నడ కాంగ్రెస్ మగాళ్లు” book చేసుకున్నారేంది??

  2. తొమిది, మూడు, ఎనిమిది, సున్నా, ఏదు, మూడు, ఏడు, ఏడు, నాలుగు, ఏడు, వీసీ

Comments are closed.