మూడవసారి ప్రమాణం చేసిన తరువాత ప్రధాని హోదాలో నరేంద్ర మోడీ ఏపీకి తొలిసారి వస్తున్నారు. ఆ వస్తున్నది కూడా విశాఖకు. విశాఖలో స్టీల్ ప్లాంట్ ఉద్యమం మంచి కాక మీద రేగుతొంది. 1400 రోజులకు పైగా ఉక్కు కార్మికులు ఇదే అంశం మీద పోరాటం చేస్తున్నారు.
వామపక్షాల నేతలు అయితే మోడీ విశాఖలో వచ్చీ రాగానే స్టీల్ ప్లాంట్ మీద ప్రకటించి కానీ సభ నిర్వహించకూడదని అంటున్నారు. విశాఖకు మోడీ వచ్చి వెళ్తే ఏమిటి ఉపయోగమని వారు ప్రశ్నిస్తున్నారు. స్టీల్ ప్లాంట్ విషయంలో కూటమి నాయకులు కూడా పెదవి విప్పాలని కోరుతున్నారు.
మోడీ రాక ముందే మూడు రోజుల పాటు నిరవధిక నిరాహార దీక్షలకు వామ పక్షాలు ప్రజా సంఘాలు పిలుపు ఇచ్చాయి. మోడీని అడ్డుకుంటామని కూడా ప్రజా సంఘాలు ప్రకటించిన నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు చేశారు. వామపక్ష నాయకులను బుధవారం ఉదయం నుంచే ఎక్కడి వారిని అక్కడ గృహ నిర్బంధం చేస్తున్నారు.
ప్రధాని మోడీ విశాఖపట్నం రాక సందర్భంగా సిపిఎం నాయకులను గృహ నిర్బందం చేయడాన్ని నిరసిస్తూ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో ఉండాలని నక్కపల్లి దగ్గర బల్క్ డ్రగ్ పార్క్ ను వ్యతిరేకిస్తూ అనకాపల్లి జిల్లా సిపిఎం నాయకులు అంతా ఆందోళన చేస్తున్నారు.
అదే సమయంలో మోడీ రోడ్ షోలో విశాఖ ఉక్కు గురించి నిరసనలు తెలపాలని భావించిన నిరసనకారుల ఆందోళనలకు గృహ నిర్బంధం ద్వారా బ్రేక్ వేసేందుకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. అయితే తమ గొంతు వినిపించకుండా అడ్డుకోవడం పట్ల ప్రజా సంఘాల నేతలు ఫైర్ అవుతున్నారు.
కూటమి పెద్దలుగా ఉంటూ ఏపీలో బీజేపీతో కలసి ప్రభుత్వం నడుపుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రధానితో పాటే సభా వేదికను పంచుకుంటారు కాబట్టి కార్మికుల డిమాండ్ ని వారైనా మోడీకి వినిపించాలని విశాఖ ఉక్కుని కాపాడాలని కోరుతున్నారు.
People believed that the govt will protect interest of steel factory workers, the govt will do the justice to them nothing to worry be confident on state govt
తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు… సీ బి వర్క్
ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు… సీ బి వర్క్
1400 రోజులు నిరసనలు ఏంటీ మరీ కామెడీ కాకపోతే … అన్నిరోజులు ఏడిచినా ఎవరూ పట్టించుకోలేదు అంటే అర్థం జనం మీ పక్షాన లేరు మీదగ్గర న్యాయం లేదు అనే
Did you apply same logic to Amaravathi farmers?
Jai Bodiji