వైకుంఠ ద్వార దర్శనం కోసం భక్తులు పరితపిస్తారు. అందుకే ఆ సమయంలో కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకోవాలని తిరుమలకు వస్తుంటారు. రోజుల తరబడి దర్శనం కోసం ఎదురుచూపులు. ఎన్నెన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ వైకుంఠ ద్వారం ద్వారా దర్శనం చేసుకున్న భక్తులు కష్టాలు, ఇబ్బందులన్నీ మరిచిపోతారు.
గతంలో కేవలం రెండు రోజులు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం చేయించేవారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం చేయించడం మొదలు పెట్టారు. అదే కొనసాగుతోంది. గతంలో కూడా లక్ష మందికి తక్కువ కాకుండా తిరుపతి, తిరుమలలో భక్తులకు దర్శనం కల్పించేందుకు టోకెన్లు ఇచ్చారు. అంతా సాఫీగా సాగిపోయింది.
అసలు టీటీడీ చరిత్రలోనే తొక్కిసలాటలో మరణాలనేవి లేవు. అలాంటిది ఇప్పుడు ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోవడం, సుమారు 50 మంది గాయాలుపాలు కావడం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఎప్పుడూ లేని రీతిలో ఇప్పుడే తొక్కిసలాట జరిగిందనే ప్రశ్న ఉత్పన్నమైంది. దీనికి పూర్తిగా టీటీడీ పాలక మండలి, ఉన్నతాధికారుల అసమర్థతే కారణమనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
గతంలో తిరుపతి, చుట్టు పక్క నియోజకవర్గాలైన చంద్రగిరి, శ్రీకాళహస్తి నియోజకవర్గాల ప్రజలకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించేవారు. ఒకవేళ ఎవరైనా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులను నిరాశపరచకుండా టోకెన్లు ఇచ్చేవారు. తిరుపతిలో ఐదారు కేంద్రాలు, తిరుమలలోనూ ఒకట్రెండు కేంద్రాలు ఏర్పాటు చేసి, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శన టోకెన్లు ఇచ్చేవాళ్లు.
కానీ టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అత్యుత్సాహంతో అందరికీ దర్శనం కల్పిస్తామని ప్రకటించారు. 1.20 లక్షల మందికి తిరుపతి, తిరుమలలో టోకెన్లు ఇస్తామని ఆయన చెప్పారు. దీంతో ఏపీతో పాటు కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల్లోని భక్తులు దర్శనం కోసం తిరుపతికి వెల్లువెత్తారు. గతంలో ఎన్నడూ లేని విధంగా నగరంలో ట్రాఫిక్‌ను స్తంభింపజేసి, క్యూలైన్లను రోడ్లపై ఏర్పాటు చేశారు.
గురువారం ఉదయం ఐదు గంటల నుంచి దర్శనం టికెట్ల జారీ మొదలు కావాల్సి వుంటే, బుధవారం నుంచే భక్తులు క్యూలైన్లలో నిలిచారు. ఇదంతా టీటీడీ పాలక మండలి అధ్యక్షుడికి, అలాగే ఉన్నతాధికారులకు ముందు చూపులేకపోవడంతో జరిగిందనే విమర్శ లేకపోలేదు. అందరికీ దర్శనం కల్పించాలనే ఆశయం మంచిదే కానీ, సాధ్యాసాధ్యాల గురించి ఆలోచించాలన్న ఇంగితం కొరవడిందనే మాటలు వినిపిస్తున్నాయి.
అలాగే టీటీడీలో అనుభవజ్ఞులైన ఇంజనీర్లను వివిధ కారణాలతో పక్కన పెట్టడం, అలాగే కొందరి వేధింపులతో సెలవుపై వెళ్లడంతో పాలనాపరమైన తప్పిదాలకు తెరలేచిందన్న చర్చ టీటీడీ ఉద్యోగుల్లో జరుగుతోంది. చివరికి క్యూలైన్లలో భక్తుల తొక్కిసలాటకు దారి తీసింది. గంటల తరబడి క్యూలైన్లలో ఉంటుండడంతో, భక్తులు తీవ్ర అసహనంతో ఉన్నారు. ఈ దశలో సరైన సమన్వయం, సమాచారం లేకపోవడంతో క్యూలైన్లలో భక్తుల మధ్య తీవ్ర తొక్కిసలాట జరిగింది. కలియుగ దైవాన్ని దర్శించుకోకుండానే, మృత్యువాత పడాల్సి వచ్చింది.
Devudu guddivadaa.. Pakkodi meeda nindalu veste.. Mana meeda enni papalu antagadatado chupinchadu.. Laddu animal fat anedi enta abaddamo devude chupinchadu..
Our NDA govt. win with land slide victory so we expect land slide news also….😭😭
ఇంకా ఎర్రి జనాలకి ఎలాంటి పుష్పాలు ఈ కాంపుష్పాలు గాని ఈ కమ్మ పుష్పాలు గాని పెడతారంటే జగనే దీనికి వైసీపీ కార్యకర్తలను తోలి జనాల్ని చంపించాలని కంపు మంత్రి చెప్పినా నమ్ముతారు
వైకుంఠ దర్శనం అని వెళ్తే ఏకంగా వైకుంఠానికే పంపేశారు !
తొమ్మిది, మూడు ఎనిమిది, సున్నా, ఐదు, మూడు, ఏడు, ఏడు, నాలుగు, ఏడు. ఫర్ వీసీ
తొమ్మిది, సున్నా,ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది వీసీ
Tdp government vypalyam badhyathaa cbn, lokesh dhi valla family ki sahayam cheyandi bad time