కూతురికి చరణ్ ఇచ్చిన పెద్ద గిఫ్ట్

ఇప్పటివరకు పాప, అమ్మా అని మాత్రమే అంటోందంట. ఎప్పుడైతే క్లింకార తనను నాన్న అని పిలుస్తుందో, ఆ మరుక్షణం ఆమెను ప్రపంచానికి పరిచయం చేస్తానంటున్నాడు.

పెళ్లయిన దాదాపు దశాబ్దం తర్వాత తండ్రి అయ్యాడు రామ్ చరణ్. చరణ్-ఉపాసన దంపతులకు క్లింకార పుట్టింది. పాప పుట్టి ఇన్ని రోజులైనా ఇప్పటికీ చిన్నారిని బాహ్య ప్రపంచానికి పరిచయం చేయలేదు చరణ్. దీనికి కారణం వెల్లడించాడు.

“క్లింకారను ఎప్పుడు చూపిస్తావని అంతా అడుగుతుంటారు. కానీ క్లింకారకు ప్రైవసీ చాలా ముఖ్యం. ఎంత కోరుకున్నా దొరకనది అదే. అందుకే నా కూతురికి నేనిచ్చే పెద్ద బహుమతి ప్రైవసీ. వాళ్లంతట వాళ్లు ఎదగడానికి, ఒత్తిడి లేకుండా పెరగడానికి, క్లింకార మొహాన్ని ఎంతవరకు వీలైతే అంతవరకు చూపించకుండా ఉండడానికి ప్రయత్నిస్తాను. స్కూల్ డేస్ లో మమ్మల్ని బాగా గుర్తుపట్టేవాళ్లు. దానివల్ల మేం సరిగ్గా ఉండలేకపోయేవాళ్లం. అదంతా నాకు చిన్న భారంగా ఉండేది. అందుకే మా పాపకు ఆ భారం లేకుండా చేయాలనుకున్నాను.”

అయితే ఒక సందర్భంలో మాత్రం పాపను ప్రపంచానికి పరిచయం చేస్తానంటున్నాడు చరణ్. ఇప్పటివరకు పాప, అమ్మా అని మాత్రమే అంటోందంట. ఎప్పుడైతే క్లింకార తనను నాన్న అని పిలుస్తుందో, ఆ మరుక్షణం ఆమెను ప్రపంచానికి పరిచయం చేస్తానంటున్నాడు.

చరణ్ కు అక్క అంటే చాలా భయమంట. భార్య ఉపాసన అంటే మాత్రం భయం లేదంటున్నాడు. కానీ పైకి మాత్రం ఉపాసనకు భయపడినట్టు నటిస్తానని చెబుతున్నాడు.

9 Replies to “కూతురికి చరణ్ ఇచ్చిన పెద్ద గిఫ్ట్”

  1. తొమ్మిది, మూడు ఎనిమిది, సున్నా, ఐదు, మూడు, ఏడు, ఏడు, నాలుగు, ఏడు. ఫర్ వీసీ

  2. తొమ్మిది, మూడు ఎనిమిది, సున్నా, ఐదు, మూడు, ఏడు, ఏడు, నాలుగు, ఏడు. వీసీ

Comments are closed.