నైజాంలో గేమ్ ఛేంజర్ పై పుష్ప-2 దెబ్బ

గేమ్ ఛేంజర్ కు మాత్రం కేవలం విడుదల రోజున మల్టీప్లెక్సుల్లో 150 రూపాయల పెంపు ఇచ్చింది. అదే విధంగా సింగిల్ స్క్రీన్స్ కు వంద రూపాయలు పెంచింది.

పుష్ప-2 సినిమాకు ముందురోజు రాత్రి నుంచే షోలు పడ్డాయి. ఆ తర్వాత మిడ్-నైట్ షోలు కూడా నడిచాయి. ఆ సినిమాతో బెనిఫిట్ షోల పద్ధతి ముగిసినట్టు కనిపిస్తోంది. గేమ్ ఛేంజర్ కు మిడ్ నైట్ షోల (బెనిఫిట్ షో)కు అనుమతి నిరాకరించింది తెలంగాణ ప్రభుత్వం.

టికెట్ రేట్లు పెంచుకొని రాత్రి ఒంటి గంట షోకు అనుమతి కోరారని, ఆ ప్రతిపాదనను తిరస్కరిస్తున్నామని స్పష్టంగా జీవోలో పేర్కొంది తెలంగాణ సర్కారు. జీవోలో మొదటి పాయింట్ ఇదే.

సో..రేపు ఉదయం 4 గంటల నుంచి నైజాంలో గేమ్ ఛేంజర్ షోలు మొదలవుతాయి. రేపు ఒక్క రోజు 6 షోలు వేసుకునేందుకు, ఆ షోలకు టికెట్ రేట్లు పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతినిచ్చింది.

పుష్ప-2 సినిమాకు మల్టీప్లెక్సుల్లో టికెట్ రేట్ పై 200 రూపాయలు పెంచుకునేందుకు అనుమతినిచ్చిన తెలంగాణ ప్రభుత్వం, గేమ్ ఛేంజర్ కు మాత్రం కేవలం విడుదల రోజున మల్టీప్లెక్సుల్లో 150 రూపాయల పెంపు ఇచ్చింది. అదే విధంగా సింగిల్ స్క్రీన్స్ కు వంద రూపాయలు పెంచింది.

11వ తేదీ నుంచి ఈ టికెట్ రేట్ల పెంపు మరింత తగ్గింది. 11వ తేదీ నుంచి 5 షోలకు మాత్రమే అనుమతి ఇస్తూ.. మల్టీప్లెక్సుల్లో వంద రూపాయలు, సింగిల్ స్క్రీన్స్ కు 50 రూపాయల పెంపు ఇచ్చింది.

టికెట్ రేట్ల పెంపులోనే కాదు, కాలపరిమితిలో కూడా పుష్ప-2, గేమ్ ఛేంజర్ మధ్య చాలా తేడా చూపించింది తెలంగాణ ప్రభుత్వం. పుష్ప-2 సినిమాకు ఏకంగా 20 రోజుల పాటు టికెట్ రేట్ల పెంపు ఇవ్వగా, గేమ్ చేంజర్ కు 10 రోజుల వరకు మాత్రమే ప్రత్యేక పెంపు ఇచ్చారు.

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన జరిగిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది. ఒక దశలో ప్రత్యేక అనుమతులన్నింటినీ రద్దు చేయాలని భావించింది కూడా. కానీ దిల్ రాజు చొరవ చూపించి, గేమ్ ఛేంజర్ కు ఉన్నంతలో కొద్ది పెంపుతో ప్రత్యేక జీవో తెచ్చుకోగలిగారు.

12 Replies to “నైజాంలో గేమ్ ఛేంజర్ పై పుష్ప-2 దెబ్బ”

  1. Pushpa 2 collections, what is Telugu states contribution, if the reception is good no need for any ticket price hike or extra shows, if it does well in North, then the collections will be very good. Else, whatever support government gives, it is not of any use. Only the movie should be good and have positive feedback

  2. తొమ్మిది, మూడు ఎనిమిది, సున్నా, ఐదు, మూడు, ఏడు, ఏడు, నాలుగు, ఏడు. వీసీ

Comments are closed.