తప్పు జరిగింది క్షమించమని కోరిన పవన్!

తిరుపతి తొక్కిసలాట ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. “తప్పు జరిగింది… క్షమించండి” అంటూ కోరారు.

తిరుపతి తొక్కిసలాట ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. “తప్పు జరిగింది… క్షమించండి” అంటూ కోరారు. తొక్కిసలాట ఘటనలో గాయపడిన వారిని పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ, టీటీడీలో ప్రక్షాళన జరగాలని, అదే విషయంపై సీఎం చంద్రబాబుతో మాట్లాడతానని తెలిపారు.

“ఇంత మంది అధికారులు ఉన్నా ఆరుగురి ప్రాణాలు పోవడం సరైంది కాదు. పోలీసులు భక్తులను ఎందుకు కంట్రోల్ చేయలేకపోయారు?” అని ప్రశ్నించారు. ఈవో శ్యామల రావు, జేఈవో వెంకయ్య చౌదరి పూర్తిగా విఫలమయ్యారని అన్నారు. అధికారుల తీరుతో సీఎం చంద్రబాబుకు చెడ్డపేరు వస్తుందని, వారు తక్షణమే మేల్కోవాలని సూచించారు. అలాగే, పోలీసులను అడ్డుపెట్టుకుని ఏదైనా కుట్ర జరిగిందేమోనన్న అనుమానం వ్యక్తం చేశారు.

“దైవ దర్శనం కోసం వచ్చిన భక్తులను క్యూలైన్లలో నిలబెట్టడమేంటి? టీటీడీ వీఐపీల కోసం కాదు, సామాన్య భక్తులకు సేవ చేయడానికే ఉంది,” అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.

పవన్ పరామర్శించిన తర్వాత ఇదే విధంగా మాట్లాడతారనే అంచనాలు అందరిలోనూ ఉన్నాయి. ఎందుకంటే, ఇక్కడ టీటీడీ అధికారులపై విమర్శలు చేయడం, ఏదో కుట్ర ఉందని చెప్పడం పవన్ కళ్యాణ్ రాజకీయాలలో భాగంగా మారిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కనీసం టీటీడీ చైర్మన్‌పై ఒక మాట కూడా మాట్లాడకుండా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయడం విశేషం. ఈ మధ్యకాలంలో ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చినప్పుడల్లా, ఇటువంటి వ్యాఖ్యల ద్వారా ప్రజల దృష్టిని మళ్లించి రాజకీయ లబ్ధి పొందడం జరుగుతోందన్న విషయం తెలిసిందే.

దైవ దర్శనం కోసం భక్తులను క్యూలో నిలబెట్టడం ఏమిటని ప్రశ్నించడం ప్రజలకు వింతగా అనిపిస్తోంది. చిన్న చిన్న గుడుల్లో కూడా దైవ దర్శనం కోసం క్యూలైన్లు ఉంటున్నాయన్న విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు ఈ అంశంపై మాట్లాడటం పవన్ కళ్యాణ్‌కే చెల్లింది.

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పిన టీటీడీలో ప్రక్షాళన గురించి మీడియా వద్ద వ్యాఖ్యానించడం ఎందుకు? ప్రభుత్వమే ఆయన చేతుల్లో ఉండగా టీటీడీలో ప్రక్షాళనతో పాటు క్యూలైన్లను కూడా తీసివేస్తే, భక్తులు పవన్ కళ్యాణ్‌ను ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. మూడు నెలల క్రితం సనాతన ధర్మం కోసం డిక్లరేషన్ అంటూ హడావుడి చేసి, తర్వాత దాని గురించి మాట్లాడకపోవడం గుర్తుండే ఉంటుంది. మాటలకన్నా చేతల్లో చూపితే పవన్ కళ్యాణ్ చరిత్రలో నిలిచిపోతారు.

31 Replies to “తప్పు జరిగింది క్షమించమని కోరిన పవన్!”

  1. బెజవాడ వరదలు వస్తాయని 24 గంటలు ముందే తెలిసిన, జనాలకి చెప్పలేదు… ఎందుకంటే జనాలు పట్టించుకోరు అని చెప్పి.. సెలవిచ్చారు..

    ఇప్పుడెందుకు ఇలా చేశారు అంటే.. చింతించడం తప్పితే మనం చేసేదేం లేదు.. అదీ వాళ్ళ పాలన, అనుభవం..

  2. దైవ దర్శనం కోసం జనాలు వస్తే వాళ్ళని క్యూ లైన్ లో పెట్టడం ఏంటి… మహా మేధావి..

  3. జగన్ ప్రభుత్వం లో జరిగిన తప్పుల వల్లనే ఈ ప్రమాదం జరిగింది అని అంటాడేమో అనుకున్న.

    1. Anantha babu chesina parcel nu ….. valla nayakudu dandalesadu

      Adi accident kaadu

      Anantha babu murder chesadu

      Akkada oka sorry ayina atanno

      Atani adhinethano cheppa manandi

      Antha ledu addam vachinodini vesesi sorry cheppala ….

      Antaadu

  4. Ayinaa pawan kalyan ki Devudu cbn kada..

    package tisukuni routine gaaa Oka dialogue cheppi poyaadu.

    veedu cheppindi cbn elagu cheyadu.

    aa EO kamma, chairman kamma

    1. Ravi garu, please do not associate yourself with politicians; they are often deceitful, and you are well aware of that. Why bring up the issue of caste? You are a highly cultured and self-respecting individual, yet this behavior seems unbecoming of you. As a cultured and well-educated person, there is no need for you to act like those who bring caste into discussions. It is unnecessary for you to be subservient to politicians. Ravi garu, it is important to engage in discussions respectfully without involving caste or religion. Whatever your religion may be, it does not matter in the context of respectful and meaningful dialogue.

  5. నిజంగానే తప్పు జరిగిందని pawan క్షమాపణలు చెప్పాడు…. ఐన దాని మీద కూడా యేడ్చే నువ్వు….మరి మన anniyya నవ్వుతూ, ఆడుతూ పాడుతూ, వందల మంది జనం తో icu లోకి వెళ్లి ,patients మీద పడిపోతు చేసిన హడావిడి గురించి చెప్పవా GA ….

  6. తొమ్మిది, మూడు ఎనిమిది, సున్నా, ఐదు, మూడు, ఏడు, ఏడు, నాలుగు, ఏడు. వీసీ

Comments are closed.