తిరుపతి జిల్లా ఇన్చార్జ్ ఎస్పీగా చిత్తూరు ఎస్పీ వీఎన్ మణికంఠ చందోలు శనివారం బాధ్యతలు స్వీకరించారు. డీజీపీ ద్వారకా తిరుమలరావు ఆదేశాల మేరకు బాధ్యతలు చేపట్టారు. ఇటీవల తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మృతి చెందగా, 50 మంది దాకా గాయపడ్డారు. ఈ దుర్ఘటనకు బాధ్యున్ని చేస్తూ తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడిపై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది.
ఈ నేపథ్యంలో చిత్తూరు ఎస్పీకి తిరుపతి జిల్లా ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించారు. కూటమి సర్కార్ ఏర్పడగానే తెలంగాణ నుంచి సుబ్బరాయుడిని డిప్యుటేషన్‌పై తీసుకొచ్చారు. చంద్రబాబుకు సన్నిహితుడిగా సుబ్బరాయుడికి పేరు వుంది. అందుకే ప్రభుత్వం రాగానే ఆలస్యం చేయకుండా ఆయన్ను తీసుకొచ్చారు.
గతంలో 2014లో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు కూడా ఇదే రకంగా సుబ్బరాయుడిని ఆంధ్రాకు తెచ్చుకున్నారు. అనంతరం ప్రభుత్వం పోగానే, సుబ్బరాయుడు తెలంగాణకు వెళ్లిపోయారు. ఆ మధ్య సుబ్బరాయుడిపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
కక్షపూరితంగా వ్యవహరిస్తున్న సుబ్బరాయుడిని సప్త సముద్రాలు అవతల ఉన్నా తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే చట్టప్రకారం శిక్షిస్తామని హెచ్చరించారు. అయితే ఊహించని దుర్ఘటన చోటు చేసుకోవడంతో సుబ్బరాయుడు తీవ్ర అసంతృప్తితో తిరుపతి ఎస్పీగా నిష్క్రమించాల్సి వచ్చింది.
ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు
ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు