ఎప్పుడొస్తే అప్పుడే పండగ

రాజాసాబ్ సినిమాకు భారీగా గ్రాఫిక్ వర్క్ నడుస్తోంది. సినిమా షూటింగ్ కొలిక్కి వచ్చినప్పటికీ, గ్రాఫిక్స్ మాత్రం కొలిక్కిరాలేదు

సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతూ రాజాసాబ్ నుంచి కొత్త పోస్టర్ వచ్చేసింది. ప్రభాస్ లుక్ బాగుంది. అప్పుడెప్పుడో వచ్చిన డార్లింగ్, మిర్చి లాంటి సినిమాల్లో కనిపించినట్టు ప్రభాస్ కనిపించాడు. అయితే ఇక్కడ చర్చ ఇది కాదు.

పోస్టర్ పై విడుదల తేదీ లేదు. ఈ సినిమాను ఏప్రిల్ 10న విడుదల చేయబోతున్నట్టు గతంలోనే ఘనంగా ప్రకటించారు. అయితే తాజాగా విడుదల చేసిన పోస్టర్ లో మాత్రం డేట్ లేదు. దీంతో ఈ సినిమా వాయిదా పడిందనే విషయంపై చాలామందికి క్లారిటీ వచ్చేసింది.

దీనికితోడు మేకర్స్ ఇచ్చిన స్టేట్ మెంట్ కూడా ఈ విషయాన్ని పరోక్షంగా నిర్థారించింది. ఎప్పుడొస్తే అప్పుడే పండగ అంటూ ఇచ్చిన స్టేట్ మెంట్ తో ఈ సినిమా వాయిదా పడిందనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు.

రాజాసాబ్ సినిమాకు భారీగా గ్రాఫిక్ వర్క్ నడుస్తోంది. సినిమా షూటింగ్ కొలిక్కి వచ్చినప్పటికీ, గ్రాఫిక్స్ మాత్రం కొలిక్కిరాలేదు. పైగా తాజాగా చేతికొచ్చిన గ్రాఫిక్స్ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో రీ-వర్క్ కోసం మరో కంపెనీకిచ్చారు.

వీఎఫ్ఎక్స్ సంస్థల కొత్త డెడ్ లైన్స్ నిర్మాతల వద్ద ఉన్నాయి. వాటిని దృష్టిలో పెట్టుకొని కావాలంటే మరో విడుదల తేదీని ప్రకటించొచ్చు. కానీ ఔట్ పుట్ చేతికొచ్చిన తర్వాతే విడుదల తేదీ నిర్ణయించాలని మేకర్స్ నిర్ణయించుకున్నారు. అలా డేట్ లేకుండా ఈరోజు పోస్టర్ వచ్చేసింది.

One Reply to “ఎప్పుడొస్తే అప్పుడే పండగ”

  1. ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు

Comments are closed.