నాయకుడి పరువు పోతుందని గులాబీలకు అనిపించదా?

ఎన్ని సార్లు విచారణకు పిలిచినా వస్తానని, ఎన్ని ప్రశ్నలు అడిగినా చెప్తానని, సహకరిస్తానని కేటీఆర్ అంటున్నారు.

భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ఈడీ విచారణకు హాజరయ్యారు. ఫార్ములా ఈ కార్ రేసు నిర్వహణకు భారీగా డబ్బులు చెల్లించడంలో అక్రమాలు జరిగినట్టుగా, అవినీతికి పాల్పడినట్టుగా, నిబంధనలను పాటించకుండా విదేశీ సంస్థకు నిధులు చెల్లించినట్టుగా ఉన్న ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ విచారణ సాగిస్తున్న సంగతి తెలిసిందే.

హెచ్ఎండీఏ నుంచి నిబంధనలు పాటించకుండా ఈ సొమ్ము చెల్లించారు. కేటీఆర్ ఆదేశాల మేరకే చెల్లింపులు జరిగినట్టు కేసులున్నాయి. ఇప్పటికే ఇద్దరిని విచారించి ఆ సమాచారంతో కేటీఆర్ ను కూడా విచారిస్తున్నారు. కేటీఆర్ మాత్రం చాలా సహజమైన శైలిలో.. ఇలాంటి విచారణలకు బెదిరేది లేదని చాలా డాంబికంగా చెబుతున్నారు. పైసా అవినీతి చేయలేదని అంటున్నారు.

అదంతా పక్కన పెడితే.. కేటీఆర్ ను విచారించిన సందర్భంగా.. భారాస పార్టీ నాయకులు, కార్యకర్తలు చేస్తున్న హడావుడి మాత్రం చిరాకు పుట్టిస్తోంది. ఈడీ కార్యాలయం వద్ద ఆ పార్టీ కార్యకర్తలు చేసిన రభస.. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు బలప్రయోగం చేయాల్సి రావడం ఇలాంటివి ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్నాయి.

తాను పరిశుద్ధుడినని ఒకవైపు తమ నాయకుడు చెప్పుకుంటూ ఉండగా.. అసలు ఆయనను విచారణకు పిలవడమే నేరం అన్నట్టుగా ఆ పార్టీ కార్యకర్తలు, దర్యాప్తు సంస్థల మీదికి ఎగబడడం వల్ల పరువు పోయేది పార్టీ నాయకులకే కదా అని ప్రజలు భావిస్తున్నారు.

ఈడీ కేటీఆర్ ను రెండోసారి విచారించింది. నిజానికి ఈ రోజు ఈడీ విచారణ తర్వాత ఈడీ కేటీఆర్ ను అరెస్టు చేస్తుందని పుకార్లు ముమ్మరంగా వ్యాపించాయి. ఈడీ వద్ద సమస్త ఆధారాలున్నాయని, అరెస్టు పర్వమే తరువాయి అని అంతా గుసగుసలాడుకున్నారు. గురువారం విచారణకు పిలిచిన ఈడీ అధికారులు సుమారు ఏడు గంటల పాటు కేటీఆర్ ను విచారించారు. ప్రధానంగా.. హెచ్ఎండీఏ నుంచి డబ్బు చెల్లింపులో నిబంధనల అతిక్రమణ గురించే ప్రశ్నించినట్లు తెలుస్తోంది. కేటీఆర్ కూడా ఇంచుమించుగా అదే సంగతి చెబుతున్నారు. అడిగిందే అడుగుతున్నారని చెప్పుకొచ్చారు.

ఎన్ని సార్లు విచారణకు పిలిచినా వస్తానని, ఎన్ని ప్రశ్నలు అడిగినా చెప్తానని, సహకరిస్తానని కేటీఆర్ అంటున్నారు. మరి నాయకుడే సహకరిస్తానని అంటుండగా.. కార్యకర్తలు సదరు విచారణకు అడ్డుపడే తరహాలో ఆఫీసువద్దకు దండెత్తి వెళ్లడం ఆ నాయకుడికే కదా పరువు చేటు. కేటీఆర్ విచారణకు వస్తున్నారంటే.. గుంపులుగా అక్కడకు వెళ్లడం వల్ల.. అధినేత గుడ్ లుక్స్ లో పడగలమని ఎమ్మెల్యేలు కూడా ఆశపుడుతున్నారేమో అర్థం కాదు. ఎందుకంటే.. వారు కూడా.. క్యూ కడుతున్నారు. ఇలా కార్యకర్తలు చేసే రాద్ధాంతం వలన.. ఆ పార్టీ నాయకుల క్రెడిబిలిటీనే దెబ్బతింటుందని వారు తెలుసుకోవాలి.

8 Replies to “నాయకుడి పరువు పోతుందని గులాబీలకు అనిపించదా?”

  1. అదే కదా మేము చెప్పేది, ja*** అనే ఒక వెకిలి వెధవ చనిపోయిన వారిని పరామర్శించటానికి గుంపులు గా పెద్ద మందని తీసుకొని పెద్ద పెద్ద గా రంకెలు వేస్తూ వెళ్తున్నాడు, వాడికి కూడా కొంచం గడ్డి పెట్టొచ్చుగా!!

  2. ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఏదు, ఐదు

  3. సరేలే, మొన్న brs పార్టీ వాళ్ళు ఆంధ్రా జనం పండక్కి ఊరు వెళ్ళాక వాళ్ళని ‘కూలి నా కొడుకులు’, ‘కర్రీ పాయింట్’ అంటూ ప్లకార్డులు పట్టుకున్నారు. మరి హైద్రాబాద్ లో ఆ కొడుకుల వల్లే ఎలక్షన్స్ లో ఆ మాత్రం సీట్లు వచ్చాయనీ మర్చిపోయినట్టున్నారు. సిసలైన తెలంగాణ వాళ్ళు ఛీ కొట్టారు ఈ దరిద్రులని.

  4. బొల్లిడు జైల్ కి వెళ్లినప్పుడకూడా పెంపుడు కుక్క ప్యాకేజీ స్టార్ కూడా అలాగే హడావుడి చేశాడు

Comments are closed.