పొలిటికల్​ బాంబు పేల్చిన ఎర్రబెల్లి

రాజకీయ నాయకులు చెప్పేది ఏదీ నమ్మలేం. చాలా పొలిటికల్​ గేమ్​లు, మైండ్​ గేమ్​లు ఆడుతుంటారు. ఎర్రబెల్లి కూడా మైండ్​ గేమ్​ ఆడుతుండవచ్చు.

రాజకీయాల్లో ఎవరు చెప్పేది నిజమో, ఎవరు చెప్పేది అబద్ధమో తెలియదు. కాంగ్రెసు ప్రభుత్వాలు ఎప్పుడూ అనిశ్చితిగానే ఉంటాయి కాబట్టి ఎవరేం చెప్పినా నిజమేమో అనిపిస్తుంది. తాజాగా బీఆర్​ఎస్​ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్​ రావు పొలిటికల్​ బాంబు పేల్చారు. ఏమని? రేవంత్​ రెడ్డి సర్కారును కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేలే కూల్చేస్తారని అన్నారు.

పాతికమంది ఎమ్మెల్యేలు ఆయన పట్ల అసంతృప్తిగా ఉన్నారని అంటున్నాడు. అంటే ఆ ఎమ్మెల్యేలు పార్టీ నుంచి తప్పుకుంటే ప్రభుత్వం పడిపోతుందని చెప్పడమన్నమాట. ఎర్రబెల్లి ఆధారాలు లేకుండా మాట్లాడరని బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు అంటున్నారు. ఎర్రబెల్లి బీఆర్​ఎస్​ నాయకుడు కాబట్టి ఆయన్ని సమర్థించడం సహజం.

అయితే రాజకీయ నాయకులు చెప్పేది ఏదీ నమ్మలేం. చాలా పొలిటికల్​ గేమ్​లు, మైండ్​ గేమ్​లు ఆడుతుంటారు. ఎర్రబెల్లి కూడా మైండ్​ గేమ్​ ఆడుతుండవచ్చు. అయితే సాధారణంగా కాంగ్రెసు ప్రభుత్వాలు అనిశ్చితిగానే ఉంటాయి. సహజంగానే ఆ పార్టీలో అసంతృప్తి కూడా ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి ఎర్రబెల్లి చెప్పింది కూడా కొట్టిపారేయడానికి అవకాశం లేదు.

అందులోనూ కాంగ్రెసు ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి, వ్యతిరేకత ఉన్నాయనేది వాస్తవమే. అయితే బీఆర్​ఎస్​ నాయకులు కాంగ్రెసు వ్యతిరేక ప్రచారాన్ని ముమ్మరంగా చేస్తున్నారు. ఎర్రబెల్లి దయాకర్​రావుది ఆ వ్యతిరేక ప్రచారంలో భాగమే కావొచ్చు. ఈ మధ్య పదిమంది కాంగ్రెసు ఎమ్మెల్యేలు రహస్యంగా సమావేశమైన సంగతి తెలిసిందే.

వీరు సీఎంకు వ్యతిరేకంగా సమావేశమయ్యారని ప్రచారం జరిగింది. కాని తాము ఒక మంత్రికి వ్యతిరేకంగా సమావేశమయ్యామని వారు చెప్పారు. బీఆర్​ఎస్​ నుంచి కాంగ్రెసు పార్టీలో చేరిన పది మంది ఎమ్మెల్యేల్లో కొందరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అప్పుడప్పుడూ మాట్లాడుతూనే ఉన్నారు.

ఇక రేవంత్​ రెడ్డిని పాతికమంది ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తున్నారంటే చాలా పెద్ద సంఖ్యే అని చెప్పుకోవాలి. ఆ ఎమ్మెల్యేలు ఎవరనేది కాంగ్రెసు పార్టీలో చర్చ జరుగుతోంది. అధిష్టానం వద్ద కూడా రేవంత్​ రెడ్డి పరపతి తగ్గిందని బీఆర్​ఎస్​ ప్రచారం చేస్తోంది. చూడాలి రేవంత్​ రెడ్డి సర్కారు భవిష్యత్తు ఎలా ఉంటుందో.

4 Replies to “పొలిటికల్​ బాంబు పేల్చిన ఎర్రబెల్లి”

  1. If Reventh Reddy were to be removed from his position, he would likely form his own political party, which could potentially cause significant harm to the Congress party.

Comments are closed.