తిరిగి వస్తున్నాను బ్రో – సమంత

ఓ టోర్నమెంట్ కోసం వీళ్లిద్దరూ కలిసి బయటకొచ్చారు కూడా. త్వరలోనే సమంత తన రిలేషన్ షిప్ ను బయటపెడుతుందంటున్నారు చాలామంది.

సినిమా ప్రకటించింది కానీ చేయట్లేదు. నిర్మాణ సంస్థ స్థాపించింది కానీ పనులు జరగడం లేదు. అసలు సమంత సినిమాలు చేస్తుందా చేయదా?

ఈ ప్రశ్నకు తోడు, ఇక సినిమాలు చేయనంటూ ఆమె పరోక్షంగా ఇచ్చిన స్టేట్ మెంట్స్ కూడా అనుమానాలకు ఆజ్యం పోసింది. ఏదైనా సినిమా చేస్తే అదే తన చివరి చిత్రం అన్నట్టుండాలని, అలాంటి కథలు మాత్రమే చేస్తానని గతంలో ప్రకటించి, డౌట్స్ రేకెత్తించింది సమంత.

ఎట్టకేలకు తన రీఎంట్రీపై సమంత స్పందించింది. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేసింది ఈ బ్యూటీ. “హాయ్ సమంత బ్రో.. తిరిగొచ్చేయండి. మిమ్మల్ని ఆపేవారు ఎవరూ లేరు” అంటూ ఎవరో పోస్ట్ పెట్టారు. దీనిపై స్పందించిన సమంత.. “తిరిగి వస్తున్నాను బ్రో” అంటూ నవ్వుతూ సమాధానమిచ్చింది.

ఈ సందర్భంగా రీసెంట్ గా తను నేర్చుకున్న జీవిత పాఠాన్ని కూడా బయటపెట్టింది. 3 రోజులు మౌనవ్రతం పాటించానని, రెండో రోజుకు ఫోన్ లేకుండా ఉండలేకపోయానని, మౌనం పాటించిన తర్వాత తనతో తాను మాట్లాడుకోగలిగానని, అది తన జీవితానికి ఎంతో పనికొస్తుందని అంటోంది.

దర్శక-నిర్మాత రాజ్ నిడిమోరుతో ఆమె రిలేషన్ షిప్ లో ఉందనే పుకార్లు గట్టిగా వినిపిస్తున్నాయి. ఓ టోర్నమెంట్ కోసం వీళ్లిద్దరూ కలిసి బయటకొచ్చారు కూడా. త్వరలోనే సమంత తన రిలేషన్ షిప్ ను బయటపెడుతుందంటున్నారు చాలామంది.

One Reply to “తిరిగి వస్తున్నాను బ్రో – సమంత”

Comments are closed.