హీరో రవితేజ, దర్శకుడు త్రినాధరావు నక్కిన కలిసి ధమాకా లాంటి వంద కోట్ల రూపాయల సినిమా ఇచ్చారు. దీంతో ఈ కాంబినేషన్ పై క్రేజ్ పెరిగింది. తిరిగి వీళ్లను కలిపే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి.
మరి దర్శకుడు ఏమంటున్నాడు? ధమాకా తర్వాత రవితేజతో మరో సినిమా ఎప్పుడు చేస్తాడు? దీనికి సంబంధించి ఆసక్తికర అప్ డేట్ ఇచ్చాడు త్రినాధరావు నక్కిన.
“ధమాకా సక్సెస్ తర్వాత మరో సినిమా చేద్దామని రవితేజను నేనే అడిగాను. దిల్ రాజు ఓ లైన్ చెప్పి స్క్రిప్ట్ చేయమన్నారు. 3-4 నెలలు దానిపై వర్క్ చేశాను. దిల్ రాజు కూడా హ్యాపీ. ఆ స్క్రిప్ట్ లో రవితేజ బాగుంటాడని అందరం ఒకేసారి ఫీల్ అయ్యాం. నేనే వెళ్లి రవితేజకు నెరేషన్ ఇచ్చాను. త్వరలోనే ఆ సినిమా ఉంటుంది.”
ఇలా రవితేజతో మరో సినిమా చేయబోతున్న విషయాన్ని బయటపెట్టాడు త్రినాధరావు. ప్రస్తుతం ఈ దర్శకుడు, సందీప్ కిషన్ హీరోగా మజాకా సినిమా చేశాడు. రిలీజ్ కు రెడీ అయిన ఈ సినిమాకు సీక్వెల్ తీసే ఆలోచనను కూడా బయటపెట్టాడు.
మజాకా సినిమాను ఎడిట్ లో చూస్తున్నప్పుడు ఓ సన్నివేశంలో సీక్వెల్ తీయొచ్చనే ఆలోచన కలిగిందంట. అదే విషయాన్ని అక్కడున్న నిర్మాతతో పంచుకోవడం, వెంటవెంటనే 3-4 సీన్స్ అనుకోవడం కూడా జరిగిపోయాయంట. అన్నీ అనుకున్నట్టు జరిగితే మజాకా-2 కూడా చేస్తానంటున్నాడు త్రినాధరావు నక్కిన.
కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,