త్రిభాషా సూత్రం.. ద‌క్షిణాదికే ఎందుకు, ఉత్త‌రాదికి లేదే!

ఒక‌వైపు ఉత్త‌రాది రాష్ట్రాల నుంచి ద‌క్షిణాది రాష్ట్రాల‌కు విప‌రీత‌మైన వ‌ల‌స‌లు. మ‌రోవైపు త్రిభాషా సూత్రాన్ని ద‌క్షిణాది రాష్ట్రాలే పాటించాలి.

నిస్సందేహంగా హిందీని ద‌క్షిణాది రాష్ట్రాల‌పై రుద్దుతున్నారు. ఒక‌వైపు ఉత్త‌రాది రాష్ట్రాల నుంచి ద‌క్షిణాది రాష్ట్రాల‌కు విప‌రీత‌మైన వ‌ల‌స‌లు. మ‌రోవైపు త్రిభాషా సూత్రాన్ని ద‌క్షిణాది రాష్ట్రాలే పాటించాలి, ఉత్త‌రాది రాష్ట్రాల‌కు ఆ అవ‌స‌రం లేద‌న్న‌ట్టుగా కేంద్ర ప్ర‌భుత్వం వ్య‌హ‌రిస్తున్న తీరు! ఇలాంటి నేప‌థ్యంలో తెలుగు వారు కిమ్మ‌న‌డం లేదు కానీ, పొరుగు రాష్ట్రాల వారు మాత్రం గ‌య్యి మంటున్నారు. హిందీ వ్య‌తిరేక ఉద్య‌మానికి పుట్టినిల్లుగా త‌మిళ‌నాడు త‌న ప్ర‌స్థానాన్ని కొన‌సాగిస్తూ ఉంది. ఇప్పుడు క‌ర్ణాట‌క కూడా స్వ‌రం క‌లిపింది. బెంగ‌ళూరులో హిందీలో మాట్లాడ‌క‌పోతే దోషం అయిన‌ట్టుగా కొంద‌రు నార్తిండియ‌న్లు ఇచ్చే క‌టింగులు, నార్తిండియ‌న్లు బెంగ‌ళూరు రావ‌డం వ‌ల్ల‌నే బెంగ‌ళూరు మ‌హాన‌గ‌రం అయిన‌ట్టుగా వారు స్పందించే తీరు నేప‌థ్యంలో క‌న్న‌డీగులు క‌స్సు మంటున్నారు. వాస్తవానికి క‌ర్ణాట‌క లో క‌న్న‌డ త‌ప్ప‌నిస‌రి అనే ప‌రిస్థితి గ‌తంలో లేదు.

అయితే.. హిందీ డ్యామినేష‌న్ తీవ్రం అవుతుండ‌టం వ‌ల్ల అపార్ట్ మెంట్లు, గేటెడ్ క‌మ్యూనిటీల్లో కూడా హిందీ జ‌నాలు త‌మ‌ది జాతీయ భాష అన్న‌ట్టుగా ఒక అబ‌ద్దాన్ని ప‌దే ప‌దే రుద్ధ‌డం వ‌ల్ల క‌న్న‌డీగుల్లో వ్య‌తిరేక‌త మొద‌లైంది. ఐటీ ఉద్యోగాల కోసం వ‌ల‌స వ‌చ్చిన ఉత్త‌రాది జ‌నాలు కూడా హిందీని అధికారిక భాష అన్న‌ట్టుగా మీటింగుల్లో కూడా వాడేస్తూ ఉంటారు. అది మినిమం మ్యాన‌ర్స్ కూడా కాక‌పోయినా.. ఐటీ కంపెనీలు న‌డిచేది ఇంగ్లిష్ వ్య‌వ‌హారికంగా అయినా, హిందీని చొప్పించ‌డానికి శ‌తాథా ప్ర‌య‌త్నిస్తున్నారు నార్తిండియ‌న్లు.

ఈ నేప‌థ్యంలో క‌ర్ణాట‌క‌లో గ‌త కొన్నాళ్లుగా నార్తిండియ‌న్లు ప్ర‌త్యేకంగా టార్గెట్ అవుతూ ఉన్నారు. ఆటో డ్రైవ‌ర్లు వీరిపై మొద‌ట తిర‌గ‌బ‌డుతున్నారు! వీరి వ‌ల్ల క‌న్న‌డ రాజ్యోత్స‌వాన్ని విప‌రీతంగా సెల‌బ్రేట్ చేసుకోవ‌డం తీవ్రంగా మారింది. బెంగ‌ళూరు క‌న్న‌డ నేల అని వారు గుర్తు చేయ‌డానికి ప్రాధాన్య‌త‌ను ఇస్తూ ఉన్నారు. హిందీ వాళ్లు అతి చేయ‌క‌పోతే ఇలాంటి ప‌రిస్థితి క‌ర్ణాట‌క‌లో వ‌చ్చేది కాదు. అయితే హిందీ అత్యుత్సాహం వ‌ల్ల ప‌రిస్థితి ఇక్క‌డ వ‌ర‌కూ వ‌చ్చింది.

క‌ర్ణాట‌క‌లో బీజేపీ ఉనికి కూడా హిందీకి అక్క‌డ ఊతం ఇస్తూ ఉంది. ఒక‌వేళ త‌మిళ‌నాడు లాగా బీజేపీ ఉనికి క‌ర్ణాట‌క‌లో కూడా కొన‌కొన‌గా ఉండి ఉంటే, ఈ స్థాయిలో హిందీ రుద్దుడు అక్క‌డ ఉండేది కాదు. ఈ అవ‌కాశాన్ని కాంగ్రెస్ కూడా అక్క‌డ ఉప‌యోగించుకుంటూ ఉంది. క‌ర్ణాట‌క‌లో క‌న్న‌డ‌లోనే మాట్లాడాల‌ని, వేరే భాష‌ల‌ను అర్థం చేసుకోవాల్సిన అవ‌స‌రం త‌మ‌కు లేద‌ని సీఎం సిద్ధ‌రామ‌య్య సూటిగా చెబుతూ ఉన్నాడు. హిందీ వ్య‌తిరేక‌త‌ను రాజ‌కీయంగా కూడా కాంగ్రెస్ వాడుకుంటూ ఉంది క‌ర్ణాట‌క‌లో! క‌న్న‌డీగులు కూడా భాషా ప్రేమికులే. ఈ వ్య‌వ‌హారంలో క‌ర్ణాట‌క‌లో ఎలా స్పందించాలో దిక్కుతోచ‌ని స్థితిలో ఉంది బీజేపీ. హిందీని జాతీయ భాష అంటూ రుద్దితే స్థానికుల్లో వ్య‌తిరేక‌త వ‌స్తుంది. దీంతో.. క‌ర్ణాట‌క వ‌ర‌కూ హిందీ విష‌యంలో వ్యూహాత్మ‌క మౌనం పాటిస్తూ ఉంది. త‌మిళ‌నాడులో మాత్రం మ‌ళ్లీ హిందీ విష‌యంలో బీజేపీ వాళ్లంతా స్పందించేస్తారు! త్రిభాషా సూత్రం అంటారు!

అయితే త్రిభాష సూత్రం మూలం ఏమిటి? అదెందుకు పెట్టారు? దాన్ని ఎలా పాటిస్తున్నారో స‌మీక్ష చేసే ధైర్యం కేంద్రానికి ఉందా? దేశ స్వ‌తంత్రం త‌ర్వాత త్రిభాష సూత్రం అమ‌ల్లో పెట్టిన‌ప్పుడు… ద‌క్షిణాది రాష్ట్రాలు ఎలా అయితే హిందీని బోధిస్తాయో, అలాగే ఉత్త‌రాది రాష్ట్రాలు కూడా ఒక ద‌క్షిణాది భాష‌ను త‌మ రాష్ట్రంలో విద్యార్థుల‌కు బోధించాలి. యూపీలో అయినా, బిహార్ లో అయినా, మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో అయినా ప్ర‌థ‌మ భాష‌గా హిందీని , ద్వితీయ భాష‌గా ఇంగ్లిష్ ను బోధిస్తూ ఉంటే.. తృతీయ భాష‌గా తెలుగునో, త‌మిళ‌న్నో, మ‌ల‌యాళాన్నో లేదా.. ఏ పంజాబీనో అయినా ఒక స‌బ్జెక్ట్ గా బోధించాలి. ఇదీ త్రిభాషా సిద్ధాంతం! ప్ర‌తి రాష్ట్రంలోనూ దాని మాతృభాష‌తో స‌హా ఇంగ్లిష్ తో పాటు మ‌రో భార‌తీయ భాష‌ను బోధించాలి. ఈ మేర‌కు ద‌క్షిణాదిలో హిందీ ప్ర‌వేశించింది. విచార‌క‌రం ఏమిటంటే.. ఈ త్రిభాషా సూత్రం ద‌క్షిణాది రాష్ట్రాల మీదే రుద్ద‌బ‌డింది.

తెలుగునాట ద‌శాబ్దాల నుంచి హిందీని మూడో భాష‌గా బోధిస్తూ ఉన్నారు. అలాగే క‌ర్ణాట‌క‌లో కూడా హిందీని ప్ర‌యోగించారు. అయితే త‌మిళ‌నాడు మాత్రం దీనికి వ్య‌తిరేకంగా నిల‌బ‌డింది. దానికి కార‌ణం కూడా ఉత్త‌రాది రాష్ట్రాలే. త్రిభాషా సూత్రాన్ని కేంద్రం ప్ర‌వచించిన త‌ర్వాత ఏ ఉత్త‌రాది రాష్ట్రం కూడా మూడో భాష‌ను బోధించ‌లేదు. హిందీ, ఇంగ్లిష్ ల‌కే ప‌రిమితం అయ్యారు. మ‌రే భార‌తీయ భాషనూ ఉత్త‌రాది రాష్ట్రాల్లో బోధించ‌నే లేదు ఇప్ప‌టి వ‌ర‌కూ! అయితే సౌత్ స్టేట్స్ పై మాత్రం హిందీని ద‌శాబ్దాల కిందే విజ‌య‌వంతంగా రుద్దేశారు! దానికి తోడు.. హిందీ బెల్ట్ లో కుటుంబ నియంత్రణ లేకుండా జ‌నాభాను ఇష్టానుసారం పెంచేశారు. దీంట్లో మ‌త వ్య‌త్యాసాలు ఏమీ లేవు! పోటాపోటీలు పెట్టుకుని జ‌నాభాను పెంచ‌డ‌మే ప‌నిగా పెట్టుకున్నారు. ఇలా తాము మంది ఎక్కువ‌య్యాం కాబ‌ట్టి.. హిందీని జాతీయ భాష అనే వాద‌న‌కు దిగుతున్నారు. త‌ప్ప‌నిస‌రిగా మీరంతా హిందీ నేర్చుకుని మాతో మాట్లాడండి అన్న‌ట్టుగా సిటీల్లో వీరి తీరు త‌యారైంది.

అస‌లు హిందీ జాతీయ భాష కాదు. ఇది రాజ్యాంగ‌మే చెబుతూ ఉంది. దేశంలోని స‌వాల‌క్ష భాష‌ల్లో హిందీ ఒక‌టి అంతే. మంది ఎక్కువ‌య్యారు కాబ‌ట్టి.. అదే జాతీయ భాష అంటే ఎలా చెల్లుతుంది? త్రిభాషా సూత్రాన్ని అమ‌లు చేయ‌క‌పోతే త‌మిళ‌నాడుకు నిధులు ఇవ్వ‌మ‌ని, ఇవ్వొద్ద‌ని అంటూ కూడా బీజేపీ సానుభూతి ప‌రులు రెచ్చ‌గొట్టే మాటలు మాట్లాడుతూ ఉన్నారు! అయితే ఎవ‌రి నిధులు ఎవ‌రికి ఇస్తున్నారు అనేది కూడా ప్రశ్నే!

ద‌క్షిణాది రాష్ట్రాల నుంచి వ‌సూల‌వుతున్న ప‌న్నులకూ, కేంద్రం నుంచి సౌత్ స్టేట్స్ కూ వ‌స్తున్న నిధుల‌కు పొంత‌న ఉందా? త‌మిళ‌నాడు, క‌ర్ణాట‌క‌, తెలంగాణ‌, కేర‌ళ‌, ఏపీ ల నుంచి ట్యాక్సుల రూపంలో ఒక రూపాయి కేంద్రానికి వెళుతుంటే, ఈ రాష్ట్రాల‌కు స‌గ‌టున 40 పైస‌లు కూడా తిరిగి రావ‌డం లేదు! త‌మ సంపాద‌న నుంచి 60 శాతాన్ని త్యాగం చేస్తూ దేశ ప్ర‌గ‌తికి ఇంధ‌నంగా మండుతున్నాయి ద‌క్షిణాది రాష్ట్రాలు. జ‌నాభా ఎక్కువ చేసి పెట్టిన పుణ్యానికి ఉత్త‌రాది రాష్ట్రాల‌ను సౌత్ రాష్ట్రాలు పోషిస్తూ ఉన్నాయి! ఇవ‌న్నీ కాకుండా ఇప్పుడు.. త‌మది దేశ్ భాషా అని, జాత్ కీ భాషా అంటూ హిందీ జ‌నాలు నోరేసుకుంటూ ఉండ‌టం, త్రిభాషా సూత్రం అంటూ కేంద్రం స‌న్నాయి నొక్కులు నొక్కుతూ ఉండ‌టం విచార‌క‌రం! మ‌రి త్రిభాషా సూత్రాన్ని అమ‌లు చేయ‌మ‌ని ఉత్త‌రాది రాష్ట్రాల‌ను ఎందుకు అడ‌గ‌దో కేంద్ర ప్ర‌భుత్వం. అదేమంటే భాషా చిచ్చు పెట్టువ‌ద్దంటూ హిత వ‌చ‌నాలు! ఎవ‌రు చిచ్చు పెడుతున్న‌ది!

ఇక ఇదే అనుకుంటే.. అస‌లు సంగ‌తి లోక్ స‌భ నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌! అది జ‌నాభా ప్రాతిప‌దిక‌న గ‌నుక జ‌రిగితే.. దక్షిణాది రాష్ట్రాల‌ది అర‌ణ్య రోద‌నే అవుతుంది శాశ్వ‌తంగా! యూపీ, బిహార్, మ‌ధ్య‌ప్ర‌దేశ్ వంటి రాష్ట్రాలు జ‌నాభాను పెంచి కూర్చున్నాయి. సౌత్ స్టేట్స్ ఏమో చాలా కాలంగా కుటుంబ నియంత్ర‌ణ‌ను జాగ్ర‌త్త‌గా పాటిస్తూ వ‌స్తున్నాయి. ఇందుకు ఫ‌లితం.. మ‌ళ్లీ ద‌క్షిణాది రాష్ట్రాల‌కే శ‌రాఘాతంగా త‌గ‌ల‌బోతోంది! యూపీ, బిహార్ తో స‌హా ఉత్త‌రాది రాష్ట్రాల‌న్నింటిలోనూ ఎంపీ సీట్లు జ‌నాభా ప్రాతిపదిక‌న పెంచితే భారీగా పెర‌గ‌బోతున్నాయి! అదే సౌత్ లో అయితే.. పెంపుద‌ల సంగ‌తిని ప‌క్క‌న పెడితే ఉన్న ఎంపీ సీట్ల సంఖ్య కూడా త‌గ్గిపోతుంది.

కేర‌ళ‌లో అయితే ఎంపీ సీట్ల సంఖ్య త‌గ్గిపోతుంద‌ట‌! ఏపీ-తెలంగాణ‌లో తూతూ మంత్రంగా ఒక‌టీ అర పెరుగుతాయి! త‌మిళ‌నాడులో ఒక ఎంపీ సీటు కూడా త‌గ్గ‌దంటూ కేంద్ర మంత్రి వర్యులు చెబుతున్నారు కానీ, ఇదే స‌మ‌యంలో అక్క‌డ ఒక్క ఎంపీ సీటు అయినా పెరుగుతుందంటూ చెప్ప‌డం లేదు! 20 కోట్ల స్థాయి జ‌నాభాతో యూపీ, బిహార్, అవే కాకుండా మ‌ధ్య‌ప్ర‌దేశ్, వెస్ట్ బెంగాల్, ఆఖ‌రికి ఛ‌త్తీస్ ఘ‌డ్, జార్ఖండ్, ఒడిశాలు కూడా త‌మ జ‌నాభా పెంపుద‌ల‌తో ఎంపీ సీట్ల‌ను పెంచుకుని దేశ రాజ‌కీయాన్ని శాసిస్తాయి! అయితే క్ర‌మ‌శిక్ష‌ణ‌తో కుటుంబ నియంత్ర‌ణ పాటించినందుకు గానూ ద‌క్షిణాది రాష్ట్రాలు మూకుమ్మ‌డిగా త‌మ రాజ‌కీయ ప్రాతినిధ్యాన్ని కోల్పోతాయి.

కేంద్రంలో అధికారాన్ని సంపాదించుకోవాలంటే ఉత్త‌రాదిన ప‌ని చేసుకుంటే చాలు. ఉత్త‌రాదిన ఎంపీ సీట్ల‌తోనే కేంద్రంలో అధికారాన్ని సొంతం చేసుకునే ప‌రిస్థితులు వ‌స్తాయి జ‌నాభా ప్రాతిప‌దిక‌న ఎంపీ సీట్లు పెరిగితే! అప్పుడు ద‌క్షిణాదిన ఎలా వ్య‌వ‌హ‌రించినా, ద‌క్షిణాది రాష్ట్రాల‌ను ఎంత‌గా నిర్ల‌క్ష్యం చేసినా కేంద్రంలో అధికారంలో ఉన్న వారికి న‌ష్టం లేదు! సౌత్ స్టేట్స్ నుంచి ప‌న్నులు వ‌సూలు చేసి ఉత్త‌రాదికి కేటాయింపులు చేసుకుంటూ, వ‌చ్చే పెట్టుబ‌డుల‌ను గుజ‌రాత్ కు త‌ర‌లించుకుపోవ‌డ‌మే పాల‌న అవుతుంది!

అయితే జ‌నాభా ప్ర‌తిపాదిక‌న ఎంపీ సీట్ల‌ను పెంపు ప్ర‌తిపాద‌న‌ను అపే ధైర్యం కానీ, అందుకు చొర‌వ చూపే స్థైర్యం కానీ ఇప్పుడు ద‌క్షిణాది రాష్ట్రాల నేత‌ల‌కు ఉందా అనేది ప్ర‌శ్నార్థ‌క‌మే! త‌మిళ‌నాడు మాత్ర‌మే ఈ విష‌యంలో స్పందిస్తూ ఉంది ఇప్ప‌టి వ‌ర‌కూ! దీని వ‌ల్ల న‌ష్టం కూడా స‌ద‌రు రాజ‌కీయ నేత‌ల‌కే! ఇప్పుడు కేంద్ర ప్ర‌భుత్వం త‌మ బ‌లం మీద ఆధార‌ప‌డి ఉన్న‌ప్పుడు కూడా స్పందించ‌క‌పోతే.. భవిష్య‌త్తులో వారికి కూడా ఇలాంటి అవ‌కాశాలు రావు! స్థూలంగా జ‌నాభా ప్రాతిపదిక‌న ఎంపీ సీట్ల సంఖ్య పెంపు అంటే మాత్రం.. దేశ రాజ‌కీయంలో సౌతిండియా మొత్త‌మే ఊక‌లో ఈక అవుతుంది. మ‌ళ్లీ త‌మిళ‌నాడు, ఆంధ్ర‌, తెలంగాణ అంటూ ఒక్కో రాష్ట్రం ప‌రిస్థితి అయితే చెప్పుకోన‌క్క‌ర్లేదు! ఎవ‌రు నెగ్గినా, ఎవ‌రు ఓడినా.. వీళ్లు ఏ లెక్క‌లోకీ అవ‌స‌రమే ప‌డ‌రు! అంత స్థాయిలో రాజ‌కీయ ప్రాధాన్య‌త‌ను కోల్పోతారు!

70 Replies to “త్రిభాషా సూత్రం.. ద‌క్షిణాదికే ఎందుకు, ఉత్త‌రాదికి లేదే!”

  1. మన లెవెనన్న” సింహం” కదా?? మరి సింహం ఎందుకో కుక్కలా మొరుగుతోంది?? మోడీ మీదికి దూకి, మెడలు వొంచి ఆంధ్రాకి అదనంగా ఇంకో 11 ఎంపీ సీట్స్ తెచ్చి నిజ్జంగా తోకలేని సింహం అని నిరూపించుకోవచ్చు కదా??

    1. do you have some shame…? eppudu jagan meeda edupena? this article is about how pity sohthern people will be if HINDI state gets more MP seats… south will be ignored permanently.

      stop chanting jagan name (jagan, jagan, jagan) atleast infront of your wife.

      useless fellows. use some brains..

  2. అడవిలో ఆరుపులు ఇక్కడ మాత్రమేనా, పార్లమెంట్ లో వైసీపీ పోరాడేది ఏమైనా ఉందా

    1. అసలు వైసీపీ కి ఎంతమంది ఎంపీలు ఉన్నారు, కూటమికి ఎంతమంది ఉన్నారు? ఎక్కువ మంది ఎంపీలు ఉన్న కూటమి పార్టీలని వదిలి తక్కువ ఉన్నవాళ్ళని ప్రశ్నిస్తున్నావు… జెండా కూలివా?

    2. do you have some shame…? eppudu jagan meeda edupena? this article is about how pity sohthern people will be if HINDI state gets more MP seats… south will be ignored permanently.

      .

      stop chanting jagan name (jagan, jagan, jagan) atleast infront of your wife.

      useless fellows. use some brains..

  3. ఒకడు రుద్దేదేంటి?వీలైనన్ని ఎక్కువ భాషలు నేర్చుకుంటే మనకే మంచిదే కదా!బయట ప్రాంతలకి ,ఉపాధి అవకాశాల కోసమో వచ్చినపుడు లైఫ్ easy అవుతుంది.డబ్బింగ్ ప్రాబ్లెమ్ వుండదు.హిందీ తమిళనాడు.. కేరళ తప్పించి దాదాపు అన్ని రాష్ట్రాలలో మాట్లాడతారు. అంత మాత్రాన డామినేషన్ అనడం కరెక్ట్ కాదు..అరవ రాజకీయ లు ఆపి ఇష్టం వుండే వాళ్ళని నేర్చుకొనివ్వండి.అంతే కాని..సౌత్..నార్త్..ఈస్ట్..వెస్ట్..అంటూ సొల్లు కొట్టకండి.

  4. people lost their minds… they are thinking silly jagan vs cbn here.

    .

    whereas broader and bigger issues gonna happen to the fate of Southern states..

    .

    wake up dudes.. have some sense and it is time for all to be united across south india to be united to force BJP not to make reorganization based on population.

    .

    SOUTH will have to cry forever… if we don’t wake up.

  5. ఈ విషయంలో తమిళనాడు ని అభినందించాల్సిందే, ఎప్పుడైనా సరే దక్షిణాదిని చిన్నచూపు చూసే ఉత్తరాది పార్టీలు, ఉత్తరాదికో రూలు దక్షిణాదికోరులుగా ప్రవర్తిస్తుంటాయి.దక్షిణాది రాష్ట్రాలు ఉమ్మడిగా స్పందించి ఉత్తరాదిని ఢీ కొనాల్సిందే ఇందులో రెండో అభిప్రాయమే లేదు, లేకుంటే ఉత్తరాది దక్షిణాదిని మింగే అవకాశం ఉంటుంది.

  6. Arava kukk laku mind undadu …

    Asalu kasaranam yemitante arava vadavalaku ” naluka ” tiragadu hindi matladadadaniki …adedo arabic , china language anukuntaru vadavalu..

      1. Arava ku kkalu is distinct from every other state in the South.

        E ku kkal u aaa poram bok u periyar gadu chesina politics matrame kavali

        It’s an excellent move to enforce national languages in the southern states.

        1. First- You didn’t answer my question

          Second – India doesn’t have any National language as such, we have 22 official languages accepted by Indian constitution

          1. అవునా.. మా ఊళ్లో థర్డ్ class లేబర్ నోటి నిండా పనparag వేసి కొని మాట్లాడుతూ ఉంటారు అదే అయి ఉంట ది

    1. 100 lo oka article meaning full vadulutadu ee ga. this makes sense. asalu telugu state lo hindi lo enduku answer cheyali. ee madya asalu telugu state lo vunnama leka northern state aa ani doubt vastundi

      tamil ati anipinchedi but that is good

  7. తెలంగాణ లో రేవంత్ రెడ్డి , అక్రమ సంపాదన తో వేల కోట్లు మూటగట్టుకున్న ముక్కోడు ఫామిలీ హిందీ కి బ్రాండ్ అంబాసిడర్స్ లాగ అడగక పోయిన వెళ్లి హిందీ లో ఇంటర్వూస్ ఇస్తుంటారు నీచులు

  8. స్టాలిన్ కి వేరే రాజకీయ కారణాలు ఉండొచ్చు గానీ, హిందీ ప్రాంతంలో మూడో భాష ఎందుకు అవసరం లేదు మరి ? సగం చదువు భాషలు నేర్చుకోవడానే అంకితం అయితే, బ్రతకడానికి పనికొచ్చే స్కిల్స్ ఎప్పుడు నేర్చుకోవాలి. ఇప్పుడు సౌత్ లో హిందీ నేర్చుకుని ఎవడిని ఉద్దరించాలి, అక్కడ నుండి ఉపాధి కోసం వచ్చేవాళ్లకు సౌకర్యంగా ఉండడం కోసం మనమెందుకు కష్టపడాలి ? అవసరం, ఆసక్తి ఉన్నవాళ్లు నేర్చుకుంటే సరి, మిగిలిన వాళ్ల మీద రుద్దడం ఎందుకు ?

  9. నేను 10వ తరగతి వరకు హింది చదివాను అది దేనికీ పనికి రాలేదు ఎందుకు చదివామో కూడా తెలీదు, ఈ భాష రుద్ధుడు మాత్రం తప్పే.

    1. అయితే నువ్వు ” నూతిలో కప్పలaa కాకుండా నార్త్ వెళ్తే తెలుస్తుంది హిందీ అంటే ఏమిటో.

      1. నేను నూతిలో కప్పనే సార్, నూటికి 90 మంది నాలాంటి వారే వారిరాష్ట్రాల లోనే ఉంటారు, ఎవరో మీలాంటి కొద్ది మంది మాత్రమే దేశం మొత్తం తిరగగల సౌలభ్యం ఉంటుంది

          1. సార్ మీరు కూడా కొంచెం మీ ఇంగిత జ్ఞానం వాడగలరు నేను సగటు జనాలు మా లాంటి వారి గురించి మాట్లాడుతుంటే మీరు దేశాధినేతలు, లేదా పలు రాష్ట్రాలలో తిరుగుతూ బ్రతకగల మీలాంటి వారి గురించే మాట్లాడుతున్నారు, మాకు అంత సౌలభ్యం లేదు సార్ గమనించగలరు

          2. There is no necessity for me to travel to another state because I, along with many others like me, have firmly established our lives here. While it is possible that we may be perceived as narrow-minded individuals with a limited worldview, that alone does not justify the imposition of an unfamiliar and unnecessary Hindi language upon us. Why should we be compelled to accept something that holds no relevance to our lives, sir?

      2. తప్పు.

        నేను 20 సంవత్సరాలనుండి అమెరికా లో వుంటున్నాను. ఇప్పటికీ ఇండియన్ షాప్ కి వెళ్లినా, గుడి కి వెళ్లినా, ముందు హిందీ లో మాట్లాడతారు. “I dont know Hindi ” అని చెప్పాకే ఇంగ్లీష్ లోకి వస్తారు. అంతలా stamp వేసేసారు మనమీద. నన్ను నూతిలో కప్ప అనలేరు కదా? ఇంతకు ముందు 5 సంవత్సరాలు Beligium లో వున్నాను.

      3. But, at the same time, how many North people are talking south languages while they are living in south India is a bigger question. It should be a 2 way traffic and not one way

          1. How do you 100% of North Indians living in south India are learning the south Indian languages? Did you speak to each one of them and in the local language? I have personally spoken to many people working in various hotels, constructions sites who cannot speak telugu and they have been living here for many months.

  10. The problem is our No1 and NO2 know only hindi..that is the major problem…it was observed that all central govt websites first home page display in HIndi…UPSC and other major exams also can write in hindi what logic is this..is it fair competition??

  11. ఎక్కడ జీవనానికి ఆదాయం దొరుకుతుందో ఆ భాష ను, వద్దన్నా కూడా జనాలు నేర్చుకుంటారు.

    బీహారు వాడు , చెన్నై లో తమిళం నేర్చుకుంటాడు.

    చెన్నై వాడు మణిపూర్ లో హిందీ మాట్లాడతాడు.

    నేషనల్ సర్వీస్ ( ఆర్మీ, పోస్టాఫీసు, నేషనల్ బ్యాంక్) లలో మాత్రం హిందీ నేర్చుకుంటే , సులువు గా కెరీర్ లో పైకి రావచ్చు.

  12. నువ్వు మూడు ఇష్యూ లను కలిపి ఎటు కాకుండా చేసావు. రాజ్యాంగం ప్రకారం హిందీ అధికార భాష అయినప్పుడు, ఇంగ్లీష్ తో సహా, దానిని మూడవ భాష గ నేర్చుకోవటం లో ఇబ్బంది ఏమిటి? ముందు మన తెలుగు ను కూడా నేర్చుకునే ల మన పాఠ్యాంశాలు ఉండాలి. మనం తమిళ నాడు కు ఈ విషయం లో సమర్ధించడం అనవసరం అని న అభిప్రాయం.

    ఇంకా జనాభా ప్రాతిపదికన టాక్స్ రేయింబర్సుమెంట్ ఇచ్చే ఫార్ములా మీద ఫైట్ చెయ్య వచ్చు. దానికి రాష్ట్ర వైశాల్యం, పేదరికం, నిరుద్యోగతనం, నిరక్షరాస్యత, ఆరోగ్యం లాంటి ప్రమాణాలు ముడివేసి ఇచ్చే తట్టుగా ప్రతిపాదించవచ్చు.

    ఇంకా పార్లమెంట్ సీట్ల విషయానికి జనాభా తో పటు వైశాల్యాన్ని కూడా కలిపి నిర్ణయించే ఒక ఫార్ములా కోసం పట్టుబడొచ్చు.

    1. What is a bigger issue than losing your own identity. Learning Hindi is well and good. However, it should not be forced on people. It should be voluntary. The other bigger and most mportant issue is trying to reduce the importance of southern states in parliament based on population ratio. It is nothing but pure discrimination.

  13. Stop your nonsense Great Andhra. Only AP and TN hate Hindhi, which are once under old Madras State. In all other States people like Hindhi and also used mostly. Do not mislead on 3 language rule. It is applicable to all states. But Hindhi is not compulsory..Let that narrow minded DMK Govt use Telugu as 3rd language with Tamil and English as other 2. Why they are silent on this and spreading lies as if Hindhi is imposed. Your media is Telugu one. Then why not suggest to TN narrow minded regional parties to follow Telugu as 3rd language. Let your media use Press freedom properly, do not misuse.

Comments are closed.