లాబీయిస్టుల‌కు మంచి ప్ర‌భుత్వం!

ఇది మంచి ప్ర‌భుత్వం అని కూట‌మి పెద్ద‌లు ప‌దేప‌దే చెబుతుంటారు. నిజ‌మే, అయితే ఎవ‌రికి మంచి ప్ర‌భుత్వం అనేదే ప్ర‌శ్న‌. ప‌రిపాల‌న‌లో ఐఏఎస్ అధికారులే కీల‌కం.

ఇది మంచి ప్ర‌భుత్వం అని కూట‌మి పెద్ద‌లు ప‌దేప‌దే చెబుతుంటారు. నిజ‌మే, అయితే ఎవ‌రికి మంచి ప్ర‌భుత్వం అనేదే ప్ర‌శ్న‌. ప‌రిపాల‌న‌లో ఐఏఎస్ అధికారులే కీల‌కం. సీఎం, మంత్రులు మ‌న‌కు క‌నిపిస్తుంటారు. కానీ క‌నిపించ‌కుండా పాల‌న సాగించేది ఐఏఎస్ అధికారులే. అయితే కీల‌క పోస్టుల్లో ఉన్న ఐఏఎస్ అధికారుల భార్య‌లు …అదృశ్యంగా వుంటూ దోచుకుంటున్నార‌నే ప్ర‌భుత్వ అనుకూల ప‌త్రిక క‌థ‌నం సంచ‌ల‌నం రేకెత్తిస్తోంది.

ఈ క‌థ‌నం చ‌దివిన వారెవ‌రికైనా …ఇది బ్రోక‌ర్ల‌కు మంచి ప్ర‌భుత్వం అనే అభిప్రాయం క‌లుగుతోంది. ప‌ద‌వులు, ప‌నుల కోసం సీఎం చంద్ర‌బాబునాయుడు, మంత్రి నారా లోకేశ్‌ల‌ను క‌ల‌వాల‌ని ఎవ‌రైనా అనుకుంటుంటారు. కానీ ఐఏఎస్ అధికారుల శ్రీ‌మ‌తులను ప్ర‌స‌న్నం చేసుకుంటే ప‌నులు సులువుగా అవుతాయ‌నే సంకేతాలు ఇచ్చిన‌ట్టు అయ్యింది.

బాబు, లోకేశ్‌ల‌ను క‌ల‌వ‌డం కంటే, స్టార్ హోట‌ళ్ల‌కు వెళ్లి… మిసెస్ ఐఏఎస్‌ల ద‌గ్గ‌రికి పోవ‌డానికి ప‌లువురు మొగ్గు చూపే అవ‌కాశం వుంది. విజ‌య‌వాడ‌లోని స్టార్ హోట‌ళ్ల‌కు వెళ్లి, హాయిగా అపాయింట్‌మెంట్ తీసుకోవ‌డంపై ప‌నులు కావాల్సిన నాయ‌కులు ఆరా తీస్తున్నార‌ని తెలిసింది. ఒక‌రిద్ద‌రు ఐఏఎస్ అధికారులైతే ఏమైనా అనుకోవ‌చ్చు. ఆ క‌థ‌నం ప్ర‌కారం ….ప్ర‌భుత్వంలో కీల‌క పోస్టుల్లో ఉన్న అధికారుల భార్య‌లంతా స్టార్‌హోట‌ళ్ల‌లో బిజినెస్ పెట్టార‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది.

దీపం వుండ‌గానే, ఇల్లు చ‌క్క‌దిద్దుకోవాల‌నే సామెత‌ను గుర్తు చేస్తున్నారు. మ‌రోవైపు అన‌ధికార ప‌నుల గురించి తెలియ‌క‌, చంద్ర‌బాబు, లోకేశ్ చుట్టూ తిరుగుతూ, చెప్పులు అరిగిపోవ‌డం, స‌మ‌యం వృథా కావ‌డంతో పాటు అన‌వ‌స‌ర ఖ‌ర్చుల‌ని నెత్తీనోరూ కొట్టుకుంటున్నారు. ప్ర‌భుత్వంలో లాబీయిస్టుల‌కు అత్యంత ప్రాధాన్యం ఉంద‌నే వాస్త‌వం మ‌రోసారి తెలిసొచ్చింది.

4 Replies to “లాబీయిస్టుల‌కు మంచి ప్ర‌భుత్వం!”

Comments are closed.