కిలో చికెన్‌పై రూ.10 ఇవ్వ‌లేద‌ని.. అధికారుల‌తో దాడి!

కిలో చికెన్‌పై రూ.10 ఇవ్వ‌డానికి నిరాక‌రించార‌నే అక్క‌సుతో చేతిలో ఉన్న అధికార యంత్రాంగాన్ని ఆ మ‌హిళా ప్ర‌జాప్ర‌తినిధి ప్ర‌యోగించారు.

కిలో చికెన్‌పై రూ.10 ఇవ్వ‌డానికి నిరాక‌రించార‌నే అక్క‌సుతో చేతిలో ఉన్న అధికార యంత్రాంగాన్ని ఆ మ‌హిళా ప్ర‌జాప్ర‌తినిధి ప్ర‌యోగించారు. నంద్యాల జిల్లాలోని ఆ నియోజక వ‌ర్గ “గ‌డ్డ‌”పై ఓ మ‌హిళా ప్ర‌జాప్ర‌తినిధి కిలో చికెన్‌పై రూ.10 వ‌సూలు చేయ‌డం గురించి చెప్పుకున్నాం. ఆ నియోజ‌క‌వ‌ర్గ కేంద్రంలో 30 నుంచి 40 చికెన్ సెంట‌ర్లు వుంటాయి. వీటిలో ఓ నాలుగు పెద్ద చికెన్ సెంట‌ర్ల య‌జ‌మానులు స‌ద‌రు మ‌హిళా ప్ర‌జాప్ర‌తినిధికి కిలోపై రూ.10 ఇవ్వ‌డానికి నిరాక‌రించారు.

దీంతో ఆగ్ర‌హించిన స‌ద‌రు మ‌హిళా ప్ర‌తినిధి మున్సిప‌ల్ హెల్త్ డిపార్ట్‌మెంట్ అధికారుల్ని స‌ద‌రు చికెన్ సెంటర్ల‌పై పుర‌మాయించారు. కేవ‌లం క‌మీష‌న్ ఇవ్వ‌లేద‌నే ఏకైక కార‌ణంతో ఆ నాలుగు చికెన్ సెంటర్ల‌పై మాత్ర‌మే దాడి చేయించి, మాంసాన్ని ప‌రీక్ష‌ల కోసం తీసుకెళ్లారు. అధికార యంత్రాంగంతో నాలుగు చికెన్ సెంట‌ర్లలో క‌లుషిత‌మైంద‌ని విక్ర‌యిస్తున్నార‌నే నివేదిక ఇప్పించి, మూసేయించాల‌నే కుట్ర‌కు తెర‌లేపారు.

ఈ విష‌య‌మై మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్‌కు కొంద‌రు నాయ‌కులు ఫోన్ చేసి, ఊళ్లోని అన్ని సెంట‌ర్ల‌పై దాడి చేస్తే, అధికారులు పార‌ద‌ర్శ‌కంగా ప‌ని చేస్తున్నార‌ని అర్థం చేసుకోవ‌చ్చ‌ని అన్న‌ట్టు తెలిసింది. కానీ అక్క‌సుతో నాలుగు కేంద్రాల‌పై దాడి చేయ‌డం ఏంట‌ని నిలదీసిన‌ట్టు స‌మాచారం. కేవ‌లం కిలో చికెన్‌పై రూ.10 ఇవ్వ‌లేద‌ని ఇలా చేయ‌డం స‌దరు మ‌హిళా ప్ర‌తినిధికి న్యాయ‌మా? అనే ప్రశ్న ఎదుర‌వుతోంది.

4 Replies to “కిలో చికెన్‌పై రూ.10 ఇవ్వ‌లేద‌ని.. అధికారుల‌తో దాడి!”

  1. కీలో కి 10 ఒక్కో షాప్ కి 50 అనుకుంటే 500 నాలుగు షాప్ లకి 2000 నెలకి తక్కువలో తక్కువ 60000 మరి కేవలం అంటె ఏలా GA గారు.

Comments are closed.