అవినీతి చెత్త‌ను ఊడ్చే చీపురు ప‌ట్టండి సార్లూ!

పారిశుధ్య కార్మికులు చేయాల్సిన ప‌నిని, తాము చేస్తామ‌ని సీఎం, మంత్రి చీపుర్లు ప‌ట్ట‌డం వ‌ల్ల ప్ర‌యోజ‌నం లేదు.

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు మార్క్ ప‌రిపాల‌న‌ను ప్ర‌తిబింబించేలా స్వ‌ర్ణాంధ్ర‌-స్వ‌చ్ఛాంద్ర కార్య‌క్ర‌మం వుంది. వీధుల్లో చెత్త‌ను ఊడ్చ‌డం మంచిదే. మ‌న ప‌రిస‌రాల‌ను ప‌రిశుభ్రంగా వుంచుకుంటేనే, ఆరోగ్యంగా ఉంటామ‌నే సందేశాన్ని పంప‌డం స‌రైందే. అయితే స‌మాజాన్ని ప‌ట్టి పీడుస్తున్న అవినీతి చెత్త‌ను ఊడ్చ‌డానికి చీపురు ప‌ట్టాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంది.

త‌ణుకు ఎన్టీఆర్ పార్కులో సీఎం చంద్ర‌బాబు, మంగ‌ళ‌గిరి ఎకో పార్కులో మంత్రి లోకేశ్ చీపుర్లు ప‌ట్టి చెత్త‌ను ఏరివేసే కార్య‌క్ర‌మంలో నిమ‌గ్న‌మైన ఫొటోలు ద‌ర్శ‌న‌మిచ్చాయి. అయితే వీధుల్ని ప‌రిశుభ్రం చేయ‌డానికి త‌గినంత మంది పారిశుధ్య కార్మికుల‌ను నియ‌మిస్తే స‌రిపోతుంది. వాళ్ల‌కు ఉపాధి క‌ల్పించిన‌ట్టు అవుతుంది. పారిశుధ్య కార్మికుల ప‌నులపై స‌రైన ప‌ర్య‌వేక్ష‌ణ వుంటే, వీధుల్ని ప‌రిశుభ్రంగా ఉంచ‌డం పెద్ద ప‌నేమీ కాదు. ఆ ప‌నిని సీఎం, మంత్రి చేయ‌డం… కేవ‌లం ప్ర‌చారం కోసం మిన‌హాయిస్తే, దేనికీ ప‌నికి రావు.

సీఎం చంద్ర‌బాబు, అలాగే ప్ర‌భుత్వంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించే మంత్రి నారా లోకేశ్ దృష్టి పెట్టాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. కూట‌మి ప్ర‌జాప్ర‌తినిధులు ఊళ్ల‌పై ప‌డి ఇష్టానుసారం దోపిడీకి పాల్ప‌డుతున్నార‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. అంతెందుకు, సీనియ‌ర్ ఐఏఎస్ అధికారుల భార్య‌లే, స్టార్ హోట‌ళ్ల‌లో మ‌కాం వేసి, అధికారాన్ని అడ్డం పెట్టుకుని వ్యాపారం చేసుకుంటున్నారు. అలాగే కూట‌మి ప్ర‌జాప్ర‌తినిధులు చికెన్ సెంట‌ర్లు మొద‌లుకుని, దేన్నీ వ‌దిలిపెట్ట‌డం లేదు. కాదేదీ దోపిడీకి అన‌ర్హ‌మ‌ని భావించి, అధికార అండ‌తో విచ్చ‌ల‌విడిగా దోపీడీకి పాల్ప‌డుతున్నారు.

రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారులు వెంచ‌ర్లు వేయాలంటే, అధికార పార్టీ ప్ర‌జాప్ర‌తినిధుల‌కు క‌ప్పం క‌ట్టాల‌నే భ‌యం. అలాగే ఇసుక‌, ఎర్ర‌మ‌ట్టిని ఇష్టానుసారం త‌ర‌లిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఫైబ‌ర్‌నెట్‌లో దోపిడీపై ఆ సంస్థ చైర్మ‌న్ జీవీరెడ్డి మీడియా స‌మావేశం పెట్టి మ‌రీ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. అలాగే ప్ర‌భుత్వానికి ఆధారాలు కూడా స‌మ‌ర్పించారు. ప్ర‌భుత్వం ఇలాంటి వాటిపైనే దృష్టి పెడితే ప్ర‌జ‌ల‌కు ప్ర‌యోజ‌నం.

పారిశుధ్య కార్మికులు చేయాల్సిన ప‌నిని, తాము చేస్తామ‌ని సీఎం, మంత్రి చీపుర్లు ప‌ట్ట‌డం వ‌ల్ల ప్ర‌యోజ‌నం లేదు. ఇలాంటి ఛీప్ ట్రిక్స్ ప‌బ్లిసిటీకి స్వ‌స్తి చెబితే మంచిది. ప్ర‌భుత్వ కార్యాల‌యాల్లోనూ, అలాగే కూట‌మి ప్ర‌జాప్ర‌తినిధుల అవినీతి చెత్త‌ను ఊడ్చేందుకు సీఎం చంద్ర‌బాబు, మంత్రి లోకేశ్ ముందుకొస్తే బాగుంటుంది.

11 Replies to “అవినీతి చెత్త‌ను ఊడ్చే చీపురు ప‌ట్టండి సార్లూ!”

  1. అయ్యొ…43000 కోట్ల అవినీతి చేసాడు అనే కదా జగన్ కేసులో ఇంప్లీడ్ అయితే అదిగో కక్షసాధింపు అని ఏడుస్తూ, మళ్ళీ ఇప్పుడు ఇలా వాగుతున్నావ్

  2. సార్లు కాదు సార్… మొన్న ఎలక్షన్లో జనాలందరూ పట్టుకున్నారుగా చీపుర్లు.. చాలా బాగా శుభ్రం చేశారు.. ఆ చీపుర్లు ఇంక వదలరులే .. జీవితాంతం ఫ్యాన్ కి పట్టిన దుమ్ముని వదల గొడుతూనే ఉంటారు

      1. నిజంగా తుప్పు పడితే నెక్స్ట్ ఎలక్షన్స్ లో జనాలు తప్పకుండా తుప్పు వదలగొడతారు .. నో టెన్షన్

  3. ఏమైనా భయ్యా, పిల్లలకి ఇచ్చే కోడిగుడ్డు మీద, సులబ్ కాంప్లెక్స్ ల ముందు అనీయ మూసి మూసి నవ్వుల బొమ్మ లు మాత్రం హైలైట్!! వాటిని ఇవేమీ బీట్ చేయలేవు.

Comments are closed.