జైలుకైనా పోతాం.. జ‌గ‌న్‌ను వీడేది లేదు!

కూట‌మి పాల‌న‌పై మాజీ మంత్రి, వైసీపీ సీనియ‌ర్ నేత పేర్ని నాని విరుచుకుప‌డ్డారు.

కూట‌మి పాల‌న‌పై మాజీ మంత్రి, వైసీపీ సీనియ‌ర్ నేత పేర్ని నాని విరుచుకుప‌డ్డారు. రేష‌న్ బియ్యం మిస్సింగ్‌పై ఎలాగైనా పేర్ని కుటుంబ స‌భ్యుల్ని జైలుకు పంపాల‌ని కూట‌మి స‌ర్కార్ ప‌ట్టుద‌ల‌తో వుంది. తాజాగా నాని భార్య పేర్ని జ‌య‌సుధ‌కు ద‌క్కిన బెయిల్‌ను ర‌ద్దు చేయాల‌ని కోరుతూ ప్ర‌భుత్వం హైకోర్టును ఆశ్ర‌యించింది. ఈ నేప‌థ్యంలో పేర్ని మీడియాతో మాట్లాడుతూ ఘాటు విమ‌ర్శ‌లు చేశారు.

త‌న‌ను, త‌న భార్య జ‌య‌సుధ‌, కుమారుడు కిట్టును ప్ర‌భుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎదుర్కొంటామ‌ని తేల్చి చెప్పారు. చివ‌రికి జైలుకు పోవ‌డానికైనా సిద్ధ‌మ‌న్నారు. అంతేగానీ, వైఎస్ జ‌గ‌న్‌ను, వైసీపీని ఎట్టి ప‌రిస్థితుల్లోనూ వీడే ప్ర‌శ్నే లేద‌ని నాని స్ప‌ష్టం చేశారు. కూట‌మి త‌ప్పుల్ని ఎండ‌గ‌డుతూనే వుంటామ‌ని ఆయ‌న హెచ్చ‌రించారు.

వ్య‌వ‌స్థ‌ల్ని రాజ‌కీయ వేధింపుల‌కు కూట‌మి ప్ర‌భుత్వం వాడుకుంటోంద‌ని ఆయ‌న విమ‌ర్శించారు. రేష‌న్‌బియ్యం విష‌యంలో ప్ర‌భుత్వానికి జ‌రిగిన న‌ష్టం కంటే రెట్టింపు సొమ్మును చెల్లించిన‌ట్టు ఆయ‌న చెప్పారు. త‌మ కుటుంబం ఏ పాపం చేయ‌లేద‌ని కృష్ణా జిల్లా పోలీసుల‌కు తెలుస‌న్నారు. అయిన‌ప్ప‌టికీ త‌న భార్య జ‌య‌సుధ‌పై ఏడేళ్ల‌కు పైబ‌డిన శిక్ష ప‌డేలా సెక్ష‌న్లు నమోదు చేసి, అరెస్ట్ చేయాల‌ని చూశార‌ని విమ‌ర్శించారు. అయితే ఆ సెక్ష‌న్లు త‌న భార్య‌కు వ‌ర్తించ‌వ‌నే కార‌ణంతో జిల్లా కోర్టు ముంద‌స్తు బెయిల్ ఇచ్చింద‌న్నారు. ఇప్పుడు మ‌ళ్లీ పోలీసులు హైకోర్టుకు వెళ్లార‌ని ఆయ‌న త‌ప్పు ప‌ట్టారు.

ఇంత వ‌ర‌కూ త‌మ కుటుంబంపై మిన‌హాయిస్తే పౌర‌స‌ర‌ఫ‌రాల‌శాఖ ఎవ‌రిపైనా క్రిమిన‌ల్ కేసులు న‌మోదు చేయ‌లేద‌న్నారు. స్వ‌యంగా పౌర‌స‌ర‌ఫ‌రాల‌శాఖ మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్ 22 వేల ట‌న్నుల బియ్యం పెట్టుకున్నా కేసు లేద‌న్నారు. వాళ్ల‌పై కేవ‌లం 6ఎ కేసు న‌మోదు చేశార‌న్నారు. సీజ్ ద షిప్, సీజ్ ద గోడౌన్ అన్నా క్రిమిన‌ల్ కేసులు లేవ‌ని ఆయ‌న అన్నారు.

12 Replies to “జైలుకైనా పోతాం.. జ‌గ‌న్‌ను వీడేది లేదు!”

  1. నువ్వొక “పోర్న్ సీడీ”.. నీ కొడుకొక “పోర్న్ రీల్”..

    నీలాంటి “పోర్న్ సీడీ” లు వైసీపీ లోనే ఉండాలి..

    అసలే వైసీపీ లో అందగాళ్ళ సంఖ్య తగ్గిపోతోంది.. నీలాంటి అందగాడిని జగన్ రెడ్డి కూడా వదులుకోడు ..

    వైసీపీ లోనే ఉండు.. మాకు కూడా అదే కావాలి..

    1. దాని అర్ధం అదేగా.. ఎట్టి పరిస్థితులలోను జగన్ ని వదలను అంటే, జగన్ తో కలిసి జైలు వెళ్ళటమే. అందరం జైలుకే అని మానసికముగా సిద్ధం అయ్యారు.

  2. తుక్కు అయిపోయిన సామాను చేరేది ఉండేది స్క్రాప్ యార్డ్ లోనే ..

Comments are closed.