సింపతీ ఆశిస్తే ట్రోలింగ్ మొదలైంది

అనుకున్నదొక్కటి అయినదొక్కటి అంటే ఇదేనేమో. పాయల్ రాజ్ పుత్ కు ఏదో అయింది,

అనుకున్నదొక్కటి అయినదొక్కటి అంటే ఇదేనేమో. పాయల్ రాజ్ పుత్ కు ఏదో అయింది, ఆమెకు రావాల్సిన ఛాన్స్ ను ఇంకెవరో ఎగరేసుకుపోయారు. దీంతో ఆమె హర్ట్ అయింది. వెంటనే ట్విట్టర్ ఓపెన్ చేసి, ఆవేశంగా 2 పోస్టులు పెట్టింది.

ఇండస్ట్రీలో కొనసాగడం చాలా కఠినంగా మారిపోయిందని, ఏదో తెలియని భయంతో రోజు మొదలవుతోందని, పడే కష్టానికి తగిన ఫలితం, టాలెంట్ కు తగ్గ అవకాశాలు రావేమో అనే భయం వెంటాడుతోందంటూ పోస్టు పెట్టింది.

అక్కడితో ఆగితే సరిపోయేది, ఇండస్ట్రీలో నెపొటిజం రాజ్యమేలుతోందని, నిజమైన టాలెంట్ నెపొజిజం వల్ల కనుమరుగైపోతోందని తన ఆవేదన బయటపెట్టింది. ఇక్కడే పాయల్ పై కామెంట్స్ మొదలయ్యాయి.

హీరోల్లో నెపొటిజం అంటే ఓకే, హీరోయిన్లలో నెపోటిజం ఎక్కడుందని చాలామంది ఆమెను ప్రశ్నిస్తున్నారు. సరైన కథలు, బ్యానర్లు ఎంచుకోక, కెరీర్ ను పాడుచేసుకొని, ఇప్పుడు నెపోటిజం అంటూ బీద అరుపులు అరుస్తున్నావంటూ మరికొందరు విమర్శించారు.

ఆర్ఎక్స్ 100 రూపంలో ఏ హీరోయిన్ కు దొరకనంత మంచి లాంఛింగ్ పాయల్ కు దొరికిందని, కానీ ఆ తర్వాత చెత్త స్క్రిప్టులు ఎంచుకొని, తన క్రేజ్ ను తానే నాశనం చేసుకుందని మరికొందరు బాధపడ్డారు.

ప్రారంభంలోనే పాయల్ కు హాట్ ఇమేజ్ వచ్చేసిందని, దీంతో ఫ్యామిలీ ఆడియన్స్ కు ఆమె దూరమైందని మరికొందరు అభిప్రాయపడ్డారు. మొత్తానికి సింపతీ కోసం పాయల్ పోస్టుపెడితే, అది ఆమెకు రివర్స్ అయింది.

2 Replies to “సింపతీ ఆశిస్తే ట్రోలింగ్ మొదలైంది”

  1. లైఫ్ లో.అందర్రు సమానంగా సక్సెస్ అవ్వర్ .మనం ఓటమి నీ హుందా గా తీసుకోవాలి . నెపోటిజం అందరికీ ఉంటుంది . నీ పిల్లలు delhi public school lo చదువుతారు mee watchman పిల్లలు ఎక్కడ చదువుతారు. మనం ఏమి చెయ్య లేము

Comments are closed.