సమంత రెమ్యూనిరేషన్ @ 3 కోట్లు!

సినిమా ఇండస్ట్రీ, అందులోనూ టాలీవుడ్ మరీ ఫుల్ స్వింగ్ లో వుంది. దాంతో టాప్ హీరో, హీరోయిన్ల రెమ్యూనిరేషన్లు పెరుగుతున్నాయి. ఒకప్పుడు తెలుగు సినిమాల్లో హీరోయిన్ కు కోటి రూపాయలు రెమ్యూనిరేషన్ అంటే చాలా…

సినిమా ఇండస్ట్రీ, అందులోనూ టాలీవుడ్ మరీ ఫుల్ స్వింగ్ లో వుంది. దాంతో టాప్ హీరో, హీరోయిన్ల రెమ్యూనిరేషన్లు పెరుగుతున్నాయి. ఒకప్పుడు తెలుగు సినిమాల్లో హీరోయిన్ కు కోటి రూపాయలు రెమ్యూనిరేషన్ అంటే చాలా ఎక్కువ. 

నయనతార నాలుగు అయిదు కోట్లు డిమాండ్ చేస్తుంది అంటే అమ్మో..అనేవారు. ఇప్పుడు పూఙా హెగ్డే మూడున్నర కోట్లు రెమ్యూనిరేషన్ తీసుకుంటోందని టాక్. రష్మిక కూడా తన రెమ్యూనిరేషన్ ను మూడు కోట్లకు చేర్చబోతోందని టాక్.

ఇలాంటి బ్యాక్ డ్రాప్ లో సమంత కూడా మూడు కోట్లు డిమాండ్ చేస్తోందని టాక్ వినిపిస్తోంది. యశోద అనే థ్రిల్లర్ కేవలం సమంత కీలకపాత్రలో తయారవుతోంది. ఈ సినిమా బడ్ఙెట్ 30 కోట్లు. శాకుంతల సినిమా కూడా సమంత కీలకపాత్రలో తయారవుతోంది. దాని బడ్ఙెట్ ఇంకా చాలా ఎక్కువ. ఇలాంటి నేపథ్యంలో సమంత మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

మైత్రీ మూవీస్ నిర్మించే శివనిర్వాణ డైరక్షన్ లో విజ‌య్ దేవరకొండ సరసన నటించడానికి సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ పాన్ ఇండియా సినిమాలో నటించేందకు సమంతకు మూడు కోట్ల రెమ్యూనిరేషన్ ఇస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. 

పుష్ప సినిమాను ఇదే బ్యానర్ నిర్మించింది. ఆ సినిమాలో ఒక్క పాట కోసం కోటిన్నర ఇచ్చారని అప్పట్లోనే వార్తలు వచ్చాయి. అందువల్ల దాంతో పోల్చుకుంటే ఫుల్ మూవీ కి మూడు కోట్లు రీఙనబుల్ నే అనుకోవాలి.