నేను విశ్వాస ఘాతకుడినే…కానీః వంశీ

గ‌త మూడు నాలుగు రోజులుగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాలు వేడెక్కాయి. టీడీపీ అధికార ప్ర‌తినిధి ప‌ట్టాభి నోటి దురుసు… తీవ్ర రాజ‌కీయ ప్ర‌కంప‌న‌లు సృష్టించింది. దీంతో అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీలు ప‌ర‌స్ప‌రం ప్ర‌త్య‌ర్థులుగా కాకుండా శ‌త్ర‌వులుగా…

గ‌త మూడు నాలుగు రోజులుగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాలు వేడెక్కాయి. టీడీపీ అధికార ప్ర‌తినిధి ప‌ట్టాభి నోటి దురుసు… తీవ్ర రాజ‌కీయ ప్ర‌కంప‌న‌లు సృష్టించింది. దీంతో అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీలు ప‌ర‌స్ప‌రం ప్ర‌త్య‌ర్థులుగా కాకుండా శ‌త్ర‌వులుగా మారిపోయి తీవ్ర‌స్థాయిలో తిట్టుకుంటున్నారు. రాజ‌కీయ నాయ‌కుల దూష‌ణ‌లు హ‌ద్దులు దాటాయి.

ఈ నేప‌థ్యంలో టీడీపీ తిరుగుబాటు ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ రాజీనామా లేఖ‌తో స‌వాల్ విసిరారు. ప్ర‌ధానంగా త‌న‌ను విమ‌ర్శించిన ప‌రిటాల సునీత గ‌న్న‌వ‌రం వ‌చ్చి, శ్రీ‌కృష్ణ సార‌థ్యం లేక శ‌ల్య సార‌థ్యం వ‌హిస్తారో తేల్చుకోవాల‌ని కోరారు. అనంత‌రం తీవ్ర అభ్యంత‌ర‌క‌ర స్థాయిలో చంద్ర‌బాబు, లోకేశ్‌ల‌పై వంశీ విమ‌ర్శ‌లు చేశారు. ఈ నేప‌థ్యంలో మ‌రోసారి ట్విట‌ర్ వేదిక‌గా చంద్ర‌బాబుపై ఘాటు వ్యాఖ్య‌లు చేశారాయ‌న‌.

‘చంద్రబాబూ.. నేను విశ్వాస ఘాతకుడినే.. అదీ నీ ఒక్కడికి మాత్రమే. కానీ నువ్వు.. ఇందిరాగాంధీకి, ఎన్టీఆర్‌, హరికృష్ణ, దగ్గుపాటి, పెద్దలు మోదీ, అమిత్‌ షాకు నమ్మకద్రోహివి’ అంటూ వల్లభనేని వంశీ ట్వీట్‌ చేశారు. ‘వెన్నుపోట్లకు, నమ్మక ద్రోహాలకు, విశ్వాస ఘాతుకాలకు నిఖార్సైన పేటెంట్‌ దారుడివి..నువ్వే చంద్రబాబు’ అంటూ  వంశీ ట్వీట్ చేశారు.

‘చంద్రబాబూ.. నేను కేసీఆర్‌కు పొర్లుదండాలు పెడుతున్నానన్నావు.. నిజమే.. మరి నువ్వు?  కేసీఆర్‌ ముందు మోకాలిదండేసి  ‘మోర’ ఎత్తి పని చేస్తున్నావుగా.. ఓటుకు నోటు కేసు తేలే వరకు అంతేగా..’ అంటూ వంశీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మాట‌కు తూటా పేల్చ‌డంలో వంశీ దిట్ట‌. ఆ విష‌యం తెలిసి కూడా… అన‌వ‌స‌రంగా వంశీపై నోరు చేసుకుని, నానా తిట్లు తినాల్సి వ‌చ్చింది. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వంశీ ట్వీట్లు వైర‌ల్ అవుతున్నాయి.