కీర్తి సురేష్‌కి అంత సత్తా వుందా?

నటిగా కీర్తి సురేష్‌ సామర్ధ్యం ఏమిటనేది 'మహానటి'తో రుజువయింది. ఆ చిత్రంతో ఉత్తమ నటిగా జాతీయ పురస్కారం అందుకున్న కీర్తి సురేష్‌ ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్‌ కథలనే ఎంచుకుంటోంది. అయితే నటనకి, బాక్సాఫీస్‌ పర్‌ఫార్మెన్స్‌కి…

నటిగా కీర్తి సురేష్‌ సామర్ధ్యం ఏమిటనేది 'మహానటి'తో రుజువయింది. ఆ చిత్రంతో ఉత్తమ నటిగా జాతీయ పురస్కారం అందుకున్న కీర్తి సురేష్‌ ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్‌ కథలనే ఎంచుకుంటోంది. అయితే నటనకి, బాక్సాఫీస్‌ పర్‌ఫార్మెన్స్‌కి సంబంధం లేదనేది అందరికీ తెలిసిన విషయమే. కీర్తి సురేష్‌ సోలోగా తన సినిమాకోసం ప్రేక్షకులు క్యూ కట్టేలా చేయగలదా లేదా అనేది తేలాల్సి వుంది.

మహానటి చిత్రానికి సావిత్రి జీవిత కథ అనే ఫ్యాక్టర్‌కి తోడు చాలా అంశాలు కలిసి వచ్చాయి. అదే విధమైన క్రేజ్‌ ఇప్పుడు ఆమె నటిస్తోన్న 'మిస్‌ ఇండియా'కి గానీ, నగేష్‌ కుకునూర్‌ చిత్రానికి గానీ తీసుకురావడం కష్టం. అయినా కానీ కీర్తి సురేష్‌ కోసం నాలుగు రాష్ట్రాల ప్రేక్షకులు వచ్చేస్తారని నిర్మాతలు భావిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కేరళలో వున్న పాపులారిటీ వల్ల కీర్తి సురేష్‌ సినిమాలు సేఫ్‌ అవుతాయని అనుకుంటున్నారు.

అనుష్క, నయనతార, సమంత మాదిరిగా తన పేరు మీదే ప్రేక్షకులని థియేటర్లకి రాబట్టే సత్తా కీర్తి సురేష్‌కి వుందా? ఇక్కడ చెప్పిన హీరోయిన్లకి తగ్గట్టుగా ఆమెకి స్వీయానుభవం, ప్రేక్షకులలో అభిమానం వున్నాయా? ఇలాంటి ప్రశ్నలన్నిటికీ ఆమె రాబోయే చిత్రాలే సమాధానమివ్వాలి. 

సినిమా రివ్యూ: రాజుగారి గది 3