పెళ్లి తర్వాత ప్రతి రోజూ పండగే – కాజల్

పెళ్లి తర్వాత తనకు ప్రతి రోజూ పండగలా ఉందంటోంది కాజల్. మరీ ముఖ్యంగా పెళ్లి తర్వాత వస్తున్న పండగల్ని ప్రత్యేకంగా భర్తతో సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని, జీవితాంతం ఈ వేడుకలు గుర్తుండిపోతాయని…

పెళ్లి తర్వాత తనకు ప్రతి రోజూ పండగలా ఉందంటోంది కాజల్. మరీ ముఖ్యంగా పెళ్లి తర్వాత వస్తున్న పండగల్ని ప్రత్యేకంగా భర్తతో సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని, జీవితాంతం ఈ వేడుకలు గుర్తుండిపోతాయని చెబుతోంది.

“ప్రతి పండగ ప్రత్యేకమే. మరీ ముఖ్యంగా పెళ్లి తర్వాత ఆ పండగొస్తే మరింత ప్రత్యేకం. నేను, గౌతమ్ కలిసి ప్రతి పండగను సెలబ్రేట్ చేసుకోవడం చాలా సరదాగా ఉంది. మాతో పాటు కొంతమంది స్నేహితులు కూడా మాతో జాయిన్ అవుతున్నారు. ప్రస్తుతం పరిస్థితుల్లో మేమేంతా టెస్టులు (కరోనా) చేసుకున్న తర్వాతే సెలబ్రేట్ చేసుకుంటున్నాం.”

ఈరోజు తన భర్త గౌతమ్ తో కలిసి హోలీని సెలబ్రేట్ చేసుకుంది కాజల్. సెకెండ్ వేవ్ నేపథ్యంలో స్నేహితులెవ్వర్నీ ఇంటికి ఆహ్వానించలేదని, పూర్తిగా కుటుంబ సభ్యుల మధ్య రంగుల వేడుకను సెలబ్రేట్ చేసుకున్నామని తెలిపింది.

“ఏ ఏడాది హోలీ పండగ చాలా సైలెంట్ గా జరుగుతోంది. మా కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లోనే పూజలు, భోజనాలు చేస్తున్నాం. హోలీ రోజు కచోరీలు తినడం నాకిష్టం. ఆర్గానిక్ రంగులు పూసుకుంటున్నాం. ఈసారి గౌతమ్ కూడా యాడ్ అయ్యాడు.”

ప్రతి ఏటా హోలీ రోజు ఎంజాయ్ చేసే రెయిన్ డాన్స్ ను మాత్రం ఈ ఏడాది మిస్సయ్యానని అంటోంది కాజల్. కరోనా పరిస్థితులు వీలైనంత తొందరగా సమసిపోవాలని కోరుకుంది.