ఆది-అతిథిదేవోభవ

ఆది సాయి కుమార్ కెరీర్ రైట్ ట్రాక్ లో పడినట్లు కనిపిస్తోంది. వరుసపెట్టి సినిమాలు ఒప్పుకుంటున్నాడు. సెట్ మీద వున్నాయి.  Advertisement లేటెస్ట్ గా మరో సినిమాకు శ్రీకారం చుట్టారు. శ్రీనివాస సినీ క్రియేషన్స్…

ఆది సాయి కుమార్ కెరీర్ రైట్ ట్రాక్ లో పడినట్లు కనిపిస్తోంది. వరుసపెట్టి సినిమాలు ఒప్పుకుంటున్నాడు. సెట్ మీద వున్నాయి. 

లేటెస్ట్ గా మరో సినిమాకు శ్రీకారం చుట్టారు. శ్రీనివాస సినీ క్రియేషన్స్ అనే కొత్త సంస్థ నిర్మించే ఈ సినిమాకు 'అతిథి దేవో భవ' అనే టైటిల్ ఫిక్స్ చేసారు. పొలిమేర నాగేశ్వరరావు దీనికి దర్శకుడు. 

హీరో అద్దంలోకి పరుగెడుతున్నట్లు ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ పోస్టర్ ను ఫస్ట్ లుక్ గా విడుదల చేసారు. పైగా ఆ అద్దంలోనే హీరోను, హీరోయిన్ నువేక్ష ను ప్రేమికులుగా చూపించారు.  

రాజబాబు మిరియాల, అశోక్ రెడ్డి మిరియాల ఈ సినిమా నిర్మాతలు. రామ సత్యనారాయణ రెడ్డి సమర్పకుడు. కే వేణుగోపాల రెడ్డి కథ అందించారు. శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నారు.