బీజేపీ మీద ఎర్రన్న నిప్పులు

బీజేపీ అంటేనే వామపక్షాలకు పడదు, వీరిది కుడి అయితే వారిది ఎడమ. ఇక దేశంలో బీజేపీ రాజ్యం సాగుతోంది. దాంతో పాటు కేంద్రం వరసబెట్టి చేస్తున్న తప్పులు కూడా ఎర్రన్నలకు ఆగ్రహం తెప్పిస్తున్నాయి.  Advertisement…

బీజేపీ అంటేనే వామపక్షాలకు పడదు, వీరిది కుడి అయితే వారిది ఎడమ. ఇక దేశంలో బీజేపీ రాజ్యం సాగుతోంది. దాంతో పాటు కేంద్రం వరసబెట్టి చేస్తున్న తప్పులు కూడా ఎర్రన్నలకు ఆగ్రహం తెప్పిస్తున్నాయి. 

ఈ దేశాన్ని ఏం చేయదలచుకున్నారంటూ సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి బీజేపీని నిలదీశారు. ఈ దేశాన్ని పూర్తిగా ఆరెస్సెస్ భావజాలంతో నింపేయాలనుకుంటున్నారని ఆయన మండిపడ్డారు.

దాదాపుగా 130 కోట్ల పై చిలుకు జనాభా ఉన్న ఈ దేశంలో అనేక మతాలు, సంప్రదాయాలు, సంసృతులు ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. కానీ బీజేపీ మాత్రం హిందూత్వ అజెండాను అమలు చేయడానికే ఉబలాటపడుతోందని ఆయన నిప్పులు చెరిగారు. పోనీ అదే నిజ‌మనుకున్నా హిందువులకు బీజేపీ ప్రత్యేకంగా ఒరగబెట్టిందేంటి అని కూడా ఆయన నిలదీశారు.

బంగారం లాంటి విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేసి తెగనమ్మాలనుకుంటున్నారు అని ఆయన నిందించారు. స్టీల్ ప్లాంట్ లో నూటికి 99 శాతం మంది హిందువులే పనిచేస్తున్నారని, మరి వారి పొట్టకొట్టడమేనా హిందూత్వం అంటే సత్యనారాయణమూర్తి లాజిక్ పాయింటే లాగారు. 

బీజేపీ దేశాన్ని మతం పేరిట విభజించి ఓట్ల రాజకీయం చేస్తోంది తప్ప ఎవరికీ ఉద్ధరించడంలేదని కూడా ఆయన తేల్చేసారు. మొత్తానికి బీజేపీ హిందూత్వ విధానాలకు  రెడ్ సిగ్నల్ చూపించాల్సిందేనని కామ్రెడ్ అంటున్నారు.