cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Gossip

హాట్ టాపిక్.. ఏపీలో ముందస్తు ఎన్నికలు?

హాట్ టాపిక్.. ఏపీలో ముందస్తు ఎన్నికలు?

మొన్నటివరకు చంద్రబాబు జమిలి, జమిలి అంటూ ఎగిరెగిరి పడ్డారు. త్వరలోనే ఎన్నికలు వస్తాయంటూ టీడీపీ శ్రేణుల్ని మభ్యపెడుతూ వచ్చారు. బాబు అనుకున్నది నిజంగానే జరిగేలా ఉంది. కాకపోతే అది జమిలి కాదు, ఆంధ్రప్రదేశ్ లో ముందస్తు ఎన్నికలు. అవును.. రాజకీయ వర్గాల్లో ఇప్పుడిదే హాట్ టాపిక్ నడుస్తోంది.

ఇప్పటికిప్పుడు ముందస్తు ఎందుకు?

తమ పాలనపై ప్రజాతీర్పు కోసం ముఖ్యమంత్రులు ఇలా ముందస్తు ఎన్నికలకు వెళ్తుంటారు. తెలంగాణలో కేసీఆర్ 2018లో అదే చేశారు. పైగా విపక్షాల విమర్శల్ని తిప్పికొట్టాలంటే ఇంతకుమించిన రెడీమేడ్ అస్త్రం మరోటి లేదు. అందుకే జగన్ ముందస్తు ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. 

మరో ఏడాది పాలన ఉండగానే ప్రభుత్వాన్ని రద్దుచేసి ముందస్తుకు వెళ్లే అవకాశాలున్నాయని స్వయంగా వైసీపీలోనే కొంతమంది నేతలు గుసగుసలాడుకుంటున్నారు.

ఒకే దెబ్బకు రెండు పిట్టలు

ముందస్తుకు వెళ్తే జగన్ కే ఎన్నో లాభాలు. మరోసారి ప్రజామోదంతో ప్రభుత్వాన్ని స్థాపించినట్టవుతుంది. అదే సమయంలో ప్రతిపక్షం ఆగడాల్ని, చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టినట్టవుతుంది. ప్రస్తుతం ఏపీ ఆర్థికంగా దిగజారిపోయిందని, రాష్ట్రంలో ఆర్థిక ఎమర్జెన్సీ విధించే పరిస్థితులు వస్తాయని టీడీపీ, టీడీపీ అనుకూల మీడియా ఏదేదో చెబుతోంది. దీనికి చెక్ పెట్టాలంటే ముందస్తుకు వెళ్లడమే కరెక్ట్. 

మరోవైపు తన సంక్షేమ పథకాల అమలుకు గీటురాయిగా ముందస్తును చెప్పుకోవచ్చు. ఇప్పటికే హామీ ఇచ్చిన పథకాల్లో దాదాపు 80శాతం అమల్లోకి వచ్చాయి కాబట్టి జగన్, తనకుతాను పెట్టుకునే పరీక్ష అవ్వొచ్చు.

బీజేపీతో పొత్తు సమస్యే లేదు..

ఒకేసారి ఇటు అసెంబ్లీకి, అటు పార్లమెంట్ కు ఎన్నికలు జరిగితే పొత్తులు తెరపైకొస్తాయి. ముందుగా అసెంబ్లీకి ఎన్నికలు జరిగి, ముఖ్యమంత్రిగా జగన్ మరోసారి పీఠాన్ని ఎక్కితే.. తర్వాత జరిగే ఎంపీ ఎలక్షన్లలో పొత్తుల గురించి ఆలోచించుకోవచ్చు. ఇలా ముందస్తుకు వెళ్లడం వల్ల అనివార్యంగా బీజేపీతో పొత్తు పెట్టుకోవాలనే ఇబ్బంది జగన్ కు తప్పుతుంది.

అదే జరిగితే చంద్రబాబుకు మూడినట్టే!

జగన్ ముందస్తుకు వెళ్తే చంద్రబాబుకు చాలా కష్టం. ఇప్పటికే పార్టీ పరిస్థితి దారుణంగా తయారైంది. 23మందిలో నలుగురు చేజారారు, బుచ్చయ్య బోర్డర్ లో ఉన్నారు. ఆయన వెంట ఎంతమంది ఉన్నారో తెలియదు. అటు స్థానిక ఎన్నికల్లో ఘోర పరాభవాలతో.. స్థానిక నాయకత్వం కూడా పార్టీ నుంచి వెళ్లిపోయింది. 

గతంలో జమిలి జమిలి అంటూ ఎగిరిపడ్డ బాబుకి, లోకల్ బాడీ ఎలక్షన్లు, తిరుపతి ఉప ఎన్నికల్లో గట్టి ఎదురు దెబ్బలు తగిలే సరికి తత్వం బోధపడింది. జగన్ తనకు తాను ఏదైనా తప్పు చేసి తిప్పలు కొని తెచ్చుకోవాల్సిందే కానీ, టీడీపీ ఇప్పుడు చేయగలిగిందేమీ లేదని తేలిపోయింది. అందుకే బాబు చూస్తూ ఊరుకున్నారు. జగన్ ముందస్తుకి సై అంటే మాత్రం బాబు కి బ్యాడ్ టైమ్ మళ్లీ మొదలైనట్టే.

ముందస్తు జగన్ కు అనుకూలమేనా?

ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా.. జగన్ కే పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నాయనేది అందరూ చెప్పేమాట. సంక్షేమ పథకాల లబ్ధిదారులు జగన్ పై పూర్తి నమ్మకంతో ఉన్నారు. కొత్తగా వచ్చిన సచివాలయాల ఉద్యోగులు, వారి కుటుంబాలకు జగన్ దైవంగా మారారు. 

దర్జీలు, డ్రైవర్లు, నేత కార్మికులు.. ఇలా అన్ని వర్గాలకు, పార్టీలకు అతీతంగా న్యాయం చేయడంతో.. అందరికీ జగన్ అంటే అభిమానం పెరిగింది. ఆ అభిమానమే స్థానిక ఎన్నికల్లో ప్రతిఫలించింది. ఎలా చూసుకున్నా ముందస్తు సంరంభం జగన్ కే అనుకూలంగా ఉంటుందనేమాట వాస్తవం.

లవ్ స్టొరీ లకు ఇక గుడ్ బై

వైఎస్సార్ కారు నడిపాను

 


×