లోకేష్ హడావుడి అందుకే: విజయసాయి రెడ్డి

పొద్దు ఎరగనట్టుగా వరసపెట్టి లోకేష్ బాబు ట్వీట్లు పెడుతుండటం వెనుక అసలు కథ వేరే ఉందని అంటున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వి.విజయసాయి రెడ్డి. మీడియా ముందుకో, ప్రజల ముందుకో వచ్చి మాట్లాడే…

పొద్దు ఎరగనట్టుగా వరసపెట్టి లోకేష్ బాబు ట్వీట్లు పెడుతుండటం వెనుక అసలు కథ వేరే ఉందని అంటున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వి.విజయసాయి రెడ్డి. మీడియా ముందుకో, ప్రజల ముందుకో వచ్చి మాట్లాడే చేవలేదని ఇప్పటికే నిరూపించుకున్న లోకేష్ పేరిట వరస పెట్టి ట్వీట్లు వేస్తూ ఉన్నారు. ఆ ట్వీట్లలో అవసరానికి మించిన ఎక్స్ ప్రెషన్లను వాడేస్తూ ఉన్నారు. బహుశా లోకేష్ ను మేధావిగా చూపించేందుకు అలాంటి పదజాలాన్ని వాడుతున్నట్టున్నారని పరిశీలకులు అంటున్నారు.

అయితే లోకేష్ కు ఆ ట్వీట్లలోని పదాలు పలకడం వచ్చు అంటే నమ్మడం కష్టం. స్వయంగా లోకేష్ ఆ ట్వీట్లను తప్పుల్లేకుండా యథాతథంగా చదవి వినిపిస్తే అప్పుడు ఆ ట్వీట్లను ఆయనే పెట్టారనే నమ్మకం అందరిలోనూ కలుగుతుంది. అయితే లోకేష్ అంత సాహసం చేయడంలేదు. అదలా ఉంటే లోకేష్ ట్వీట్ల వెనుక వేరే కథ ఉందని అంటున్నారు విజయసాయి రెడ్డి. లోకేష్ ను తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేయాలనే వ్యూహాన్ని అమలు పెడుతూ ఉన్నారని  విజయసాయి రెడ్డి అంటున్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

''లోకేశ్ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేయాలనేమో జాకీలు పెట్టి లేపుతున్నారు. తండ్రి సైగ చేసి ఉంటారు. కొత్త ప్రభుత్వం వచ్చి 5 వారాలే అయిందన్న సృహ కూడా లేకుండా ట్వీట్లతో నవ్వులు పూయిస్తున్నాడు. సీఎం కొడుకు, మంత్రి అయిఉండి మంగళగిరిలో ఓడినప్పుడే లోకేశ్ చెల్లనికాసు అయిపోయాడు.'' అంటూ విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు. మరి నిజంగానే లోకేష్ ను టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేయబోతున్నారా?  ఎమ్మెల్యేగా ప్రజల ఆమోదం పొందని ఆయనను ఆ హోదాను ఇవ్వబోతున్నారా!

ముద్దు ముద్దు మాటలతో దొరసాని.. ఏమి చెప్పిందంటే