కొత్త ఫీచర్ వ‌చ్చేసింది

ఆధార్ లేనిదే ఏదీ ముందుకు సాగ‌దు. ప్ర‌తిదీ ఆధార్‌తో ముడిప‌డి వుంది. ఆధార్ లేక‌పోతే మ‌నిషి స‌జీవంగా లేన‌ట్టే అనే స్థాయిలో వ్య‌వ‌హారం త‌యారైంది. దీంతో ఆధార్‌ను అడ్డు పెట్టుకుని కొంద‌రు అక్ర‌మాల‌కు తెర‌లేపారు. …

ఆధార్ లేనిదే ఏదీ ముందుకు సాగ‌దు. ప్ర‌తిదీ ఆధార్‌తో ముడిప‌డి వుంది. ఆధార్ లేక‌పోతే మ‌నిషి స‌జీవంగా లేన‌ట్టే అనే స్థాయిలో వ్య‌వ‌హారం త‌యారైంది. దీంతో ఆధార్‌ను అడ్డు పెట్టుకుని కొంద‌రు అక్ర‌మాల‌కు తెర‌లేపారు. 

ఏదో ర‌కంగా ఆధార్ నంబ‌ర్ తెలుసుకోవ‌డం, త‌మ‌కు కావాల్సిన‌ట్టు దుర్వినియోగం చేస్తున్న ఉదంతాలు అనేక వెలుగులోకి వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో ఆధార్‌పై కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క సూచ‌న‌లు చేసింది.

ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఆధార్ ఒరిజిన‌ల్ కాపీని ఎవ‌రికీ ఇవ్వొద్ద‌ని కేంద్ర ప్ర‌భుత్వం స్ప‌ష్ట‌మైన ఆదేశాలు ఇచ్చింది. ఆధార్‌ను అడ్డు పెట్టుకుని సాగిస్తున్న ఆగ‌డాల‌కు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్ర‌భుత్వం కొత్త ఫీచ‌ర్‌ను అందుబాటులోకి తెచ్చింది. దేశ ప్ర‌జ‌ల‌ సౌకర్యార్థం యుఐడిఏఐ(UIDAI) ఆన్‌లైన్‌లో మరో ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది.

ఎవరికైనా ఫొటోకాపీకి బదులుగా మాస్క్‌డ్‌ కాపీలను మాత్రమే చూపించాలని కేంద్రం స్ప‌ష్టం చేసింది. ఈ కార్డుపై 12 అంకెల ఆధార్‌ నంబర్‌ పూర్తిగా కనిపించదు. చివరి నాలుగు అంకెలు మాత్రమే కనిపిస్తాయి. దీనినే మాస్క్‌డ్ ఆధార్ కార్డ్ అని పిలుస్తారు.  ఆధార్‌లో మొదటి ఎనిమిది అంకెలు  *** గా కనిపిస్తాయి. ఒరిజినల్‌ కార్డుకు ర‌క్ష‌ణ‌గా మాస్క్‌డ్‌ ఆధార్‌ కార్డు నిలుస్తుంది. కేంద్ర ప్ర‌భుత్వ చ‌ర్య‌ల‌పై హ‌ర్షం వ్య‌క్త‌మ‌వుతోంది.