‘దేశా’భిమానుల కుంటి సాకు

ఆడలేని వాడు మద్దెల సరిగ్గా వాయించలేదు అన్నట్లు వుంది తెలుగుదేశం పార్టీ అభిమానుల వ్వవహారం. పవన్ కళ్యాణ్ జనసేన కారణంగానే తెలుగుదేశం ఓడిపోయిందట. పవన్ తో కలిసి వుంటేవేరుగా వుండేదట. పవన్ పార్టీకి ఇప్పుడు…

ఆడలేని వాడు మద్దెల సరిగ్గా వాయించలేదు అన్నట్లు వుంది తెలుగుదేశం పార్టీ అభిమానుల వ్వవహారం. పవన్ కళ్యాణ్ జనసేన కారణంగానే తెలుగుదేశం ఓడిపోయిందట. పవన్ తో కలిసి వుంటేవేరుగా వుండేదట. పవన్ పార్టీకి ఇప్పుడు వచ్చిన ఓట్లు అన్నీ తెలుగుదేశానికి జతపడేవట.

ఇదెక్కడి దిక్కుమాలిన లాజిక్కు? పవన్-దేశం కలిస్తే తెలుగుదేశం ఓట్లు పెరిగే అవకాశం వుంది అన్నమాట కొంతవరకు వాస్తవమే. కానీ ఇప్పుడు జనసేనకు వచ్చిన ఓట్లు అన్నీ గంపగుత్తగా తేదేపాకే వచ్చేసి వుండేవని అనుకోవడం మాత్రం కరెక్ట్ కాదు.

ఎందుకంటే పవన్ అంటే ఇష్టం వున్న ప్రతివారికీ తెలుగుదేశం ఇష్టం వుండొచ్చు, వుండకపోవచ్చు. అలాగే ఆ ఇద్దరి పొత్తు అందరికీ ఆమోదయోగ్యం కావచ్చు, కాకపోవచ్చు. అందువల్ల కచ్చితంగా పవన్ కు ఇప్పుడు వచ్చిన ఓట్లు చీలిపోతాయి. అదే సమయంలో పవన్ తో పొత్తు అన్నది తెలుగుదేశం అభిమానులకు కూడా అందరికీ ఇష్టం వుండాలని లేదు. కొంతమంది అసంతృప్తితో మరోవైపు మొగ్గచ్చు.

ముఖ్యంగా కమ్మసామాజికవర్గ పునాదులపై పుట్టిన తెలుగుదేశం, కాపు సామాజికవర్గ పునాదులపై ఆధారపడిన జనసేన కలిస్తే, కుల సమీకరణాల ఓట్లు కచ్చితంగా మారిపోతాయి. అందువల్ల ఓట్ల శాతం, ఒకటి ప్లస్ ఒకటి ఈజీక్వల్టూ రెండు అన్నట్లు వుండదు.

కేవలం ఓడిపోయాం అన్నదానికి సాకు వెదుక్కోవడానికి, కారణం చెప్పుకోవడానికి మాత్రం బాగుంటుంది. అంతే.

సినిమా రివ్యూ: సీత