ఇప్పటికే అక్షయ్ కుమార్ నటించిన ఓ సినిమా ఓటీటీలోకి వచ్చింది. దీంతో అతడు నటించిన మరో సినిమా కూడా ఓటీటీలోకి వస్తుందనే ప్రచారం సాగింది. అదే బెల్ బాటమ్. ఈ సినిమాతో పాటు తను నటించిన మరో సినిమాపై కూడా ఈ హీరో క్లారిటీ ఇచ్చాడు.
తన సినిమాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పిన అక్షయ్ కుమార్.. ప్రస్తుతానికైతే తన సినిమాల విడుదల తేదీలపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని.. త్వరలోనే ఆయా సినిమాల నిర్మాతలు ఓ నిర్ణయం తీసుకుంటారని స్పష్టంచేశాడు.
చాన్నాళ్లుగా సూర్యవంశి అనే ప్రాజెక్టు చేస్తున్నాడు అక్షయ్ కుమార్. గతేడాది మార్చిలో ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ లాక్ డౌన్ వల్ల కుదరలేదు. ఈ ఏడాది ఏప్రిల్ లో రిలీజ్ చేయాలనుకున్నారు. సెకెండ్ వేవ్ వల్ల కుదరలేదు. ఈ సినిమాను ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగస్ట్ 15న రిలీజ్ చేస్తారనే ప్రచారం జరిగింది. దీన్ని అక్షయ్ ఖండించాడు
అటు అక్షయ్ చేసిన మరో సినిమా బెల్ బాటమ్ నేరుగా ఓటీటీలోకి వస్తుందని, డిస్నీ హాట్ స్టార్ సంస్థ చర్చలు జరుపుతోందంటూ ప్రచారం జరిగింది. ఇందులో కూడా నిజం లేదని స్పష్టంచేసిన అక్షయ్.. సరైన టైమ్ లో నిర్మాతలు సరైన నిర్ణయం తీసుకుంటారని, అప్పుడు తనే ఆ విషయాన్ని అందరికీ చెబుతానని క్లారిటీ ఇచ్చాడు.