ముందుగా సల్మాన్ ఖాన్ చెల్లెలు అర్పితా ఖాన్ తో డేటింగ్ చేశాడట అర్జున్ కపూర్. అలా ఆమెతో పాటు వెళ్లి.. మలైకా ఆరోరాతో పరిచయం పెంచుకున్నాడట. అప్పటికి మలైకా అరోరా.. అర్బాజ్ ఖాన్ భార్య. అర్బాజ్ తో ఆమె కలిసి ఉన్నప్పుడే అర్జున్ కపూర్ తో వ్యవహారం మొదలుపెట్టిందట. అప్పట్లోనే వీరిద్దరి మధ్యన వ్యవహారం నడుస్తోందని గాసిప్స్ గుప్పుమన్నాయి.
అనంతరం.. అర్బాజ్, మలైకాలు విడిపోవడానికి నిర్ణయించుకుని కోర్టుకు ఎక్కారు. ఎలాంటి వాడు అయినా.. తనకు పెళ్లీ పెటాకులు లేకపోయినా.. తమ్ముడి కాపురం మాత్రం నిలబడాలని సల్మాన్ ఖన్ అనుకున్నాడట. విడిపోవద్దని వారిద్దరినీ బతిమాలాడు సల్మాన్. ప్రత్యేకించి మలైకాను కన్వీన్స్ చేసేందుకు సల్మాన్ తీవ్రంగా ప్రయత్నించాడట. కలిసి ఉండమని ఆప్యాయంగా చెప్పాడట.
అయితే మలైకా మాత్రం ససేమేర అన్నట్టుగా తెలుస్తోంది. మరి తమ్ముడి కాపురం అలా కూలిపోవడాకి కారణం అర్జున్ కపూర్ అనే కోపం మాత్రం సల్మాన్‌లో తీవ్ర స్థాయికి చేరినట్టుగా ఉంది. వాస్తవానికి బోనీ కపూర్ కు సల్మాన్ ఖాన్ చాలా సాయమే చేశాడు. బోనీ తీవ్రమైన ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయిన సమయంలో ‘నో ఎంట్రీ’ సినిమా చేసిపెట్టాడు సల్మాన్. ఫ్రీగా ఏం చేయకపోయినా.. ఆ సినిమాతోనే బోనీ మళ్లీ నిలదొక్కుకున్నాడు. బూతు సినిమా అంటూ విమర్శలు వచ్చినా.. కమర్షియల్ గా అది వర్కవుట్ అయ్యింది. దీంతో బోనీ మళ్లీ బాలీవుడ్ లో నిలదొక్కుకున్నాడు.
సల్మాన్ తో వైరం బోనీకి కూడా ఇష్టం లేదు. అయితే కొడుకు ఆయన మాట వినలేదు. ఆ తర్వాత నో ఎంట్రీ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేశాడు బోనీ. సల్మాన్ అందులో నటిస్తాడని ప్రకటించుకున్నాడు. కానీ లోలోపల వ్యవహారం కాక మీదకు వచ్చింది. దీంతో.. నో ఎంట్రీ సీక్వెల్ నుంచి సల్లూ తప్పుకున్నాడు. ఎందుకు తప్పుకున్న విషయాన్ని కూడా ప్రస్తావించలేదు.
ఇక ఇప్పుడు మలైకా- అర్జున్ కపూర్ అన్నింటినీ పక్కన పెట్టి హ్యాపీగా తిరుగుతున్నారు. దీంతో సల్మాన్ కు మరింత కోపం వస్తోందని బాలీవుడ్ మీడియా వర్గాలు చెబుతున్నాయి. బోనీ కపూర్ ను కానీ, అర్జున్ కపూర్ ను కానీ..తను ఉన్న ఛాయలకు కూడా రానివ్వొద్దు అని సల్మాన్ గట్టి వార్నింగ్ పాస్ చేశాడట బాలీవుడ్ లో!
అనుభవంలేని క్రిష్, సాయిమాధవ్… ప్రకాష్‌రాజ్, మురళిశర్మలతో పోటీపడ్డారా?