బయోపిక్.. మరో పాట రెడీ

ఎన్టీఆర్ బయోపిక్ కు సంబంధించి ఓ పాట బయటకు వచ్చింది. శుద్ధ వ్యావహారిక పదాలతో కూడి, నటుడిగా ఎన్టీఆర్ ఘనకీర్తిని కీర్తిస్తూ, సంగీత దర్శకుడు కీరవాణి తండ్రి శివశక్తి దత్త రాసిన పాటను ఇప్పటికే…

ఎన్టీఆర్ బయోపిక్ కు సంబంధించి ఓ పాట బయటకు వచ్చింది. శుద్ధ వ్యావహారిక పదాలతో కూడి, నటుడిగా ఎన్టీఆర్ ఘనకీర్తిని కీర్తిస్తూ, సంగీత దర్శకుడు కీరవాణి తండ్రి శివశక్తి దత్త రాసిన పాటను ఇప్పటికే విడుదల చేసారు. ఇప్పుడు మరో పాట విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.

ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలుగా విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. అందుకే ఇప్పుడు రెండో భాగంలోని ఓ పాటను త్వరలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రెండోభాగం మహా నాయకుడులో రాజకీయనాయకుడిగా ఎన్టీఆర్ కీర్తిని, ఆయన విజయాలను సాగే పాటను ఇప్పుడు విడుదల చేయబోతున్నారు.

ఈ పాట కూడా మొదటి పాట మాదిరిగానే కాస్త జటిలమైన పదాలతోనే సాగుతుందని తెలుస్తోంది. రెండు భాగాలకు కలిపి ఒకటే ఆడియోగా అందించనున్నారు. సినిమాలోని 11 పాటల్లో రెండవ పాటను త్వరలో విడుదల చేస్తారు. ఇదికాక సినిమాలో రెండు మెడ్లీలు వుంటాయని తెలుస్తోంది.

అంటే ఎన్టీఆర్ సినిమాల్లోని పలు పాటల పల్లవులు జస్ట్ కట్ చేసి, రెండు మెడ్లీలుగా రూపొందించినట్లు తెలుస్తోంది. వాటిలో బాలయ్య ఆయా గెటప్ ల్లో కనిపిస్తారన్నమాట. సాధారణంగా అడియో ఫంక్షన్ ల్లో ఇలాంటి మెడ్లీ ప్రయోగాలు చూస్తుంటాం. బయోపిక్ లో ఇప్పుడు అదే చేసి, ఆ గెటప్ ల్లో బాలయ్యను చూపించబోతున్నారు.

మంత్రిగారికి ఓటమి తప్పదు.. చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్