లక్ష్మీ ప్రణతి? ఎందుకంత సీరియస్?

సినిమా వాళ్లయినా, వాళ్ల ఫ్యామిలీ లయినా ఫొటోలు, ఫంక్షన్ లు అంటే సరదా ఓ రేంజ్ లో వుంటుంది. నవ్వుతూ తుళ్లుతూ కనిపిస్తారు. కనీసం ఫొటోల కోసమైనా 'స్మయిల్ ప్లీజ్' కు సై అంటారు.…

సినిమా వాళ్లయినా, వాళ్ల ఫ్యామిలీ లయినా ఫొటోలు, ఫంక్షన్ లు అంటే సరదా ఓ రేంజ్ లో వుంటుంది. నవ్వుతూ తుళ్లుతూ కనిపిస్తారు. కనీసం ఫొటోల కోసమైనా 'స్మయిల్ ప్లీజ్' కు సై అంటారు. కానీ ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతి వైఖరి చిత్రంగా వుంది.

జస్ట్ ఒకటి రెండు రోజుల క్రితం ఈస్ట్ గోదావరి జిల్లా వేళంగిలో ఎన్టీఆర్ అన్న పిల్లల పంచెల ఫంక్షన్ అయింది. జస్ట్ క్లోజ్ ఫ్యామిలీ జనాలు మాత్రం హాజరయ్యారు. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఇద్దరు సతీసమేతంగా హాజరయ్యారు. ఈ వేడుక ఫొటోలు మీడియాలోకి వచ్చాయి. కానీ ఏ ఫొటో చూసినా లక్ష్మీ ప్రణతి చాలా మూడీగా, చాలా సీరియస్ గా, ఏదో తప్పని సరిగా అన్నట్లు కనిపించడం ఆశ్చర్యం కలిగించింది. దాదాపు అన్ని ఫొటోల్లోనూ ఆమె అలాగే కనిపించారు.

పైగా చుట్టూ జనాలు వున్నా, ఎవరితోనూ ముచ్చట్లు ఆడుతున్నట్లు కానీ, నవ్వులు చిందిస్తున్నట్లు కానీ కనిపించలేదు. మిగిలిన వారు మాత్రం మరీ ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నట్లు కనిపించకపోయినా, కాస్తయినా హుషారు మొహాల్లో కనిపించింది.