సరైనోడు టీజర్ డిటయిల్స్

ప్రేక్షకులు, అభిమానులు ఆసక్తి కరంగా ఎదురుచూస్తున్నారు..సరైనోడు టీజర్ కోసం. ఈ నెల 18న అంటే రేపే ఆ టీజర్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. బోయపాటి పవర్ ఫుల్ డైరక్టర్, బన్నీ లాంటి స్టార్ ను…

ప్రేక్షకులు, అభిమానులు ఆసక్తి కరంగా ఎదురుచూస్తున్నారు..సరైనోడు టీజర్ కోసం. ఈ నెల 18న అంటే రేపే ఆ టీజర్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. బోయపాటి పవర్ ఫుల్ డైరక్టర్, బన్నీ లాంటి స్టార్ ను ఎలా చూపించబోతున్నాడన్నది ఇఫ్పటికే తెలిసింది. షార్ప్ కట్స్ వున్న బాడీ బిల్డ్ తో షార్ట్ హ్యాండ్స్ టైట్ షర్ట్ తో బన్నీ కనిపించాడు. అయితే ఇంతకీ టీజర్ లో ఏం చూపిస్తాడు..అలా అలా నడిచి వస్తాడా..లేదా ఏదైనా డైలాగ్ చెప్తాడా అన్నది ఆసక్తి రేకెత్తిస్తున్న విషయం. దీనికి సంబంధించి గ్రేట్ ఆంధ్ర ఎక్స్ క్లూజివ్ రిపోర్ట్ ఇది.

సరైనోడు టీజర్ లో ఓ పవర్ ఫుల్ డైలాగు వుంది…..’’..ఎర్రతోలు వుందని..క్లాస్ అనుకుంటున్నావేమో…మాస్…పక్కా మాస్…’ అలా డైలాగ్ ఫినిష్ కావడం ఏమిటి..బన్నీ ఒంటి చేత్తో ఒకడ్ని పైకి ఎత్తి నేల మీద దబ్బున కుదేస్తాడు..బ్యాక్ డ్రాప్ లో పులివేషాలతో వున్న వాళ్లు స్లోగా జంప్ కావడం కనిపిస్తుంది…

తెలిసిన వివరాల ప్రకారం ఇదీ టీజర్..పక్కా అవునో కాదో తెలియడానికి వెయిట్ ఫర్ ఫ్యూ

 హవర్స్. అన్నట్లు శ్రీమంతుడులో మహేష్ రెండు చేతుల్తో ఒకడ్ని ఎత్తి కుదేసిన సంగతి గుర్తుందిగా..ఇక్కడ బన్నీఒక్క చేయే వాడతాడు. అదీ ఫినిషింగ్ టచ్.