సినిమా హీరోలు సమయాన్ని బట్టి మాట్లాడుతుంటారు. ఈవైనం కుర్ర హీరో సాయి ధరమ్ తేజ కు కూడా వంటబట్టేసినట్లుంది. నిన్న మొన్నటి దాకా ఆయన సన్నిహితులు ఎవరైనా, లేదా తెలిసిన వారు రేయ్ గురించి అడిగినా..తనకు ఏమీ తెలియదు..వస్తే వచ్చినట్లు, రాకుంటే రానట్లు అనే టైప్ లో సమాధానం ఇచ్చేవాడట. చూద్దాం..27న విడుదలైతే..విడుదలైంది అనుకుందాం అనేవాడట.
ఇప్పుడు ఇక దగ్గరకు వచ్చేసరికి, విడుదల ఖాయం అని తెలిసింది కాబట్టి, ఇంత కష్టం..అంత కష్టం..చౌదరి ఇంత బాగా చేసాడు.అంతలా చేసాడు అని కబుర్లుచెప్పేస్తున్నాడు. మరోపక్క తన స్వంత పబ్లిసిటీ తాను చూసుకోవాలన్న వైనం కూడా వంట బట్టేసినట్లుంది..మీడియాలో కొంత మందిని పిలిచి పార్టీలిచ్చి మంచి చేసుకునే పనిలో పడ్డాడని వినికిడి.
ఫరవాలేదు, రెండు సినిమాలకే తేజుకు టాలీవుడ్ లో ఎలా టాకిల్ చేసుకురావాలో తెలిసిపోయింది. కానీ ఎటొచ్చీ ఇవన్నీ సినిమా బాగుంటే బాగానే వుంటాయి. కానీ తేడా వస్తేనే..