టాలీవుడ్ లో ఆఫ్ ది రికార్డుగా ఎవర్ని అడిగినా, నాగార్జున కోట్లీశ్వరుడే అని అంటారు. కనీసం అయిదు వేల కోట్ల ఆస్తిపరుడు అని టాక్. ఇటీవలి కాలంలో నాగ్ పొగొట్టుకన్నది ఏమీ లేదు. పైగా టీవీ రియలిటీ షోల పుణ్యమా అని అన్నపూర్ణ స్టూడియో కిటకిటలాడుతోంది. సినిమాల వల్ల కూడా నాగ్ నష్టపోయింది లేదు. ఆఖరికి డిజాస్టర్ అయిన భాయ్ వల్ల కూడా.
నాగ్ వ్యాపారాలు ఇన్నీ అన్నీ కావు. హోటళ్లు, రేస్ టీమ్ లు, రియల్ ఎస్టేట్, డిస్ట్రిబ్యూషన్, ప్రొడక్షన్, స్టూడియో ఎన్నో. ఎవర్ని అడిగానా నాగ్ తెలివైన వ్యాపారవేత్త అనే అంటారు. ఇటీవల మా టీవీ అమ్మకంలో వందల కోట్లు నాగ్ కు వచ్చే అవకాశం ఏర్పడింది. ఇక హీరోగా, టీవీ ప్రెజెంటర్ గా కూడా సంపాదన బాగానే వుంది.
మరి రెండు బ్యాంకులకు 60 కోట్లకు పైగా చెల్లించలేకపోవడం ఏమిటి? నాగ్ తలుచుకుంటే ఇదే మంత పెద్ద మొత్తం కాదనే టాలీవుడ్ జనాలు అంటారు. మరి నాగ్ ఎందుకు చెల్లించడం లేదు? దీనికి కొన్ని కారణాలు వినవస్తున్నాయి.
ఈ అప్పుకు నాగ్ ఇతరత్రా వ్యవహారాలకు సంబంధం లేదు. ఇది కేవలం అన్నపూర్ణ స్టూడియో అప్పు. ఇందులో నాగ్ కీలక భాగస్వామి. కొంత వరకు సోదరుడికి కూడా వుంది. అందువల్ల ఈ అప్పు తీర్చాలంటే స్టూడియో ఆదాయం మీదే తీర్చాలి తప్ప, నాగ్ స్వంత నిధుల నుంచి తీర్చడానికి లేదు.
పోనీ నాగ్ స్వంత నిధుల నుంచి తెస్తా అన్నా, స్టూడియోలో మిగిలిన భాగస్వాములు కూడా అలా తేవాల్సి వుంటుంది. వారు అలా తేలేరని వినికిడి. అందుకే ఇప్పుడు ఈ రుణాలు రీషెడ్యూలు చేయించుకుని, వడ్డీ మాఫీ వంటి సదుపాయలు సంపాదించి, మెలమెల్లగా తీర్చే పని చేపడతారని వినిపిస్తోంది.
ఇదిలా వుంటే, ఎన్నికల ముందు నాగ్ కు జగన్ తో, నిమ్మగడ్డ ప్రసాద్ తో కీలక సంబంధాలు వున్నాయని వదంతులు వినిపించాయి. అయితే ఇప్పుడు ఇక రివర్స్ లో వినిపించడం ప్రారంభిస్తాయి. నాగ్ పాపం..బ్యాంకు లోన్ కట్టలేకపోతున్నాడు.అంటే నాగ్ దగ్గర డబ్బులు లేవన్నమాట. జగన్, ప్రసాద్ తో సంబంధాలు వుంటే డబ్బులకు కొదవేముంది. అంటే లేవనే అనుకోవాలి..అనే విధంగా ఫ్రజల్లో టాక్ పుడుతుంది.
ఇప్పుటికిప్పుడు బ్యాంకులు అన్నపూర్ణ ఏడెకరాలను స్వాధీనం చేసుకుని ఏం చేస్తాయి. రోజు వారీ కార్యకలాపాలు అయితే ఆగవు. అవి సాగుతూనేవుంటాయి. అమ్మకానికి ప్రయత్నిస్తాయి. అందుకు కోర్టు కేసుల ద్వారా అడ్డం పడొచ్చు. అదంతా అయ్యే సరికి ఇంకా మరింత కాలం పడుతుంది. మరీ పీకల మీదకు వస్తే, కట్టడానికి పెద్ద సమస్య కాదు. లేదంటే, బ్యాంకులే దిగివచ్చి,వన్ టైమ్ సెటిల్ మెంట్, లేదా రీ షెడ్యూలింగ్ వంటి ప్రతిపాదనలు తెస్తాయిు.అప్పుడు చూసుకోవచ్చు.
ఈ లోగా పత్రికల్లో ప్రకటనలు, వార్తలు, గ్యాసిప్ లు అంటారా..వీటిని సెలబ్రిటీలు, వ్యాపారం చేసుకునేవారు, పట్టించుకోరు. ఎవరు ఏం అనుకుంటేనేం..మన పని బాగానే వుంది..మన పని మనకు జరుగుతోంది అనే ఆలోచిస్తారు. అలా కాకుండా అయ్యో, పత్రికల్లో వార్తలు వస్తున్నాయే అనుకుంటే బడా వ్యాపార వేత్త కాలేరు. నిన్నటి కింగ్ ఫిషర్, డెక్కన్ క్రానికల్, ఇప్పటి లియోనియా రిసార్ట్స్, ఇలా చాలా మంది వున్నారు. ఇలా భావించేవారు. వాళ్లందరితో పొలిస్తే నాగ్ అప్పు..ఆవగింజంత.