మొహాలీలో తిప్పేశారుగానీ…

మొహాలీ టెస్ట్‌లో టీమిండియా బౌలర్లు తిప్పేశారు.. ఫలితంగా సౌతాఫ్రికా 184 పరుగులకు పరుగులకే తొలి ఇన్నింగ్స్‌లో చాప చుట్టేసింది. ఫలితంగా టీమిండియాకి 17 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం లభించింది. ఇక్కడ సంబరపడిపోవడానికేమీ లేదు.…

మొహాలీ టెస్ట్‌లో టీమిండియా బౌలర్లు తిప్పేశారు.. ఫలితంగా సౌతాఫ్రికా 184 పరుగులకు పరుగులకే తొలి ఇన్నింగ్స్‌లో చాప చుట్టేసింది. ఫలితంగా టీమిండియాకి 17 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం లభించింది. ఇక్కడ సంబరపడిపోవడానికేమీ లేదు. రెండో రోజు మధ్యాహ్నానికే రెండు జట్లూ తొలి ఇన్నింగ్స్‌ పూర్తి చేసేశాయంటే పిచ్‌ ఏ స్థాయిలో బౌలర్లకు.. మరీ ముఖ్యంగా స్పిన్నర్లకు సహకరిస్తోందో అర్థం చేసుకోవచ్చు. 

టీమిండియా ముందు ఇప్పుడు పెద్ద టాస్కే వుంది. భారమంతా ఇప్పుడు బ్యాట్స్‌మెన్‌దే. సరైన ఇన్నింగ్స్‌ పడితే తప్ప సఫారీలను మొహాలీ టెస్ట్‌లో ఓడించే అవకాశముండదు. మ్యాచ్‌ డ్రా అయ్యే అవకాశాల్లేవని దాదాపు చెప్పేయొచ్చు. వీలైనన్ని ఎక్కువ పరుగులు టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో చేస్తేనే, సౌతాఫ్రికాని ఇరకాటంలో పెట్టడానికి వీలవుతుంది. 

తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 200 పరుగులు కూడా చేయలేదు కదా.. అని టీమిండియా లైట్‌ తీసుకుంటే పప్పులో కాలేసినట్లే అవుతుంది. స్పిన్‌ని ఆడటంలో సౌతాఫ్రికా వీక్‌ అయినా, డివిలియర్స్‌ ఒక్కడు నిలబడితే మ్యాచ్‌ స్వరూపమే మారిపోతుంది. ఈ పరిస్థితుల్లో టీమిండియా ఛాన్స్‌ తీసుకోవడానికి వీల్లేదు. 

రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా ఎన్ని పరుగులు చేస్తుందన్నదానిపైనే మొహాలీ టెస్ట్‌లో టీమిండియా ఫేట్‌ ఆధారపడి వుంటుంది. ఇంకోపక్క టీమిండియాని 201 పరుగులకే ఆలౌట్‌ చేసిన సౌతాఫ్రికా, రెండో ఇన్నింగ్స్‌లోనూ టీమిండియాని అంతకన్నా ఎక్కువ పరుగులు చేయనివ్వకూడదన్న కసితో వుంది.