మై నేమ్ ఈజ్ రాజు…కాదట

రామ్ చరణ్-రకుల్ జంటగా శ్రీను వైట్ల నిర్మిస్తున్న సినిమా సెట్ మీద వుంది. ఈ సినిమాకు మై నేమ్ ఈజ్ రాజు అనే పేరు పెడుతున్నట్లు ప్రచారంలో వుంది. కానీ విశ్వసనీయ వర్గాల సమాచారం…

రామ్ చరణ్-రకుల్ జంటగా శ్రీను వైట్ల నిర్మిస్తున్న సినిమా సెట్ మీద వుంది. ఈ సినిమాకు మై నేమ్ ఈజ్ రాజు అనే పేరు పెడుతున్నట్లు ప్రచారంలో వుంది. కానీ విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఆ సినిమా పేరు అది కాదట. మాంచి క్యాచీ పేరు కోసం ఆలోచస్తున్నారట. 

జగదేకవీరుడు-అతిలోకసుందరి సినిమాలో చిరంజీవి టైటిల్ అది. అదే ఈ సినిమా టైటిల్ అంటూ ఎవరో పుట్టించారు. అదే ప్రచారంలోకి వచ్చేసింది. కానీ ఇప్పుడు ప్రచారంలో వుంది కదా అదే టైటిల్ కన్ ఫర్మ్ చేయాలా అని ఒక ఆలోచన. కాదు.సినిమా సబ్జెక్ట్ కు తగినట్లు మాంచి టైటిల్ వెదుకుదామని మరో ఆలోచన. 

ఆఖరికి రెండో ఆలోచనే ఫైనల్ అయ్యేలా వుంది. సరైన టైటిల్ కోసం దర్శకుడు శ్రీనువైట్ల, నిర్మాత దానయ్య వెదుకుతున్నట్లు సమాచారం.