పేరు యుహీ తకషిమా. వయసు 64 సంవత్సరాలు. మాజీ స్కూల్ ప్రిన్స్ పాల్. మైనర్లు అయిన ఇద్దరు బాలికలతో శృంగారం చేసినందుకు గానూ అత్యాచార నేరం కింద జపాన్ పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఈ వ్యవహారం గురించి అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతుంటే అతడి నుంచి ఎన్నో ఆసక్తికరమైన.. ఆశ్చర్యకరమైన విషయాలు వెల్లడయ్యాయి!
తన జీవితంలో ఇప్పటి వరకూ రఫ్ గా 12 వేల మంది మహిళలతో శృంగారం చేశానని తకషిమా చెప్పుకొన్నాడు! అంతా వ్యభిచారమేనని.. డబ్బు ఇచ్చి శారీరక సుఖాన్ని కొనుక్కొన్నానని అతడు పోలీసులకు వివరించాడు. 1988లో స్కూల్ లో టీచర్ గా చేరినప్పటి నుంచి తను ఇలాంటి కెరీర్ మొదలు పెట్టానని.. ఒకసారి వెళ్లొచ్చిన వ్యభిచారిణి వద్దకు మరోసారి వెళ్లకుండా మొత్తం ఇప్పటి వరకూ 12000 మందితో అనుభవాలను పంచుకొన్నానని అతడు డీటెయిల్డ్ గా వివరించాడు.
మొత్తం 27 సంవత్సరాలు.. 14 నుంచి 70 యేళ్ల వయసు మధ్యనున్న మహిళలతో అనుభవాలు.. ఇలా ఉన్నాయి తకషిమా లెక్కలు! ఇతడు 12 వేలమందితో వ్యభించరించడం అనేది నేరం కాకపోవచ్చని.. అయితే మైనర్ లు అయిన అమ్మాయిలతో గడపడమే జపాన్ లో నేరం అవుతుందని అక్కడి పోలీసులు చెబుతున్నారు. అందుకే ఇతడిని అదుపులోకి తీసుకొంటున్నట్టుగా వారు వివరించారు.
మరి ఏదో ఇద్దరు మైనర్లు అయిన అమ్మాయిల వ్యవహారంలో తకషిమా అరెస్టయ్యాడు కానీ.. స్థూలంగా చూస్తే గడిపిన మొత్తం 12 వేలమందిలో దాదాపు పదిశాతం అంటే.. 12 వందల మంది అమ్మాయిలు మైనర్లేనట! ఇద్దరు మైనర్ల కేసులతోనే అరెస్టయ్యాడంటే, 1200 మంది కీ కలుపుకొంటే..ఇతడికి పడే శిక్ష ఎలా ఉంటుందో!